తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు...జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు...
తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు
తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు అభి ప్రాయపడ్డారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో జరిగిన అమర జీవి పొట్టి శ్రీరాములు 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో క్రాంతి నాయుడు మాట్లాడారు.పొట్టి శ్రీరాములు అనగానే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలర్పించిన వీరు డిగానే చాలా మందికి తెలుసని కానీ స్వాతంత్య్రో ద్యమంలోనూ ఆయన పాత్ర అమోఘమని,కుల రహిత సమాజం కోసం పోరాడారని,ప్రేమ,వినయం, సేవ నిస్వార్థతలు మూర్తీ భవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.మహాత్మాగాంధీ మన్ననలు పొందారన్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్య్రం సాధించవచ్చని గాంధీజీ అన్నా డని ఆయన 58రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించి,అమరజీవిగా నిలిచాడని కాంగ్రెస్ నాయకులు శ్రీ పొట్టి శ్రీరాములు కొనియాడారు.అదే విధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతు న్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు క్రాంతి నాయుడు పిలుపుని చ్చా రు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప,సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఎమ్మిగనూరు,కోడుమూరు కోఆర్డినేటర్లు ఎం.కాశీం వలి,అనంతరత్నంమాదిగ,ఐఎన్ టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా,ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ,ఐఎన్ టియుసి జిల్లా అ ధ్యక్షులు బి.బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్య క్షులు ఎన్సీ బజారన్న,ఓబీసీ సెల్ జిల్లా అధ్య క్షులు డి వి.సాంబశివుడు,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్,ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున,ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి యం సుంకన్న,మంత్రాలయం గోవర్ధన్ రెడ్డి,వెల్దుర్తి శేషయ్య,అబ్దుల్ హై,కేశవరెడ్డి,తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment