హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు...
హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమంయలో మహిళా నటీ మణుల పట్ల కొందరు రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి,ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికలపై వ్యక్తిగత విమర్శలు,అసభ్యకర వ్యా ఖ్యలు రాజ్యమేలుతున్నాయి.తమిళనాడు రాజ కీయ సంస్కృతిలో సినిమా రంగానికి,రాజకీ యాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అయితే,ఈ మధ్యకాలంలో కొందరు నేతలు విజ్ఞత మరిచి హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలను రోడ్డుకు ఈడుస్తున్నారు.గతంలో నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని కొందరు రాజకీయ నేతలు ఆమె గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడగా, తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారపై అన్నా డీఎంకే సీనియర్ నేత షణ్ముగం చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
అధికారం లేనప్పుడే ఇలా ఉంటే...అధికారం వస్తే ఎలా?
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని నటీ మణులను ప్రచారంలోకి లాగడం వెనుక కేవలం చౌకబారు పబ్లిసిటీ ప్లాన్లుఉన్నాయి.అధికారం లేనప్పుడే బహిరంగ సభల్లో ఇంతలా అసభ్యం గా ప్రవర్తిస్తున్న వారు,రేపు చేతికి అధికారం వస్తే ఇలాంటి తారలతో ఎలా వ్యవహరిస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల్లో తలెత్తుతోంది. దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా ఈ ధోర ణిని తీవ్రంగా ఖండించింది.ఎన్నికల సమయం లో సిద్ధాంతాల మీద కాకుండా,మహిళా నటీమ ణుల వ్యక్తిత్వంపై దాడి చేయడం అనాగరికమని సంఘం స్పష్టం చేసింది.
తమిళ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?
రాజకీయ చతురత కంటే వ్యక్తిగత దూషణలే ప్ర చార అస్త్రాలుగా మారుతున్న ఈ తరుణంలో, తమిళ ఓటర్ల స్పందన ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ వ్యాఖ్యలను త మ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా భావి స్తున్నారు.జయలలిత వంటి గొప్ప నాయకురా ళ్లు పాలించిన రాష్ట్రంలో మహిళా నటీమణులపై ఇలాంటి విమర్శలు రావడం ఆ పార్టీలకే నష్టం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.కేవలం మైకులు దొరికాయి కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడే నేతలకు,ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓ టు ద్వారా తగిన బుద్ధి చెబుతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మార్పు రావాల్సిన సమయం :
అగ్ర తారలకే రక్షణ లేని చోట,సామాన్య మహి ళల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవు తోంది.రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి తప్ప,ఒకరి వ్యక్తిగత జీవితాన్ని అపహాస్యం చేసే లా ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు హిత వు పలుకుతున్నారు.ఈ దారుణమైన ధోరణికి ఇప్పటికైనా చెక్ పడకపోతే,తమిళ రాజకీయాల ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది.ఈ అశ్లీల రా జకీయాల పై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మే, 4న వెలువడే ఫలితాల్లో తేలిపోనుంది.
Comments
Post a Comment