కూటమి ప్రభుత్వంలో ఉగాది కానుకగా యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల...చంద్రబాబు,లోకేష్ కు కృతజ్ఞతలు...కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్....
కూటమి ప్రభుత్వంలో ఉగాది కానుకగా యువ తకు జాబ్ క్యాలెండర్ విడుదల
చంద్రబాబు,లోకేష్ కు కృతజ్ఞతలు
కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఐటీ ఎల క్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్,మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు శుక్రవారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సం క్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియ చేశారు.శ్రీ ప్రరాభవ నామ సంవత్సరం కానుకగా యువతకు భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చు ట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవి ష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిం చిన కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.ఇప్పటికే 20నెలల్లోనే 6,28,347 ఉ ద్యోగాలను యువతకు అందించడం జరిగింది.
వీటితో పాటు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరి గింది.జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్య,పోలీస్ శాఖలకు పెద్దపీట వేయడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. నేడు మరోసారి డీఎస్సిని, జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను కేటా యించింది.ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశ గా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తుంది.పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక మైన గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టు లతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,0 00 పోలీస్ కానిస్టేబుల్,400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యువత భవిష్యత్ ను నాశనం చేసిన జగన్ ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి అధి కారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా మో సం చేశాడు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడు లు తీసుకరాకపోగా కమీషన్ల కోసం ఉన్న కంపెనీ లను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్య త్ ను నాశనం చేసింది.జగన్ పాలనలో యువత ఉద్యోగాలు,ఉపాధి లేక వేలాదిమంది నిరుద్యో గులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.వైసీపీ హ యాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రా డ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగంలో దేశంలోనే ఏపీ ప్రధమ స్థానంలో నిలిచింది.జగన్ పాలనలో విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రా ష్ట్రంలో ఉపాధి లేక 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఈ నేపథ్యంలో చం ద్రబాబు నాయుడు విద్యార్థి,యువతకు అన్ని విధాల అండగా నిలిస్తే...జగన్ రెడ్డి మాత్రం తన అవినీతి, అరాచక పాలనతో విద్యార్ధి,యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్ ని ప్రశ్నార్ధకం చేశారు.అభి వృద్ధితో పాటు సీఎం చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేశారు ఇచ్చిన హామీలతో పాటు,ఇవ్వని హామీ లు కూడా అమలు చేస్తున్నారు ఈ ఉగాది పం డుగ సందర్భంగా దివ్యాంగులకు సీఎం చంద్రబా బు ఉగాది కానుక అందజేశారు.ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకు ఆర్థి కంగా ఎంతో మేలు కలగజేస్తుంది.ఎన్నికల్లో హా మీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు ఇచ్చే రూ.4 వేల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచారు. ఇప్పటి వ రకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది.ఇకపై 21 వ ర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని కూటమి ప్ర భుత్వం విస్తరించడమే కాకుండా దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీని ఈ పథకం ద్వారా కల్పిస్తున్నారు.ఇం దుకోసం ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తారు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం జీరో ఫైర్ టికెట్ నాన్ స్టాప్, ఇంటర్ - స్టేట్,అల్ట్రా డీలక్స్,సప్తగిరి ఎక్స్ ప్రెస్, బస్సుల్లో 50శాతం రాయితీ కొనసాగుతుం ది.ఈ పథకం అమలు కోసం ఏడాదికి 207 కోట్ల ను ఆర్టీసీకి కూటమి ప్రభుత్వం చెల్లించనుంది.ఇ ప్పటికే స్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్లకుపైగా మ హిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిం చారు.మౌజమ్ లకు,ఇమామ్ లకు 45 కోట్ల గౌ రవ వేతనాలు మంజూరు చేశారు.దివ్యాంగుల కు పెద్దన్నలా చంద్రన్న అండగా నిలిచారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇదే నిజమైన ఉగాది అన్ని వర్గా ల ఇళ్లలోనూ ఆనందం నెలకొంది.
ఇప్పటివరకు జరిగిన ఉద్యోగాల కల్పన :
1. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 - డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి
2. ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి 2,48,906
3. జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627
4. పరిశ్రమల రంగం - 95,174
5. ఫుడ్ ప్రాసెసింగ్ - 64,035
6. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ – 13,866
7. పర్యాటక రంగం - 5,028
ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది.
Comments
Post a Comment