అక్రమ సంబంధం…మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు...
అక్రమ సంబంధం…మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు
అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా చంపిన ఘటన కలకలం రేపింది.వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం,కొడుపాక గ్రామానికి చెందిన సులోచన (35) భర్త చనిపోవ డంతో ఒంటరిగా జీవిస్తోంది.ఆమె మెదక్‌లో భవ న నిర్మాణ పనులకు వెళ్తుండగా అక్కడ మేస్త్రిగా పనిచేస్తున్న రాజుతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం తర్వాత వివాహేతర సంబంధంగా మారింది.అయితే అదే సమయంలో రాజుకు బూలీ అనే మరో మహిళతో కూడా సంబంధం ఉండటంతో గొడవలు మొదలయ్యాయి.రాజు బూలీతో సన్నిహితంగా ఉండటాన్ని సులోచన భరించలేక తరచూ గొడవ పడేది.దీంతో తమ సంబంధానికి అడ్డుగా మారుతున్న సులోచనను తొలగించాలనే కుట్రను రాజు,బూలీ పన్నారు. మార్చి,9న మద్యం తాగుదామని నమ్మించి సు లోచనను బైక్‌పై తీసుకెళ్లి ఏడుపాయల ఆల యం సమీపంలోని చెలిమేకుంట అనే నిర్జన ప్రదే శానికి తీసుకెళ్లారు.అక్కడ ముగ్గురూ కలిసి మ ద్యం సేవించిన తర్వాత సులోచన మత్తులోకి వెళ్లగానే కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు,వెండి ఆభరణాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.దొంగల దాడిలా చూపించి తప్పించుకోవాలని ప్రయత్నించారు.అయితే ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు,సీసీ కెమె రా ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు రా జు,బూలీని అరెస్ట్ చేశారు.
Comments
Post a Comment