వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు...కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు...

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు
కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు
VS9TV న్యూస్,చిన్నకోడూరు :
ఆస్తి రాసిచ్చిన తర్వాత కన్నతండ్రిని,తల్లిని పట్టించుకోకుండా,కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణ రెడ్డి (94) కు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమా ర్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపే టలో వ్యాపారం చేస్తుండగా,చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్‌లోనే వ్యవసాయం చేస్తున్నాడు.నారాయణరెడ్డి తనకున్న ఏడు ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమా నంగా (చెరి 3 ½ ఎకరాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇ చ్చారు.వయస్సు పైబడటంతో తమను చూసు కుంటారని ఆస్తిని అప్పగించగా,కొడుకులు మాట మార్చారు.తమను ఒక పాత ఇంట్లో ఉం చి,కనీస సౌకర్యాలు కల్పించకుండా,సరిగ్గా తిం డి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తు న్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే బూతు మాటలతో తిడు తూ,చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను,చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు.బా ధితుడు పోలీస్ స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్నం దున,అధికారులే నేరుగా నారాయణరెడ్డి నివా సానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకు లపై కేసు నమోదు చేయడం జరిగిందని,చట్టరీ త్య తగిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను ఈ సందర్భంగా తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...