రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జ్ఞాని ఆర్చరీ అకాడ మీ ఆర్చర్స్ ప్రతిభ...జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక...
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జ్ఞాని ఆర్చరీ అకాడ మీ ఆర్చర్స్ ప్రతిభ
జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక
నూజివీడులోని శ్రీ శారతి ఇంజనీరింగ్ కాలేజీలో
ఈ నెల 11,12,13 తేదీలలో నిర్వహించిన ఇంట ర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీ లలో జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఆర్చర్స్ ప్రతిభ చా టారు.ఈ పోటీలలో అండర్–10 విభాగంలో ఎన్.నంది రెడ్డి గుణిత్ రెడ్డి (4వ తరగతి,ఎడిఫై వరల్డ్ స్కూల్) అద్భుత ప్రదర్శనతో టాప్ టెన్‌లో నిలిచాడు. అలాగే అండర్–13 రికర్వ్ విభాగంలో కె. అవంతిక (7వ తరగతి,పి.ఎం.శ్రీ కేంద్రీయ విద్యాలయ,కర్నూలు) కూడా టాప్ టెన్‌లో స్థానం సంపాదించింది.ఈ విజయంతో వీరిద్దరూ జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక కావడం విశేషం.ముఖ్యంగా 13వ తేదీన జరిగిన రికర్వ్ విభాగ పోటీలలో జ్ఞాని ఆర్చరీ అకాడమీకి చెందిన ఆర్చర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ సంద ర్భంగా విజయం సా ధించిన క్రీడాకారులను కోచ్, అకాడమీ ప్రతినిధులు అభినందిస్తూ,భవిష్య త్తులో జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితా లు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Post a Comment