సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు...
సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈగిల్ టీమ్,ఆర్పీ ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీ ల్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను బట్ట బయలు చేశారు.ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి,వా రి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అరెస్టైన నిందితులు దీపక్ సాహూ (26), దీపక్ గౌడ (20) ఒడిశా, గంజాం జిల్లాకు చెందినవారు.గజపతి అడవుల్లో నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఢిల్లీకి తర లించే ప్రయత్నంలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ఐదు లక్షలు ఉంటుంది.
Comments
Post a Comment