నాలుగో స్తంభానికే ద్రోహమా?...జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి బీజేపీ అండ...

నాలుగో స్తంభానికే ద్రోహమా?
 
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి బీజేపీ అండ

పాలకుల కన్ను....జర్నలిస్టుల స్థలాలపైనేనా?

సొంతింటి కోసం కలం యోధుల పోరు

కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్

ఆ హామీలు ఏమయ్యాయి పొంగులేటి?

జర్నలిస్టుల దీక్షా శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సూటి ప్రశ్న
VS9TV న్యూస్,ఖమ్మం :
సమాజంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉంటూ,అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విలేకరులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది.శుక్రవారం ఈ దీక్షా శిబి రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రా వు,పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ రావు సం దర్శించి జర్నలిస్టుల పోరాటానికి సంఘీభావం తెలి పారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖ రిని,స్థానిక మంత్రుల నిర్లక్ష్యాన్ని వారు తీవ్రంగా ఎండ గట్టారు.అధికారంలోకి రా కముందు ఎన్నో హామీలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు,గద్దెనెక్కాక ఏ వర్గా న్నీ దగా చేయకుండా వదిలిపెట్టలేదని విమర్శించా రు.ప్రభుత్వ పథ కాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విలేకరు లను మోసం చేయడం పాలకుల పతనానికి నాంది అని వారు హెచ్చరించారు.ముఖ్యంగా రాష్ట్ర మంత్రు లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,తుమ్మల నాగేశ్వర రా వుల తీరుపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిం చారు.గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థ లాలు ఇవ్వకపోతే,తన సొంత డబ్బులతో ఇళ్లు నిర్మిం చి ఇస్తానని గొప్పలు చెప్పిన మంత్రి పొంగులేటి...ఇ ప్పుడు ఆ మాటలను ఎందుకు నిలబెట్టుకోవడం లే దని నిలదీశారు.ఎస్సార్ గార్డెన్స్ (ఫంక్షన్ హాల్) వెను క జర్నలిస్టుల కోసం గతంలో కేటాయించిన భూమిపై కొందరు పెద్దల కన్ను పడిందని,దాన్ని కబ్జా చేసే ఉద్దే శంతోనే పంపిణీలో ఉద్దేశపూర్వకంగా జా ప్యం చేస్తు న్నారని ఆరోపించారు.మరోవైపు,ఈ న్యాయమైన స మస్యను పరిష్కరించాల్సింది పోయి,ఈ వ్యవహారం లో తనను లాగొద్దంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రా వు దాటవేత ధోరణి అవలంబించడం దుర్మార్గమైన చ ర్యగా అభివర్ణించారు.అవినీతి,భూకబ్జాలతో వేల కోట్లు వెనకేసుకుంటున్న నాయకులు,సమాజం కోసం పనిచేసే విలేకరుల సొంతింటి కలను నెరవేర్చడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని బీజేపీ నేతలు ప్ర శ్నించారు.ప్రభుత్వం కల్లబొల్లి మాటలు కట్టి పెట్టి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే ప్రక్రి యను తక్షణమే వేగవంతం చేయాలని ముక్త కంఠం తో డిమాండ్ చేశారులేనిపక్షంలో విలేకరుల పక్షాన నిలబడి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని,ప్రభు త్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మందడపు సుబ్బా రావు,రవి రాథోడ్,మంద సరస్వతి,మారుతినేని వీర భద్ర ప్రసాద్,గడిలా నరేష్,రాము,తదితరులు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...