విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహి ళా ఎస్సై...విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చ ర్యలు...పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై
విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు 
పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం
VS9TV న్యూస్ భూపాలపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తు న్నారనే సమాచారం అందుకున్న వెంటనే,పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు.ఖాకీ యూనిఫాం వదిలి,సాధారణ విద్యార్థి నిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్త కాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థి నుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు లు,పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుది ట్టం చేశారు.ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు,విద్యార్థినులు ధైర్యంగా పరీక్ష లకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్ర తకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.అవ సరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం పోలీ సులు ముందుండి పనిచేస్తారని మహిళా ఎస్సై అమూల్య చర్య ద్వారా స్పష్టమైంది.స్థానికులు ఆమె ధైర్యాన్ని,సమయస్ఫూర్తిని అభినందిస్తూ,ఇటువంటి చర్యలు సమాజంలో భద్రతను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.ఈ సంఘటన ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని,ఇకపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠినచర్యలు త ప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...