ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ డే...సిఐ శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ డే
సిఐ శేషయ్య,మూడవ పట్టణ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేర కు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆద్వర్యంలో నగరంలోని బుధవారపేట శనివారం మెగా కార్డ న్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.
పోలీసు అధికారులు,సిబ్బంది,స్పెషల్ టీమ్‌లు కలిసి గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలలో విస్తృ తంగా తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అను మా నం ఉన్న ప్రాంతాలు,అద్దె ఇళ్లు,విద్యార్థుల హాస్ట ళ్లు,పీజీ నివాసాలు,చిన్న లాడ్జీలు,ఖాళీ భవనా లు,ఇతర అనుమానాస్పద ప్రదేశాలు,పాత గం జాయి,నార్కోటిక్ కేసులలో ఉన్న ముద్దాయిల ను పోలీసులు సోదాలు చేశారు.ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా కర్నూలు మూడవ పట్టణ సిబ్బంది మొత్తం 50 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టినట్లు సిఐ శేషయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు, వాహ నాల వివరాలు,అనుమానాస్పద వ్యక్తులపై పరిశీలన చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా
మొత్తం 120మంది వ్యక్తులను తనిఖీ చేశారు.
50 వాహనాలను తనిఖీ చేశారు.సరైన పత్రాలు లేని 10 వాహనాలను గుర్తించారు.తరువాత వాహనాల పత్రాలు చూపిన తరువాత వాటిని తిరిగి సదరు వాహన యజమానులకు వారికీ అప్పగించారు.రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారికీ సత్ప్రవర్త నతో మెలగాలని సూచించారు.అదేవిదంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య,సామాజిక,చట్టప రమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు.గంజాయి,ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని,కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చే వారి వివరాలు పూ ర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చా రు.అనంతరం పోలీసు అధికారులు,సిబ్బంది, ప్రజలతో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ నిర్వ హించి,మాదకద్రవ్యాలకు వ్యతి రేకంగా పోరాడా లని ప్రతిజ్ఞ చేశారు.సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమ ని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్ర వ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా ఆపరేషన్ వజ్రప్రహార్ కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొన సాగుతాయని పోలీసులు తెలిపారు.ప్రజల సహ కారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పే ర్కొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...