అమరజీవి త్యాగం - యువతకు స్ఫూర్తి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

అమరజీవి త్యాగం - యువతకు స్ఫూర్తి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అమ రజీవి శ్రీ పొట్టి శ్రీరాములుజయంతిని పురస్కరిం చుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901, మార్చి 16న జన్మించారన్నారు.ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మద్రాసులో జరిగిందన్నా రు.ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, సుమారు నాలుగేళ్ల పాటు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో ఉద్యోగం చేశార న్నారు. 1922లో తన బిడ్డ,భార్య చనిపోయిన తర్వాత,ఆయన తన జీవితాన్ని సామాజిక సే వకు అంకితం చేశారన్నారు.గాంధీజీ బోధనలకు ప్రభావితులై సబర్మతి ఆశ్రమంలో చేరారన్నారు. ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్ర్య పోరాటాల్లో చురు గ్గా పాల్గొన్నారన్నారు.దళితుల హక్కులు,దేవా లయ ప్రవేశం కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఖాదీ ప్రచారం,పేదల అభ్యున్నతి కోసం నిరంత రం శ్రమించారన్నారు.తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1952లో చెన్నైలో ఆమరణ నిరా హార దీక్ష చేపట్టారన్నారు. 58 రోజుల సుదీర్ఘ పో రాటం తర్వాత,1952,డిసెంబర్,15న ఆయన అమరులయ్యారన్నారు.ప్రస్తుత యువత పొట్టి శ్రీరాములు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.దేశం మనకేమి ఇచ్చింది అన్నదాని కంటే,మ నం దేశానికి ఏమి చేయగలం అని ఆలోచించా లని,సోషల్ మీడియా వంటి వ్యాపకాలలో పడి జీవితాన్ని వృధా చేసుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు.డిసిఎమ్ఎస్ చైర్మన్ నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు ప్రజలందరూ నేటికీ స్మరించుకుంటున్నారన్నారు.
రాజధాని అమరావతిలో 58అడుగుల పొట్టి శ్రీరా ములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసి నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.పొ ట్టి శ్రీరాములు ఆశయాలను భావితరాలకు తెలియజే యడమే ఈ విగ్రహావిష్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అన్నారు.ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేయడం జరిగిందన్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృ ష్ణమ్మ మాట్లా డుతూ మనమందరం కూడా పొట్టి శ్రీ రాములు గురించి చాలా విన్నాం అన్నారు. అదే వి ధంగా ఇది కేవలం నేడు జ్ఞాపకం చేసుకొని వెళ్ళి పో యేది కాదని,మన ప్రాణం ఉన్నంతవరకు ప్రతి ఒక్క రం కూడా,తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆ యన నామస్మరణం చేయాల్సిందే అన్నారు.ఎందు కంటే అంతటి గొప్ప త్యాగాన్ని చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఆయన తన ప్రాణాన్నే అర్పించి రాష్ట్రం కోసం నిలబడిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరం ఆయన్ని గుర్తుంచు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మన భావితరాల పిల్లలకు స్వాతంత్ర్య సమరయోధులు ఎంతమంది ఉన్నారు. మన రాష్ట్రం కోసం,దేశం కోసం ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు అనేది కూడా చెప్పాలన్నారు.మరి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మొదలుకొని స్కూల్లో వరకు కూడా ఆయన గురించి ఏదో ఒక సందర్భంలో చెబుతూ ఉంటే పిల్లలకు కూడా తెలుస్తదన్నారు.రాష్ట్ర ప్రభు త్వం పొట్టి శ్రీరాములుని గౌరవిస్తూ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతో షం అన్నారు.వాళ్ళ సేవల్ని ప్రజలు గుర్తుంచు కోవాలనే ఉద్దేశంతోనే నేడు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన విశిష్ట సేవల గురించి బొందిల్ల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్,బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఉప్పరి కార్పొరేషన్ డైరెక్టర్ రామగిడ్డయ్య,సదర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్,ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీ రాములు కమిటీ అధ్యక్షులు శేషగిరి శెట్టిలు కొని యాడారు.అనంతరం జిల్లాలో పొట్టి శ్రీరాములు కమిటీ తరపున అనేకమైన సేవా సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు కమిటీ అధ్యక్షులు శేషగిరి శెట్టి,డాక్టర్ రంగయ్య లలితా సంఘం జ్ఞానేశ్వర్ అమ్మ అవొపా రత్న ప్రసాద్,మారం నాగరాజు సుబ్బి స్వామి చీమకూరు రాజశేఖర్ గాయత్రి గోశాల రాజ్యలక్ష్మి పెరుమాళ్ళ దత్తయ్య ఎన్వి శ్రీనివాసులు రామచంద్రయ్య నందకిషోర్ లను జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి సన్మానం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల వి గ్రహ ఆవిష్కరించే కార్యక్రమమును వీడియో కా న్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్,ప్రజా ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ నాయకులు తిలకించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమ ర్,సెట్కూరు సిఈఓ వేణుగోపాల్,బి సి వెల్ఫేర్ అ ధికారి ప్రసూన,ఈ.డి.జాకీర్ హుస్సేన్,సోషల్ వె ల్ఫేర్ అధికారి రాధిక,ఆర్య వైశ్య సంఘ నాయకు లు శేషగిరి శెట్టి,డాక్టర్ రంగయ్య జ్ఞానేశ్వర్ అ మ్మ,ఇంజనీరింగ్ కాలేజ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...