మాజీ డీజీపీ హెచ్.జె.దొర కన్నుమూత...
మాజీ డీజీపీ హెచ్.జె.దొర కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హెచ్.జె.దొర కన్నుమూ శారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మ ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన మర ణంతో కుటుంబ సభ్యులు,స్నేహితులు,పోలీస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో హెచ్.జె.దొర డీజీపీగా కీలక బాధ్య తలు నిర్వహించారు.గ్రేహౌండ్స్ దళాన్ని బలో పేతం చేయడంలో,నక్సలిజంపై వ్యూహాత్మకంగా పోరాడటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించా రు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సాంకేతికతను ప్ర వేశపెట్టడం,కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధుని కీకరించడం వంటి పలు సంస్కరణలకు ఆయన నాంది పలికారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదున్నర సంవత్సరాలకు పైగా డీజీపీగా సేవలం దించిన అరుదైన రికార్డు ఆయన సొంతం.అప్ప టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన విశ్వసనీయ అధికారిగా గు ర్తింపు పొందారు.డీజీపీ పదవీ విరమణ అనంత రం కేంద్ర నిఘా విభాగంలో విజిలెన్స్ కమిషనర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ప్రజాసేవలో త న ప్రత్యేక ముద్ర వేశారు.
Comments
Post a Comment