గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి... సిపిఎం నిరసన...

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి
సిపిఎం నిరసన
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుక్ చే సుకున్న కస్టమర్లకు సరైన సమయానికి గ్యాస్ సిలిం డర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని పూల బజార్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్ దేశాయి అధ్యక్షతన మంగళవా రం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమాన్ని ఉద్దే శించి సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.విజయ్, కే.రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా,ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని,ఈ మధ్యకాలం లో ఇంటికి వాడుకునే గ్యాస్ సిలిండర్ పై రూ.66 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.105 పెంచడం జరిగిందని అన్నారు.అయినా ప్రజలు భరిస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న కష్టమర్లకు ఫోన్ చేసి మీకు ఓటిపి నంబర్ వస్తుంది చెప్పండి అని ఓటిపి నెంబర్ చెప్పించుకున్న తర్వాత ఆ సిలిండర్ ను కస్టమర్ కు ఇవ్వకుండా హోటళ్లకు,చిరు వ్యాపారులకు బ్లాక్ లో రూ.2000 నుండి రూ.2,500 వరకు అమ్ముకోవడం జరుగుతుందని చెప్పారు.గ్యాస్ డెలివరీ బాయిస్, గ్యాస్ ఏజెన్సీల లీలలు అంతా ఇంతా కాదని తెలియ జేశారు.ఒకవైపు నిత్యవసర వస్తువులు పెరగడం,మ రోవైపు గ్యాస్ బుక్ చేసు కున్నప్పటికీ సరైన సమ యానికి అందకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ల క్ష్యమేనని విమర్శించారు.మన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుండి ముడి చమురు రూపాయలలో కొని రిలయన్స్ కు కట్టబెడుతున్నాడని,ఈ దేశ ప్రజల క న్నా కార్పొరేట్ శక్తులైన ఆదానీ,అంబానీలే ఎక్కువ య్యారని ప్రజలకేమో కష్టాలు ఆధాని,అంబానీలకు సబ్సిడీలు ఇవ్వడం ఇది చాలా దుర్మార్గమని విమ ర్శించారు.అమెరికా,ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సర ఫరాలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవని,ఇరాన్ నుండి వచ్చే గ్యాస్ కార్గో షిప్పులకు మన జెండా ఉంటే ఫ్రీగా వదిలే పరిస్థితి ఉందని అన్ని పత్రికలలో ప్రముఖంగా వస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి గ్యాస్ వాడే కస్టమర్లను ఇబ్బందికి గురి చేయడం సరైన పద్ధతి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు చాంద్,ఇస్మాయిల్,గిడ్డయ్య,ప్రకాష్,వెంకటేశ్వర్లు,రా మాంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...