ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు... విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు
విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాం త వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.సోమవారం స్థానిక ఏ క్యాంప్ లోని ఇందిరాగాంధీ స్మారక నగరపా లక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తర గతి పబ్లిక్ పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో విద్యా ర్థులకు కల్పించిన వసతులు,పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.ఇన్విజిలేటర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వ హించాలని,అనధికార వ్యక్తులు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి రాకుండా చూడాలని కలెక్టర్ బందో బస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ఆదేశిం చారు. 160 పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావర ణంలో పరీక్షలు జరిగేలా గట్టి చర్యలు తీసుకోవా లని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ను ఆదేశించారు.కర్నూలులోని శ్రీ చైతన్య పాఠ శాల పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా మృతి చెందడం పట్ల కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతిని,సంతా పం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూ రాలని కలెక్టర్ భగవంతుడిని ప్రార్థించారు.
Comments
Post a Comment