కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుందిటిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ....

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది
టిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గత బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు.గురువారం ఆమె జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నుండి పత్రికల వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని అన్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గం వారికి కూడా న్యాయం చేకూర్చలేదని చె ప్పారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చివేసి,తన అను యాయులకు దోచి పెట్టేందుకు ఎన్నో అక్రమ మార్గాలను చూపించాడని,అలాంటి వ్యక్తి నేడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ముసలి కన్నీరు ఖర్చడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవ త్సరాల పాలనలో రాష్ట్రంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు.ప్రజలకు వివ రిస్తే బాగుంటుందని సూచన చేశారు.జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకే తన పూర్తి సమయాన్ని కేటాయించారని,ఏ కారణం లేకుం డా ఆనాడు అరెస్టుల పర్వం కొనసాగించారని గుర్తు చేశారు.జగన్మోహన్ రెడ్డి హయాంలో చెత్త పై కూడా పన్ను వేసి,ఆ సొమ్మును కూడా తన అనుయాయులకు చేరేలా కృషి చేశాడు తప్ప ప్రజలకు ఆయన చేసిన మేలు శూన్యమన్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోసపూ రితమైన మాటలను నమ్మిన రాష్ట్ర ప్రజలు 201 9లో అధికారాన్ని కట్టబెడితే ప్రజలను నానా ఇ బ్బందులకు గురి చేశారని,అందువల్లనే జగన్మో హన్ రెడ్డి గారికి 2024సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి,కూటమి పార్టీలకు 164 స్థానా లను అప్ప చెప్పారని పేర్కొన్నారు.జగన్మో హన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తమ కక్ష తీర్చుకున్నారని అన్నారు.అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అ ధికారాన్ని కోల్పోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని, జగన్మోహ న్ రెడ్డి గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ప్ర జల మధ్యన చిచ్చు రేపేందుకు కుట్రలు చేస్తు న్నారని చెప్పారు.తన కలబొల్లి మాటలను నమ్ముతారని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి మరల ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఒకసారి నమ్మి మోసపోయిన ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ మాటలను నమ్మి మోసపోయే స్థితిలో లేరన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చ రిక చేశారు.తనలాగా చంద్రబాబునాయుడు ఏ రోజు పరదాల చాటు రాజకీయం చేయలేదని, అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి శ్రేయస్యే ధ్యేయంగా పనిచేయుచున్నారని,జగన్ చేసే ఆరోపణలను చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్లు జగన్ ధోరణి ఉందని వారు తెలియ జేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...