ఆంధ్రుల అందాల నటుడు మహిళ ప్రేక్షకులు ఆరాధ్య నటుడు...శోభన్ బాబు వర్ధంతి సందర్బంగా నివా ళులు....

ఆంధ్రుల అందాల నటుడు మహిళ ప్రేక్షకులు ఆరాధ్య నటుడు 
శోభన్ బాబు వర్ధంతి సందర్బంగా నివాళులు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలప తి రావు (జనవరి 14, 1937 - మార్చి 20,2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూర గొన్న తెలుగు సినిమా కథానాయకుడు,అధికం గా కుటుంబ కథా భరితమైన,ఉదాత్తమైన వ్యక్తి త్వం కలిగిన పాత్రలలో రాణించాడు.తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అత ను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రు ల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలి చిపోయారు.

శోభన్ బాబు జీవన విశేషాలు : 

అసలు పేరు : ఉప్పు శోభనాచలపతి రావు

జననం : 1937,జనవరి,14

జన్మ స్థలం : చిన నందిగామ కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం, (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్)

మరణం : 2008,మార్చి,20 (వయసు: 71)
చెన్నై,తమిళనాడు

ఇతర పేర్లు : నటభూషణ

క్రియాశీలక సంవత్సరాలు :
1959–1996

భాగస్వామి : శాంతకుమారి ​(1958)​
పిల్లలు - నలుగురు 

బాల్యం : శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభ నా చలపతిరావు.జనవరి 14, 1937న ఒక సా మాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.కృష్ణా జిల్లా,చిన నందిగామ ఇతని స్వగ్రామం.తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు.గుంటూరు ఎ. సి.కాలేజిలో పునర్జన్మ వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు.ఉన్నత పాఠశాల చ దువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువు పూర్తి చేసాడు.చి న్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవా డినని,తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పా డు.పాతాళ భైరవి, మల్లీశ్వరి,దేవదాసు తను బా ల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీ శ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పాడు.

సినీరంగ ప్రవేశం : మద్రాసులో లా కోర్సులో చేరి నప్పటికీ నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.ఉదయం కాలేజీకి వెళ్ళి,మ ధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకు న్నాడు.పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చి త్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17,సెప్టెంబరు,1959న విడుదల అ య్యింది.కాని విజయవంతం కాలేదు.ఆ సమ యంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా న టించాడు.1960,జూలై,15న విడుదలయిన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయమయ్యింది.అప్ప టికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ,వచ్చిన అవ కాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చి న్న పాత్రలను కూడా పోషించసాగాడు.గూఢ చారి 116,పరమానందయ్య శిష్యుల కథ (శివుని వేషానికి రూ. 1500 పారితోషికం),ప్రతిజ్ఞా పాలన (నారదుని వేషానికి రూ.750 పారితోషికం) ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు.

శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు : అభిమన్యుడిగా నర్తనశాలలో,అర్జునుడుగా భీ ష్మలో,లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో,కృ ష్ణునిగా బుద్ధిమంతుడులో, ఈ సమయంలో స హాయ పాత్రలు లభించడంలో నందమూరి తార క రామారావు,అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్పా డు.

విజయపరంపర : శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు.వెంటనే లో గుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరో గా నటించాడు.అది కూడా అంత విజయవంతం కాలేదు.పొట్టి ప్లీడరు విజయవంతమైంది.పుణ్య వతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది.బి.ఎన్.రెడ్డి తీసిన బంగా రు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. 1969లో విడుదలయిన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ చిత్రం శోభన్ బాబు నట జీవి తంలో మైలురాయి.ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును.ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం,కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయా లతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థా నాన్ని ఏర్పరుచుకొన్నాడు.మానవుడు - దాన వుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తె చ్చిపెట్టింది.బాపు దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధి మంతుడు సినిమాలోను,రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోను నటించాడు.అప్ప టికే ఈ పాత్రలలో ఎన్టీయార్ స్థిరమైన ముద్ర వేసుకొన్నా ఈ చిత్రాలు విజయవంతమయ్యా యి.

వైవిధ్యం :
అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం,రఘు రాముడు వంటి కుటుంబ కథా చి త్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య క థానాయకుడయ్యాడు.దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా,భార్య ను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రథమయిన పాత్రలు పోషించాడు.అప్పట్లో అమ్మాయిలు త మకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు.రా ముడు,కృష్ణుడు,అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చి త్రాల్లో కూడా నటించాడు.అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా,కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేష జాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు.

 కాంబినేషన్ చిత్రాలు : ఎన్‌టీఆర్ తో : ఆడపడుచు,విచిత్ర కుటుంబం.అక్కినేని నా గేశ్వరరావుతో : పూలరంగడు,బుద్ధిమంతు డు.ఘట్టమనేని కృష్ణతో : మంచి మిత్రులు,ఇ ద్దరు దొంగలు,ముందడుగు,మహా సంగ్రామం.

అతనికున్న బిరుదులు : నటభూషణ,సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.

ఆణిముత్యాలు : శోభన్ బాబు నటజీవితంలో ఎ న్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

మనుషులు మారాలి : యావత్ తెలుగు సినీ అ భిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమా లో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం.ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
చెల్లెలి కాపురం : అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించు కున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిత్రం కలి కితురాయి.అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
ధర్మపీఠం దద్దరిల్లింది : తన కన్న కొడుకులు ము గ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహిం చలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బా బు ప్రదర్శించిన నటన అసామాన్యం.
అవార్డులు-రివార్డులు :
ఫిల్మ్ ఫేర్ అవార్డు : 1971,1974,1976,1979
ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976

సినీగోయెర్స్ అవార్డు : 1970,1971,1972,1973,1974,1975,1985,1989
వంశీ బర్కిలీ అవార్డు : 1978, 1984, 1985

కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు : బంగారు పంజరం సినిమాకు 1970లో వ్యక్తిగత జీవితం శోభన్ బాబు భార్య కుటుంబసభ్యుల ఫొటో నెట్ లో ఎక్కడా దొరకటం లేదు.శోభన్ బాబుకు మే,15, 1958న కుమారితో వివాహ మైంది.వారికి ఒక కుమారుడు,ముగ్గురు కుమా ర్తెలు.వారి పేర్లు : కరుణ శేషు,మృదుల,ప్రశాంతి, నివేదిత.సినీరంగంలో ఉన్నా శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు.అతను ఎన్నడూ ఎటువంటి వ్య సనాలకులోను కాలేదు.ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కు టుంబ సభ్యులతో సమయం గడిపేవాడు.వృత్తి కంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతని స్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు. శోభన్ తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు.వయసు పైబడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు.వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరా డంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్న డూ ఆడంబర జీవితం గడపలేదు.డబ్బును పొ దుపు చేయడంలో,మదుపు చేయడంలో ఎంద రికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయా లు,దానాలు చేసినా,ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు.

చివరి దశ : ఎన్నటికీ ప్రేక్షకులు మనసులో అందా ల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బా బు తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి చెప్పా డు.220పైగా చిత్రాలలో నటించి 1996లో విడు దలైన హలోగురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీ వితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ స భ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు.శోభన్ బాబు 2008,మార్చి 20న ఉదయం గం.10:50 ని.లకు చెన్నైలో మరణించాడు.

చిత్ర ప్రముఖుల నివాళులు :
శోభన్ బాబు మరణ సందర్భంగా తెలుగు చలన చిత్రరంగానికి చెందినవారు ఘనంగా నివాళులు అర్పించారు.దాసరి నారాయణ రావు,చిరంజీ వి,ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నట భూషణుని అంత్య క్రియలకు హాజరయ్యారు. శోభన్ బాబు మృతి వార్త విని షాక్ కు గుర య్యానని అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు. సినీ రంగానికి దూరమై శోభన్ బాబు భార్యాపి ల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారని అన్నాడు. శోభన్ బాబు మృతి సినిమా రంగానికి తీరని లోటు అని నటుడు మోహన్ బాబు అన్నాడు. శోభన్ బాబు మరణించారనే వార్తను నమ్మలే కపోతున్నానని నిర్మాత రామానాయుడు అన్నా డు.తాను శోభన్ బాబుతో ఎన్నో విజయవంత మైన సినిమాలు తీశానని,తమ కుటుంబ సభ్యు డిగా మెలిగేవాడని అన్నాడు.శోభన్ బాబు మం చి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని అన్నాడు. శోభన్ బాబు మృతికి దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సంతాపం వ్యక్తం చేశాడు.దర్శకుడిగా రా ఘవేంద్రరావుకు శోభన్ బాబుతో తొలి సినిమా బాబు.దాసరి నారాయణరావు దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గోరింటాకు వంటి విజయ వంతమైన సినిమాల్లో నటించాడు.సినీ నటుడు శోభన్ బాబు మృతికి అలనాటి హీరోయిన్ వా ణిశ్రీ కన్నీరు పెట్టుకుంది.శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆమె అన్నది. మరో నటి శారద కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.శోభన్ బాబుతో కలిసి ఆమె బలిపీఠం వంటి హిట్ చిత్రాల్లో నటించింది.జీవన తాత్వి కతను శోభన్ బాబు వివరిస్తూ ఉండేవారని వా ణిశ్రీ అన్నది.శోభన్ బాబు మరణ వార్త విని సినీ పరిశ్రమ యావత్తు శోకసముద్రంలో మునిగిందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నాడు.తాను పె ద్దన్నయ్యను కోల్పోయానని సినీ నటుడు చంద్ర మోహన్ అన్నాడు.శోభన్ బాబు మరణవార్తవి ని ఆయన కన్నీరు మున్నీరు అయ్యాడు.జీవి తంలో తనకు శోభన్ బాబు ఎంతో మేలు చేశా రని,తన తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకు ఇంత బాధ కలుగలేదని అన్నాడు.సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన మంచి వ్య క్తి లేడని,దేవుడిచ్చిన అన్నయ్య శోభన్ బాబు అని ఆయన అన్నాడు.తాను నిన్ననే ఫోనులో మాట్లాడానని,శోభన్ వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయంలో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని అన్నాడు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....