ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ...ఎన్‌కౌం టర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ... దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు...

ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ
ఎన్‌కౌంటర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ
దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
మావోయిస్టు రహిత భారత్‌ కోసం కేంద్రం ప్రారంభిం చిన 'ఆపరేషన్‌ కగార్‌' లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది.మా వోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా లొంగిపో యేందుకు రంగం సిద్ధమైంది.మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలావరకూ ఇప్పటికే తెలంగాణ పోలీ సుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణ రావు ఏపీ పోలీసులకు టచ్‌లోకి వచ్చారు.సంప్రదింపుల అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోయారు.దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్య వహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది.

నక్సలైట్ల నుంచి మావోయిస్టుల వరకు : 

నక్సల్‌ బరిలో పుట్టిన విప్లవ పార్టీలో సభ్యుల్ని నక్స లైట్లుగా పిలిచేవారు.ఆ తర్వాత పీపుల్స్‌ వార్‌ గ్రూపు గా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశం లోని పలు రాష్ట్రాలకు విస్తరించింది.ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న మావోయిస్టులను అణచి వేసేందుకు గ్రే హౌండ్స్‌ దళాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు శిక్షణ సహకా రం అందించింది.రాష్ట్ర విభజన తర్వాత గతేడాది నవంబరు మూడో వారంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సత్తా చాటింది.రాష్ట్రంలో ఒకప్పుడు మంత్రులు,ఐపీ ఎస్‌ అధికారుల్ని సైతం కాల్చి చంపిన మావోయిస్టు లు తుపాకీ రాజ్యం స్థాపిస్తామని ప్రభుత్వాలకు సవా లు విసిరారు.తమ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలు విసిచారు.2003 లో సీఎం చంద్రంబాబుపై అలిపిరి వద్ద దాడి చేసిన మావోయిస్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలకు పిలి చింది.తమ పార్టీకి అదే పెద్ద శాపమని మావోయిస్టు లు గతంలో పేర్కొన్నారు.2014లో కేంద్రంలో అధికా రంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి దండకారణ్యంలో మావోస్టుల వరకూ అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా శ్రమించింది.ఈ నెల 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌ షా పలుమార్లు ప్రకటించా రు.అందుకు అనుగుణంగా ఆ పార్టీని చావుదెబ్బ తీశారు.ఈ క్రమంలో కేంద్రం విధించిన గడువు నాటికి ఏపీలో మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకు పోయిందని ఏపీ పోలీసులు త్వరలో ప్రకటించను న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...