నాలుగు నెలల గర్భవతిపై భర్త కత్తితో దాడి...
నాలుగు నెలల గర్భవతిపై భర్త కత్తితో దాడి
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కోరుట్ల మండలం,మా దాపూర్లో జరిగింది.పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం...ఎనిమిది నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకు న్నారు.అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాస ముంటున్నారు.హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపి స్తోంది.గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జాము న 4-00గంటలకు వైష్ణవిపై హరిబాబు కత్తితో దా డి చేశాడు.అనంతరం అక్కడి నుంచి పరార య్యాడు.ఉదయం కుటుంబ సభ్యులు చూసేస రికి రక్తపుమడుగులో వైష్ణవి పడి ఉంది.పోలీసు లకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment