కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లిన దొంగ...చెన్నైలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు...రూ.14లక్షల నగ స్వాధీనం...ఎల్.సుబ్బారాయుడు,తిరుపతి జిల్లా ఎస్పీ...

కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లిన దొంగ
చెన్నైలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
రూ.14లక్షల నగ స్వాదినం
ఎల్.సుబ్బారాయుడు,తిరుపతి జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,తిరుపతి :
బంగారు అభరణాలు కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు. షాపు యజమాని ఏమరపాటుగా ఉండడం గమనిం చి కళ్ళలో కారం పొడి చల్లాడు.ఏమాత్రం ఆలస్యం చే యకుండా 12బంగారు గొలుసులతో ఉడాయించా డు.ఈ ఏడాది మార్చి,14వ తేదీ తిరుపతి జిల్లా,సూ ళ్లూరుపేట జ్యువెలరీ షాపులో పట్టపగలు జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది.రంగంలోకి దిగిన పోలీసులు తమ ఆంధ్రా,తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఉన్న చెన్నై నగరానికి చెందిన వేల్మురగన్ అలియాస్ పల్సర్ బాబును తిరు పతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నాం.24 కేసుల్లో నిందితుడిగా ఉన్న తమిళనాడు లోని తొండియార్ పేటకు చెందిన వేల్మురగన్ అలి యాస్ పల్సర్ బాబును అరెస్టు చేశామని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పేర్కొన్నారు.సూళ్లూరు పే ట సీఐ ఎం.మురళిక్రిష్ణ,క్రైం పోలీస్ స్టేషన్ సీఐ శివ కుమారరెడ్డి,సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్,కమాం డ్ అండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్,సూళ్లూరు పేట, తడ ఎస్సైలు జీ.అజయ్ కుమార్,కే.కొండప్పనాయు డుతో కలిసి ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు శని వారం ఆ వివరాలు వెల్లడించారు.తిరుపతి జిల్లా,సూ ళ్లూరు పేట పట్టణంలోని శ్రీవేంకటేశ్వరా జ్యువెల్లర్స్ షాపులో గత నెల 14వతేదీ,మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఒక వ్యక్తి బంగారు చైన్లు కొనడానికి వచ్చాడు.నగలు పరిశీలిస్తూ,యజమాని కళ్లలో కారం పొడి చల్లి 12బంగారు గొలుసులను ఎ త్తుకుని పారిపోయాడు.ఈ సంఘటనపై బాధిత య జమాని ఫిర్యాదులో సీఐలు,ఎస్ఐలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.జిల్లా క్రైం అదనపు ఎస్పీ ఏ.శ్రీనివాసులు, నాయుడుపేట డి.యస్పీ.జి.చెంచుబాబు ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.సూ ళ్లూరు పేట పట్టణంలో పట్టపగలు చోరీ జరగడంపై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.సంఘటన జరిగిన తీరు,గతంలో ఇదే తరహా జరిగిన సంఘట నల నేపథ్యం ఉన్న పోలీసు రికార్డులు పరిశీలించా రు.సీసీ టీవీ పుటేజీ కూడా పోలీస్ అధికారులకు ఉప యోగపడింది.వాటి ఆధారంగా నిందితుడిని పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.దర్యాప్తు బృందాలు చెన్నై నగరంలోని తొండియార్ పేట్ ప్రాంతానికి చెంది న వేల్మురుగన్ బాబు (35) (పల్సర్ బాబు,బాబు)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బారాయుడు వివరించా రు."నిందితుడు వేల్మురుగన్ బాబు నుంచి రూ.14ల క్షల విలువైన 112 గ్రాముల బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు వాడిన స్కూటీని కూడా మా సిబ్బంది పట్టుకున్నారు" అని ఎస్పీ సుబ్బారా యుడు వివరించారు.సూళ్లూరుపేట జ్యెవెలరీ షాపు లో చోరీకి పాల్పడిన వేల్మురుగన్ బాబుకు ఆంధ్ర, తమిళనాడులోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.24చోరీ కేసుల్లో వేల్మురుగన్ బాబు నింది తుడని, తిరుపతి,పుత్తూరు,శ్రీకాళహస్తిలో కూడా కేసు లు ఉన్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.కొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్న నిం దితుడు వేల్మురుగన్ కోసం మిళనాడు పోలీసులు కూడా గాలిస్తున్నారు.అంతర్రాష్ట్ర నిందితుడిని అరె స్టు చేసిన అధికారులు,పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...