ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జనగణన - 2027...వి.హర్షవర్ధన్ రాజు,ప్రకాశం జిల్లా ఎస్పీ...

ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జనగణన - 2027
వి.హర్షవర్ధన్ రాజు,ప్రకాశం జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,ప్రకాశం :
ఏప్రిల్,16వ తేదీ నుండి 30వ తేదీ వరకు భారత జన గణన - 2027 కార్యక్రమం స్వయం ఇండ్ల గణన మొ దటి దశ (Self Enumeration - SE) నిర్వహించబ డుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తె లిపారు.అనంతరం మే,1, 2026 నుండి మే 30,202 6 వరకు ఇండ్ల గణన ప్రక్రియ నిర్వహించబడుతుం ది.ఈ క్రమంలో మే,1వ తేదీ నుండి గణనకర్తలు (సచి వాలయ ఉద్యోగులు) ఇంటింటికి వెళ్లి గృహ జాబితా సేకరిస్తారు.స్వయం గణన (Self Enumera tion) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ భారత జనగణన http://se.census.gov.in పోర్టల్‌లో లాగిన్ అ యి,అందులో అడిగిన వివరాలను నమోదు చేయా లని జిల్లా ఎస్పీ తెలిపారు.రెగ్యులర్ ఇండ్ల గణన సం దర్భంగా మే,1 నుండి 30 వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటిం టికి వెళ్లి వివరాలు సేకరిస్తారని,వారు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా అందించి సహక రించాలని విజ్ఞప్తి చేశారు.జనగణన ప్రక్రియలో భాగం గా గణనకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు (OT P),బ్యాంక్ వివరాలు లేదా ఇతర వ్యక్తిగత గోప్య స మాచారం,సర్టిఫికెట్లు అడగరని జిల్లా ఎస్పీ స్పష్టం చే శారు.జనగణన పేరుతో డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు.సోషల్ మీడి యా,ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా ఎవరై నా ఓటీపీలు,బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమా చారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దన్నా రు.ప్రజల సహకారంతోనే జనగణన కార్యక్రమం విజ యవంతంగా పూర్తవుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నా రు.ఈ కా ర్యక్రమంలో సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ టి.రాం భూపాల్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్ పి.అఖండ్ కుమార్,సె న్సస్ టెక్నికల్ అసిస్టెంట్ టి.సుజాత,సిబ్బంది పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...