జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే... సరైన పత్రాలులేని 48వాహనాలు స్వాధీనం...
జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే
సరైన పత్రాలులేని 48వాహనాలు స్వాధీనం
కర్నూలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేప ట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్ర హార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో కర్నూ లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలో ని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.ప త్తికొండ సబ్ డివిజన్,తుగ్గలి మండలంలోని రామళ్ళ గ్రామం,ఎమ్మిగనూరు సబ్ డివిజన్,కడివెళ్ళ గ్రామం, ఆదోని సబ్ డివిజన్,ఆదోని టౌన్,కర్నూలు సబ్ డివి జన్,కర్నూలు బి.తాండ్రపాడు గ్రామం,టివి 9 కాలనీ లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు.మా దకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా,సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన తనిఖీల్లో డిఎస్పీలు,సిఐలు, ఎస్సైలు,పోలీసు సిబ్బంది మొత్తం 240 మంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా రెండు వేల మంది వ్యక్తులు,నాలుగు వందల వాహనాలను తని ఖీలు చేశారు.సరైన పత్రాలు లేని 48వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య,సామాజిక, చట్టపర మైన దుష్ప రిణామాల గురించి అవగాహన కల్పించారు.గంజా యి,ఇతర మాదకద్రవ్యాల వినియోగం,యువత భవి ష్యత్తును నాశనం చేస్తుందని,కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూ పుతుందని వివరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి,ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EA GLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందిం చాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.అనంతరం భాగంగా పోలీసు అధికా రులు,సిబ్బంది,ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్య తిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు.సమాజా న్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పోలీసు అధికా రులు పేర్కొన్నారు.మాదకద్రవ్యాలను పూర్తిగా అరి కట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ఇ లాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీ సు అధికారులు తెలిపారు.ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్ర ధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పత్తి కొండ డిఎస్పీ వెంకట్రామయ్య,ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,సిఐలు,ఎస్సై లు,ఈగల్ టీం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment