72ఏళ్ల వయసులో శ్రమకు చిరునామాగా నిలిచిన వృద్ధురాలు...
72ఏళ్ల వయసులో శ్రమకు చిరునామాగా నిలిచిన వృద్ధురాలు
40ఏళ్లుగా కట్టెల పొయ్యిపైనే అట్లు వేస్తూ,విక్ర యి స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఖమ్మం నగరానికి చెందిన మహబూబ్ బీ (నన్నీబి),రహీమ్ దంపతు లకు ఐదుగురు సంతానం.ముగ్గురు కుమార్తెలకు వి వాహాలయ్యాయి.రహీమ్ పదేళ్ల క్రితం చనిపోయా రు.పెద్ద కుమారుడు కొవిడ్ సమయంలో,కోడలు అ నంతరం కాలంలో చనిపోయా రు.తొలినాళ్లలో మహ బూబ్ బీ భర్తతో కలిసి స్టేషన్ రోడ్డులో చిన్నగదిలో హోటల్ నిర్వహించేవారు.పదేళ్లుగా భక్త రామదాసు కళాక్షేత్రం ఎదుట ఖాళీ ప్రాంగణంలో ఓ పరదా కట్టి దాన్నే ఫలహార శాలగా మార్చింది.రోజూ తెల్లవారు జామున 4-00గంటలకే నిద్రలేస్తారామె.అట్ల తయా రీకి కావాల్సిన పిండి,పల్లీచట్నీ,టమాట పచ్చడి సిద్ధం చే సుకుంటారు.6-00గంటలకు చిన్న కుమారుడు గ ఫార్ సాయంతో విక్రయశాల వద్దకు చేరుతారు.కట్టెల పొయ్యిపై మధ్యాహ్నం 12-00గంటల వరకు అట్లు పోస్తుంటారు.సాయంత్రం 6-00గంటల నుంచే మరు సటి రోజుకు కావాల్సిన పదార్థాల తయారీలో నిమ గ్నమవుతారు.ఇన్నేళ్లుగా కట్టెల పొయ్యిపై వంటచేస్తు న్న మహబూబ్బీకి ఆరోగ్య సమస్యలన్నవే తెలియ దు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక ప్రస్థానం.
Comments
Post a Comment