మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి...జి.సం తోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...
మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి
జి.సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసు కోవా లని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.మెడికల్ మాఫీయా వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూ లు నగరంలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ఏఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీరాములు అధ్యక్షత వ హించగా రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాల్లో మెడి కల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలి గిస్తోందని పేర్కొన్నారు.ప్రజారోగ్యం అనే అత్యంత కీ లక రంగాన్ని కొంతమంది లాభాపేక్షతో దోపిడీకి గురిచే యడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ హాస్పిట ల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపో తూ ప్రభుత్వ నిబంధన లు పక్కనబెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు.పే ద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరా గా చేసుకుని అవసరం లేని పరీక్షలు,చికిత్సలు పేరు తో భారీ బిల్లులు వేస్తూ వారి ఆర్థిక స్థితిని దెబ్బతీ స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కొంత మంది మెడికల్ స్టోర్లు ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మం దుల విక్రయం,అనుమతి లేని అబార్షన్ మాత్రల రహ స్య అమ్మకాలు,లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిం చడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపా రు.ఇది యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే చ ర్యలని స్పష్టం చేశారు.అధికారులు వెంటనే స్పందిం చి.మెడికల్ షాపులు,ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ప్రత్యేక త నిఖీలు నిర్వహించాలి.నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని కార్పొరేట్ హాస్పి టల్స్ కు వైద్యం కోసం వచ్చిన రోగులకి అవసరం ఉ న్నా లేకున్నా ఆపరేషన్ చేస్తున్నారని,ఆరోపణలు ఎ దుర్కొంటున్నారని,కొన్ని హాస్పిటల్లో ఆపరేషన్లు విక టించి ప్రజల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉ న్నాయని,మృతుని కుటుంబ సభ్యులు తిరగబడితే రాజకీయ బలంతో డబ్బులు సెటిల్ చేసి వారి నోరు నొక్కుతున్నారని మండిపడ్డారు.నగరంలో ఉన్న ప్రతి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కింద వచ్చే అమౌంట్ కాకుండానే,ప్యాకేజీలు మాట్లా డుకుని ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు.ఇలాంటి వాటిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఏఐవైఎఫ్ గా ప్రత్యక్ష దా డులు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ బీసన్న,రమేష్,హ నుమేష్,జిల్లా నాయకులు జాఫర్ పటేల్,పెద్దయ్య, అ ల్తాఫ్,సురేష్ నగర అధ్యక్షులు నాగరాజు,నగర నాయ కులు చంటి,శ్రీకాంత్,రవి,అశోక్,అఖిల్,భద్రకుమార్, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment