మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్...కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్
కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిది ద్దడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా కర్నూలు నగరంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,అవగాహన కల్పించేందుకు ఈ గల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ నిర్వ హించారు.ఈ ర్యాలీ రాజ్ విహార్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద గురువారం జెండా ఊపి వాక థాన్‌ను ప్రారంభించారు.ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కు మార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీ సులు,విద్యార్థులు,యువత,స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భం గా...“Say No to Drugs”, “Drug Free Society” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చై తన్యం కల్పించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉం డాలని,ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలు అందించారు.అలాగే ప్రజ లు ఈగల్ టీం టో ల్ ఫ్రీ నంబర్ 1972 ద్వారా మాదక ద్రవ్యాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు.అ నంతరం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ... యువతను మత్తు వ్యసనాల నుండి కాపాడటం స మాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ప్ర స్తుత కాలంలో ఆల్కహాల్,గంజాయి వంటి మత్తు ప దార్థాల వినియోగం పెరుగుతున్నదని,దీని వల్ల యు వత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.పాఠశాలలు,వసతి గృహాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.తల్లిదం డ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించా రు.కర్నూలు జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీ ర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపుని చ్చారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుం డా కుటుంబం మరియు సమాజానికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని తెలిపారు.అవగాహనతోనే ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవు తుందని పేర్కొన్నారు.“నషా ముక్త్ భారత్ అభియా న్” లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శా ఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి,అసిస్టెంట్ ఎక్సైజ్ సూప రింటెండెంట్ రామకృష్ణారెడ్డి,ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment