అణగారిన జీవితాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూ లే...కెవిపిఎస్...

అణగారిన జీవితాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
కెవిపిఎస్
VS9TV న్యూస్,కల్లూరు :
సామాజిక సంస్కర్త ఉద్యమకారుడు అణగారిన జీవి తాల్లో ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని సిఐటి యు,కెవిపిఎస్ నాయకులు తెలిపారు.శనివారం కేవి పిఎస్ ఆధ్వర్యంలో ఎం.సీ.ఆనంద్ అధ్యక్షతన స్థానిక 32 వ వార్డు ముజఫర్ నగర్ లో జ్యోతిరావు పూలే జ యంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప,కేవి పిఎస్ నాయకులు ఈ.రామాంజనేయులు జ్యోతిరా వు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ని వాళులర్పించారు.ఈ సందర్భంగా కె.సుధాకరప్ప మా ట్లాడుతూ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతా రా జిల్లా ఖడ్గున్ అనే గ్రామంలో 1827, ఏప్రిల్,11వ తేదీన జన్మించారని తెలిపారు.7 సంవత్సరాల వయ సులో జ్యోతిరావు పూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి ప్రాధమిక విద్యను పూర్తి చేశాడని,అయితే మనుధర్మ శాస్త్ర ప్రకారం ఉన్నత విద్యను బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని తక్కువ కులం వాళ్ళ చదువుకోకూ డదని పెత్తం దారుల నిర్ణయం ప్రకారం జ్యోతిరావు పూలే చదువుకు ఆటంకం ఏర్పడింది.కానీ జ్యోతిరా వు పూలే పట్టుదలతో పుస్తకాలపై ఆసక్తితో నిరంత రం పఠణ చేసేవారు జ్యోతిరావు పూలేకి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి,గఫార్ బేగ్ మున్సి అనే ఉ పాధ్యాయుడు ఇంటి పక్కనే ఉన్న స్కాటిష్ మిషన్ స్కూల్లో చేర్పించాడు.భిన్నకులాలు, మతాలు కలిగిన వారందరూ కలిసి చదువుకోవ డానికి మిషనరీ పాఠ శాల ఎంతగానో తోడ్పడింది కొన్ని కొన్ని సందర్భాల లో తక్కువ కులం అనే పేరుతో కుల వివక్షతకు గురి కావలసి వచ్చిందని అన్నారు.సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్న అనంతరం భార్యాభర్తలు ఇరు వురు కలిసి 1848లో తొలిసారిగా బాలికల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు.ఆ పాఠశాలలో తరతమ భేదాలు కానీ కుల,మతాలు కానీ లేనివిధం గా అందరిని సమానంగా చూస్తూ అంటరానితనం ఉండకూడదనే పాఠాలను స్వయంగా సావిత్రిబాయి పూలే బోధించేవారు.కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్ర మాలే కాకుండా బ్రిటిష్ వలస దారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ,కార్మికులు,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని పేర్కొ న్నారు.సమసమాజ స్థాపన కోసం పూలే నిరంతరం శ్రమించేవాడని అన్నారు.చిన్న వయసులోనే విద్యా గ్రంధాన్ని వెదజల్లడానికి అంకితమైన జ్యోతిరావు పూ లే,సావిత్రిబాయి పూలే మనకు ఆదర్శమని చెప్పా రు.ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇంకా అంటరానిత నం కొనసాగుతుందని,గ్రామ పెత్తందారీతనం కూడా రూపు మాసి పోలేదని,దానికోసం మ నమందరం కూ డా రాబోయే కాలంలో కృషి చేయాలని వారు పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం.మాదన్న,బీసన్న, ఎం.దావీదు,కృపవరం,ప్రసాద్,నాగరాజు,రామలిం  గం,దస్తగిరమ్మ,రహేలమ్మ,టి.ఈశ్వరమ్మ,నాగేంద్రమ్మ, అయ్యమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...