గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టాలి... సావిత్రి,ఐద్వా రాష్ట్ర కార్యదర్శి...
గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టాలి
సావిత్రి,ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
గంజాయి మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం కలిసి పోరాడాలని రాష్ట్ర కార్యదర్శి సావిత్రి పిలు పు నిచ్చారు.శనివారం సుందరయ్య భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు శ్యా మల అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్య దర్శి సావిత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో యువ త డ్రగ్స్,మద్యం అలవాటయ్యి మహిళలపై హత్య లు,మానభంగాలు దాడులు చేస్తున్నారని విమర్శిం చారు.నెల్లూరు, కడప,విశాఖ,మదనపల్లి,కర్నూలు జిల్లా,ఇలా చెప్పుకుంటూపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూ డా అనేక హత్యలు మహిళలపై నేరాలు అధికంగా జ రుగుతున్నాయని అన్నారు.ఒక్క నెలలో 18కేసులు అత్యాచారాలు,హత్యలకు మహిళలు గురయ్యారు. దీనిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యి.ఏ రాజకీయ పార్టీలోఉన్న నాయకులు డ్రగ్స్ మా ఫియాకు అండగా ఉంటారో వారిని,ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు గాని పార్టీ సభ్యత్వం నుండి తొలగిం చాలని,అలాంటి వారిపై పార్టీలు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మద్యాన్ని నియం త్రించాల్సిన ప్రభుత్వాలే నాణ్యమైన మద్యాన్ని అంది స్తామని ఎన్నికల ముందు ప్రచారం చేశారు.ఇది సరైం ది కాదన్నారు.ఏదైనా యువతకు నాణ్యమైన విద్య, ఆహారం,వైద్యం అందించాలని ఐద్వా డిమాండ్ చేస్తు న్నట్లు చెప్పారు.మహిళలకు ఇచ్చిన హామీలను నెర వేర్చకుండా కూటమి ప్రభుత్వం విఫలమైందని విమ ర్శించారు.అలాగే యుద్ధం వద్దు శాంతి కావాలని,ఏదై తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నిత్యవసర సరుకు లపై వేస్తున్న భారాలను నియంత్రించాలని తెలియజే శారు.మద్యం,డ్రగ్స్,కంట్రోల్ చేసి యువతకు మంచి భవిష్యత్తు అందించాలని మహిళల మానప్రాణాల ను కాపాడాలని అన్నారు.కూటమి ప్రభుత్వంలో మ హిళలకు రక్షణ లేకుండా పోయింద ని,పరువు హత్య లు ఎక్కువైనాయని,చిన్న పిల్లలకి ఎక్కడ రక్షణ లే కుండా పోయిందని,వీటన్ని టికీ పూర్తి బాధ్యత ప్రభు త్వం తీసుకొని,ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అగా యిత్యాలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ప్రజలు సంయుక్తంగా గంజా యి,డ్రగ్స్ మాదకద్రవ్యాలపై కలిసి వచ్చే సం ఘాలతో కలిసి వచ్చే మేధావులను కలుపుకొని ఆం దోళనకు సిద్ధం కావాలని కోరారు.ప్రజా సంఘాలు మ ద్యం,డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని తెలియజేశా రు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అరుణమ్మ,న గర అధ్యక్ష,కార్యదర్శలు బి.పద్మ,రషీద,జిల్లా నాయ కులు అలివేలు,న్యూ సిటీ అధ్యక్షురాలు కుమారి,కో శాధికారి సుజాత, షేకున్,మక్బుల్ భాను,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment