ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి...ఆర్ నరసింహులు,సీఐటీయు...

ఆటో కార్మిక చలో నంద్యాల కార్యక్రమం జయప్రదం చేయండి 
ఆర్ నరసింహులు,సీఐటీయు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
సిఐటియు 17వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ
నెల 17వ తేదీన నంద్యాలలో జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో  ఆటో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని సిఐటియు న్యూసిటీ కార్యదర్శి ఆర్.న రసింహులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు.మ హాసభల జయప్రదం కోసం ఆటో యూనియన్ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులవిస్తృత స్థా యి జనరల్ బాడీ సమావేశం ఆ యూనియన్ అధ్య క్షులు ఎస్.హుస్సేన్ వలి  అధ్యక్షతన జరిగింది.కార్య క్రమానికి సిఐటి యు న్యూసిటీ కార్యదర్శి ఆర్.నరసిం హులు,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాక ర్,న్యూసిటీ ఆటో యూనియన్ కార్యదర్శి బి.రాధా కృ ష్ణ హాజరై కార్మికుల నిర్దేశించి మాట్లాడారు.ఆటో కార్మి క చలో నంద్యాల పేరుతో 17వ తేదీన జరిగే పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు హాజరుకావాలని వారు పిలుపు నిచ్చారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కేవ లం ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకుంటు న్నాయని అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానా లు చేసిన ప్రభు త్వాలు అధికారం అందాక ఉన్న హ క్కులను కూడా తీసివేసే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవ రిస్తున్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం మోటార్ ఆక్ట్ సవ రణ బిల్లు పేరుతో అధిక జరిమానాలు అమలు చే స్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తానేమి తక్కువ కాద న్నట్లు జీఓ 21 ద్వారా అధిక చలానా ఫీజులు భారీగా పెంచి ఆటో డ్రైవర్లను దోపిడీకి గురిచేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేక మంది ఆటో డ్రై వర్లు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి పోరాటాలు చేస్తామ ని వారన్నారు.ప్రభుత్వం ఎంవిఐ యాక్ట్ సవరణ బి ల్లును రద్దుచేసి జీఓ నెంబర్ 21 వల్ల పడుతున్న చలానా ఫీజులను తగ్గించాలని,ప్రయాణికులను చేరవేస్తున్న టూ వీలర్ బైకులపై చర్య తీసుకుని, రాపిడ్ ప్రైవేట్ యాప్ లను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ బహిరంగ సభలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర నాయ కులు ఎస్ మాలిక్ భాషా,తెలుగు మల్లి,రాము,శ్రీ ను,మాలిక్,వెంకటేష్,నాగేంద్ర మౌలాలి,ప్రసన్న రాజ,పరశురాం,వీరబాబు,వెంకటరమణ నగర అద్దాల నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...