ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్...

ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్
VS9TV న్యూస్,విశాఖపట్నం :
ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరి న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.విద్యార్థి ఆందోళనను గుర్తించిన అధికారులు వెంటనే స్పందిం చి,ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు.వివరా ల్లోకి వెళితే...విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సం వత్సరం విద్యార్థి ఒకరు ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు.పరీక్షల్లో తాను సరిగా చదవలేదని,జవాబు పత్రంలో ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు రాశానని తెలిపాడు.ఫలితాల్లో ఫెయిల్ అవు తాననే భయంతో తీవ్రఆందోళనకు గురైనట్లు అధికా రులకు వివరించాడు.విద్యార్థి పరిస్థితిని అర్థం చేసు కున్న అధికారులు అతనికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇ చ్చారు.కంగారు పడాల్సిన అవసరం లేదని,త్వరలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని,వాటి కి బాగా సిద్ధమవ్వాలని సూచించారుఅలాగే ఈ విష యాన్ని సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన జాగ్ర త్తలు తీసుకో వాలని సూచించారు.కాగా,అనంతరం విడుద లైన ఫలితాల్లో ఆ విద్యార్థి మొత్తం ఐదు సబ్జె క్టుల్లో ఫెయిల్ అయినట్లు తేలింది.ప్రస్తుతం విద్యార్థి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని,భవిష్యత్తులో బాగా చదివేలా చూసుకుంటామని అతని తల్లి,దండ్రులు అ ధికారులకు హామీ ఇచ్చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...