నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య...ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చిన భార్య అరెస్ట్...

నల్లగా ఉన్నాడనే కారణంతో భర్త హత్య
ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్‌కు ఆర్డర్ ఇచ్చిన భార్య అరెస్ట్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాలో దారుణ ఘ టన వెలుగుచూసింది.తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి సరిపోడని భావించిన భార్య,ప్రియు డితో కలిసి సుపారి గ్యాంగ్‌ను పెట్టి భర్తను హతమా ర్చించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి...థార్ జిల్లాలో నివసిస్తున్న దేవకృష్ణ (28) తన భార్య ప్రియాంక పురోహిత్ (25) తో కలిసి జీవిస్తున్నాడు.ఈ నెల 7వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తు లు దేవకృష్ణపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఘటన అనంతరం ప్రియాంక కన్నీరు పెట్టుకుంటూ, దొంగ తనానికి వచ్చిన వ్యక్తులు తనను కట్టేసి,తన భర్తను చంపి ఇంట్లో ఉన్న నగదు,నగలను ఎత్తుకెళ్లా రని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.అ యితే ఆమె చెప్పిన కథలో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించడంతో పోలీసులు లోతుగా విచా రణ చేపట్టారు.ఈ క్రమంలో ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా,కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమె కు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు.పోలీసుల కఠిన విచారణలో కమలేష్ పురోహిత్, ప్రియాంక ఇద్దరూ కలిసి సురేంద్ర భాటియా అనే వ్యక్తి కి సుపారి ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించినట్లు అంగీకరించారు.తన భర్త నల్లగా ఉండటం,తనకు సరి పోడని భావించడం,అలాగే ప్రియుడితో ఉన్న సంబం ధం బయటపడే భయంతో భర్తను అడ్డు తొలగించు కోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించా రు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి,ప్రియాంక పురో హిత్,కమలేష్ పురోహిత్,సుపారి గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...