ఆస్తి కోసం రక్తపాతం...అన్నను కడతేర్చిన తమ్ముడు...
ఆస్తి కోసం రక్తపాతం...అన్నను కడతేర్చిన తమ్ముడు
నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణా పురంలో ఆస్తి వివాదం ఘోర హత్యకు దారి తీసింది. ఎస్సీ కాలనీకి చెందిన ఏసేబుకు ఐదుగురు కుమారు లు ఉండగా,వారిలో ఆస్తి పంచుకునే విషయంలో కొం తకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కుటుంబంలో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.మాటల తగాదా ఘర్షణ గా మారి,తమ్ముడు విజయరాజు ఆవేశంతో రోకలి బండతో అన్న దైవ భక్తుడు (40)పై దాడి చేశాడు.తీ వ్రంగా గాయపడిన దైవ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నిం చిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా గాయపడ్డా రు.సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.నిం దితుడు విజయరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment