కేరళలో వెల్లివిరిసిన మానవత్వం...అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

కేరళలో వెల్లివిరిసిన మానవత్వం

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆ ర్టీసీ బస్సు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఎస్.ఎ ల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్క డ ఒక యువతి బస్సు దిగగా,ఆ ప్రాంతం చీకటిగా,ఎ వరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కు మార్,కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళ న చెందారు.భద్రత కోసం నిలిచిపోయిన బస్సు యు వతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్,ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకు న్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం,ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పు కున్నారు.మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.అమ్మవడిగా మారిన బస్సు యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్క డికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది.బస్సులో ప్ర యాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విష యాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వై రల్‌గా మారింది.కేరళలో 'ఆనబండి' (ఏ నుగు వాహ నం)గా పిలువబడే ఈ బస్సు,ఆ యువతిని తల్లిలా కాపాడటంతో నెటిజన్లు దీనిని 'అమ్మవండి' అని కొని యాడుతున్నారు.ఈ ఘటన సమాజానికి మంచి ఆ దర్శం అయింది.ఆలోచన మంచిదైతే...సమాజం సహకరిస్తుంది అని మరోసారి నిరూపితమైంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...