వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి...డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్...

వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి
డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్
VS9TV న్యూస్,మంగళగిరి :
డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఇందిరానగర్ యుపిహెచ్ సి డాక్టర్ అనూష వేసవి కాలంలో ఎదురయ్యే వడదెబ్బ,ఇతర సమస్యలు గురించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయం పరిధిలోగల యుపిహెచ్ సి లలో,ఓఆ ర్ ఎస్,జిమ్ కార్నర్ ఏర్పా టు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ముఖ్యంగా వృద్ధులు,గర్భవతులు,చిన్న పిల్లలు మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు ఎండలో తిరగటం ప్రమాదకరం అన్నారు.ముఖ్యంగా పలుచనీ కాటన్ దుస్తులు ధరిం చాలని,నిండు రంగు దుస్తులను ధరించవద్దని లైట్ కలర్ దుస్తులు ధరించడం వల్ల ఎండవేడినీ త్వరగా తీసుకోదని చెప్పారు.అత్యవసరంగా బయటకు వెళ్ళ వలసిన సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాల ని,నూనె సంబంధించిన పదార్థాలను దూరంగా ఉం చాలని,నూనె పదార్థాలు స్వీకరించటం వల్ల డిహైడ్రే షన్ కి గురవుతారని పేర్కొన్నారు.కనీసం రోజుకి మూ డు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి.మద్యం సే వించే అలవాటు కానీ టీ కాఫీ ఇలాంటి అలవాట్లు త గ్గించాలని అవి సేవించడం వల్ల డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.బయటకు వచ్చే స మయంలో చర్మరక్షణ కోసం సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వా డాలని,అదేవిధంగా సన్ క్లాసెస్ వాడటం వల్ల సూర్యు డి నుంచి వచ్చే కిరణాలు కంటికి తగలకుండా రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.వేసవికాలంలో కచ్చితం గా బార్లీ వాటర్,సబ్జా వాటర్,నిమ్మరసం,బట్టర్ మిల్క్ (మజ్జిగ),వంటివి తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురవకుండా శరీరం వేడి చేయకుండా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా వడదెబ్బ తగిలి కనపడితే వా రిని ముందు మంచి నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువె ళ్లి,వారికి గాలి తగిలేలా చేయాలి.వారికి ఓఆర్ఎస్ కా నీ,మంచినీరు కానీ తాగించాలి.వారు ఒకవేళ స్పృహ లో లేకపోతే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిం చి సరైన వైద్యం అందేలా సాయపడాలి.అన్ని ప్రభు త్వాసుపత్రులలో సెలైన్లు ఓఆర్ఎస్ పూర్తిగా అందు బాటులో ఉన్నాయని డాక్టర్ అనూష తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...