పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయ స్సు...ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూ లు జిల్లా 13వ మహాసభలు...వి.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు...
పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయస్సు
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు
వి.కృష్ణయ్య,రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు సోమవారం ఉల్చాల గ్రామంలో 10,11వ తేదీలలో ఘనంగా జరిగాయి.ప్రతిని ధుల మహాసభను ప్రారంభించారు.ఈ మహాస భలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షులు వి.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.ప్రస్తు తం రాష్ట్రంలో రైతులు దయనీయమైనా పరిస్థి తుల్లో ఉన్నారని,రైతు పండించిన పంట గిట్టు బాటు ధర లేక,కల్తీ విత్తనాలు,ప్రభుత్వ వి ధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలోకి నెట్ట బడుతుందని అన్నారు.ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప,రైతుల రాతలు మారలేదని, స్వతంత్రం వచ్చే 79ఏళ్ల అయినప్పటికీ రైతే రాజు - రైతే వెన్నెముక అనే పాలక పార్టీలు రై తును ఆకలి చావులు,ఆత్మహత్యల వరకు తీ సుకొచ్చాయని మండిపడ్డారు.నేడు దేశంలో బి జెపి కుటుంబ ప్రభుత్వం అవలంబిస్తున్న విధా నాల వల్ల తరతరాలు భూమిని నమ్ముకున్న రైతుల బిడ్డలకు భూమి లేకుండా అదృశ్యం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఆదాని,అం బానీ లాంటి కార్పోరేట్ శక్తులకు 00-95 పైస లకే ఎకరా భూమిని కట్ట బెడుతున్నారని,వేల కోట్ల రూపాయల్లో సబ్సిడీలు ఇస్తున్నారని,కానీ ఆరుగాలం కష్టించి పనిచేస్తే చేసిన శ్రమకు తగ్గ ఫలితం రాక,నష్టపోతే నష్టపరిహారం ఇవ్వ కుం డా పాలన సాగిస్తున్నారని చెప్పారు.బీజేపీ పాలనలో ఈ దేశానికి కరోనా సమయంలో కూ డా ఆహారం అందించిన రైతును నట్టేట ముం చారని పేర్కొన్నారు.ఇక దేశంలో రైతులు బీజే పీ కుట్రలు నిరంతరం మోసపోవడం ఇక జరగ దని,రైతులంతా ఐక్యమై రైతు సంఘం జెండా కింద రాజకీయాలకు అతీతంగా పోరాటాలు నిర్వహించి,పాలకుల మెడలు వంచి రైతులు హక్కులు కాపాడటమే కాకుండా సాగునీరుకై జిల్లాలోని ప్రాజెక్టులను సాధించుకోవాలని వా రు పిలుపునిచ్చారు.ఈ మహాసభకు జిల్లాలో ని 19మండలాల నుండి ప్రతినిధులు పాల్గొ న్నారు.అనంతరం నూతన కమిటీ ఎన్నుకు న్నారు.
నూతన కమిటీ :
జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా కే.వెంకటేశులు, జి.రామకృష్ణ
ఉపాధ్యక్షులు : కోటకొండసూరి,పి హనుమంతుడు,
సహాయ కార్యదర్సులు : కే.మల్లయ్య,సి. హనుమంతు,సిద్దయ్య గౌడ్,మనోహర్, అయ్యప్ప,
కోశాధికారి : కృష్ణ
46మందితో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది.
మహాసభ తీర్మానాలు :
1. వేదావతి గుండ్రేవుల మేలనూరు కా ల్వ ఉల్చలా ఎత్తిపోతల పథకం,
2. చిన్నరాయణి తిప్ప ప్రాజెక్టు కోసం,జింకల పార్కు,పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ,
3. మార్కెట్ దోపిడికి వ్యతిరేకంగా గిట్టు బాటు ధరకై బలవంతపు భూసేకరణ హై టెన్షన్ లైన్ రైతుకు ఏ సమస్య వచ్చిన రైతులకు అండగా ఉండాలి.
Comments
Post a Comment