ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు విశేష స్పందన... దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత...

ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు విశేష స్పందన
దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
ఏళ్ల తరబడి చట్టబద్ధత పొందని లే అవుట్లకు విముక్తి కల్పించే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీ మ్ (ఎల్‌ఆర్‌ఎస్) కు సంబంధించి ఇప్పటికే ద రఖాస్తు చేసుకొని వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎల్‌ ఆర్‌యస్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వా రికి ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందజే సేం దుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురు వారం ప్రారంభించిన ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు దర ఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు గడువు ముగిసిన నే పథ్యంలో ప్రక్రియ పూర్తికి అవసరమైన షార్ట్ ఫాల్ పత్రాలు సమర్పించి,ఫీజులు చెల్లించిన వారికి కమిషనర్ చల్లా ఓబులేసు ధృవీకరణ పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సంద ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ఎల్‌ఆ ర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన వారు అవసరమైన పత్రాలు,ఫీజులు త్వరితగతిన పూర్తి చేసుకు ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవ లు అందిస్తున్నట్లు తెలిపారు.ఇంకా ఎవరైనా దరఖాస్తుదారులు మిగిలి ఉంటే శుక్రవారం మే ళాను వినియోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సిటీ ప్లానర్ వై.వెం కటరమణ,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా,బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు,ప్లానింగ్ కార్యదర్శు లు,ఎల్‌టీపీలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...