నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యం డి...కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు...ఎం.డి. అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యద ర్శి...

నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యండి
కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు
ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి 
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
నోయిడాలో కార్మికులపై జరిగిన నిర్బంధ కాం డను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగ నేషనల్ డిమాండ్స్ డే నిర్వహించా లని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయ ని నేషనల్ డిమాండ్స్ డే ను జయప్రదం చే యాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు కార్మికులకు పిలుపునిచ్చా రు.ఈ మేరకు ఆదివారం ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మునియప్ప అధ్యక్షతన నగరంలో ని సి ఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది.ఈ సమా వేశం లో ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బతకన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లెనిన్ బాబు హా జరై ప్రసంగించారు.ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన ఫరీదాబాద్ గు రుగావ్ నోయిడా ప్రాంతాలలో కార్మికులు ప్రభు త్వ విధానాలను నిరసిస్తూ రోడ్లపైకి రావడం జరి గిందని అన్నారు.కనీస వేతనాలు అమ లు చేయాలని పనిగంటలు తగ్గించాలని డి  మాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న కార్మి కులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం అరె స్టు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.దీ నికి నిరసనగా కార్మిక వర్గం తిరుగుబాటు చే యడం జరిగిందని అన్నారు.కార్మికులపై జరిగి న దమనకాండను కేంద్ర కార్మిక సంఘాలు తీ వ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఒకవై పు కార్మికులు పనిగంటలు తగ్గించాలని,కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళన చే స్తుంటే,కేంద్ర ప్రభుత్వం మే,9వ తేదీ నుండి లే బర్ కోడ్స్ అమల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించ డం దుర్మార్గమైన చర్య అని అన్నారు.కార్మి కుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడిం దని పేర్కొన్నారు.సోమవారం,12వ తేదీన జరి గే జాతీయ నిర్బంధకాండ వ్యతిరేకదినంగా నే షనల్ డిమాండ్స్ డే ను పాటిస్తూ అధిక సం ఖ్యలో కార్మికులు కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐ టియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్,న్యూసిటీ కార్యదర్శి నరసింహులు,ఏఐటియుసి డిప్యూ టీ జనరల్ సెక్రెటరీ రామాంజనేయులు,ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నగర అ ధ్యక్షులు రాము,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...