ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి...డివైఎఫ్ ఐ...

ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి
డివైఎఫ్ ఐ
VS9TV న్యూస్,కర్నూలు రూరల్ :
కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని డివైఎఫ్ఐ గ్రా మ కమిటీ డిమాండ్ చేసింది.సోమవారం గ్రా మ ప్రజలతో కలిసి గ్రామ సచివాలయం ముం దు డివైఎఫ్ఐ నాయకులు అంజి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్,డివైఎ ఫ్ఐ నాయ కులు అంజి,రాము,సుధాకర్,శి వ,రహీం, శ్రీకాంత్ లు మాట్లాడారు.కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో గ్రామ ప్రజలు మంచినీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.వారం రోజుల నుండి పది రోజులు,15రోజులు,20రోజులకు ఒకసారి మంచి నీళ్లు అందిస్తే ఎండాకాలంలో ఎలా ఉండాలని ప్రశ్నించారు.ప్రజల దాహంతో అధికారు లు ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బావాపురం స్కీం నుండి నీళ్లు రె గ్యులర్ గా వస్తున్నప్పటికీ పంపిణీ చేయడం లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నా రు.ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ కా ర్యదర్శి మొదలుకొని,ఎంపీ డీఓ దృష్టికి తీసు కువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్య క్తం చేశారు.వేసవిలో నీళ్లు అవసరం ఎక్కువ గా ఉంటుంది.ప్రతిరోజు అందించాలనే జ్ఞానం అధికారులకు లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాస్థాయి అధికారులు మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నా మని,ఎ వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తా మని ప్రకటనలు చేస్తున్నారు తప్ప,ఆచరణ లో ప్రజల తిప్పలు అలాగే ఉన్నాయన్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే మంచినీళ్ల కోసం ప్రజ లు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరి స్థితి ఉందని అన్నారు.మంచినీళ్ల కోసం రెండు కిలో మీటర్లు,మూడు కిలోమీటర్లు వాహనాల ద్వారా,నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవల సిన పరిస్థితి ఉందన్నారు.అలా తెచ్చుకోలేని వాళ్లు డబ్బులు పోసి మంచినీళ్లు కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు.ప్రజల కష్టాలకు పంచాయతీ అ ధికారుల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసు కుని,మంచినీటి సమస్య పరిష్కారం చేయాల ని ప్రతిరోజు శుభ్రమైన మంచినీటిని అందిం చాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో మండల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించా రు.పంచాయతీ కార్యదర్శి జోక్యం చేసుకుని రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు.ఈ కా ర్యక్రమంలో గ్రామ ప్రజలు,మహిళలు పెద్దఎ త్తున పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...