విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది...

విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది
VS9TV న్యూస్,చెన్నై,మే,10 : 
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘ ట్టం ఆవిష్కృతమైంది.ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసె ఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10-00 గంట లకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఘ నంగా బాధ్యతలు స్వీకరించారు.గవర్నర్ ఆ ర్.ఎన్.అర్లేకర్ విజయ్‌తో ప్రమాణం చేయిం చారు.భారీ భద్రత మధ్య జరిగిన ఈ కార్యక్ర మానికి రాజకీయ,సినీ,వ్యాపార రంగాలకు చెం దిన ప్రముఖులు,వేలాది మంది అభిమానులు హాజరయ్యారు.దశాబ్దాలుగా తమిళనాడు రా జకీయాలను ప్రభావితం చేసిన డిఎంకె,ఎఐడి ఎంకె పార్టీల ఆధి పత్యానికి చెక్ పెడుతూ టీ వీకె పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీ యాల్లో సంచలనంగా మారింది.ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకె పార్టీ ఘన విజ యం సాధించగా,మిత్రపక్షాల మద్దతుతో విజ య్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.రాష్ట్ర రాజ కీయాల్లో కొత్త శకానికి ఇది నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నా రు.బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రగ్స్ నిరోధక బృందాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నిర్ణయం తీ సుకున్నారు.యువతను డ్రగ్స్ బారిన పడకుం డా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటా మని ప్రభుత్వం స్పష్టం చేసింది.మహిళల భద్ర తకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నా రు.ఈ పథకం వల్ల లక్షలాది మహిళలకు ప్ర యోజనం కలగనుంది.విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీతోపాటు సినీ,రాజ కీయ ప్రముఖులు హాజర య్యారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం విజయ్ భావోద్వేగ వ్యా ఖ్యలు చేశారు.“నేను మీ ఇం ట్లో ఒక కుటుంబ సభ్యుడిని.మీకు అన్నగా,త మ్ము డిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు...పే దరికం తెలుసు” అంటూ ప్రజలతో తన అను బంధాన్ని వ్యక్తం చేశారు.యువత,రైతులు,మ హిళలు,పేదల అభివృద్ధే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు.అవినీతి ర హిత పాలన,ఉపాధి అవకాశాల పెంపు,సంక్షే మ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తా మని వెల్లడించారు.విజయ్ అధికారంలోకి రా వడంతో తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకె కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటుండగా,సోషల్ మీడియాలో కూ డా సీఎం విజయ్ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...