Posts

రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ బానోత్‌ దుర్గా ప్రసాద్‌....

Image
రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  టెక్నికల్‌ అసిస్టెంట్‌ బానోత్‌ దుర్గా ప్రసాద్‌ VS9TV న్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ బా నోత్‌ దుర్గా ప్రసాద్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల బారిన పడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి... ఫిర్యాదుదారుడు MGNREGS కింద ని ర్మించబడిన పశువుల కొట్టానికి సంబంధించి కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయించేందుకు మరియు పెండింగ్‌లో ఉన్న బిల్లును మంజూరు చేయించేందుకు అధికా రిక సహాయం కోసం వెళ్లగా,ఇందుకోసం రూ.10వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమా చారం ఫిర్యాదు మేరకు అనిశా అధికారులు ఏర్పాటు చేసిన ఉచ్చులో నిందితుడు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుబడినట్టు వెల్లడించారు. ప్రజలకు అనిశా విజ్ఞప్తి : ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే,ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, ఫి ర్యాదు దారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయ...

మౌర్య ఇన్ లో ఘనంగా ది మిర్రర్ ఎఫైర్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం...

Image
మౌర్య ఇన్ లో ఘనంగా ది మిర్రర్ ఎఫైర్స్ ఎగ్జిబిషన్  ప్రారంభం VS9TV న్యూస్, కర్నూలు ప్రతినిధి :    మారుతున్న పోటీ ప్రపంచంలో మహిళలకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ తో కర్నూ లులో ది మిర్రర్ అఫైర్ కర్నూల్స్ ఫస్ట్ లక్సరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.కర్నూలుకు చెందిన హర్షత,తేజోమయ్ మరో ఇద్దరు స్నేహితులు కలిసి హోటల్ మౌర్య ఇన్ లోని ఆర్య ఫంక్షన్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ ను శనివారం ఏర్పాటు చేశారు.ఈ ఎగ్జిబిషన్ ను మా జీ ఎంపీ టీజీ.వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా హర్షత, తేజోమయ్ లు మాట్లాడుతూ  ఎగ్జిబిషన్  27,28 తేదీల్లో కొన సాగనుంది.ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు తెలి పారు.ఎగ్జిబిషన్లో ప్రత్యేకమైన బనానాస్ వివర్స్,శుభ గోల్డ్ అండ్ డైమండ్స్,పోచంపల్లి, మంగళగిరి శారీస్ ప్రత్యేకత.అదేవిదంగా మహిళలకు కావలసిన అన్ని రకాలైన శారీస్, బ్యాంగిల్స్,చైన్స్,వన్ గ్రామ్ గోల్డ్ కూడా లభించును.మహిళలకు కావలసిన అన్ని రకా లైన లేటెస్ట్ అలంకరణ వస్తువులు లభించును.మా ఎగ్జిబిషన్ నందు మంచి నాణ్యతతో కూడిన వస్తువులు లభించును ఈ అవకాశంను మహిళలందరూ వినియోగించు కోవాల ని వార...

పేదలపై హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం అరికట్టాలి...తప్పుడు సర్వేనెంబర్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి...జి.రామకృష్ణ,సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు...కె.సుధాకరప్ప,నగర కార్యదర్శి వర్గ సభ్యులు...

Image
పేదలపై హిందూజా ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం అరికట్టాలి తప్పుడు సర్వేనెంబర్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న  అధికారులపై చర్యలు తీసుకోవాలి జి.రామకృష్ణ,సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు  కె.సుధాకరప్ప,నగర కార్యదర్శి వర్గ సభ్యులు  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలులో పేదలకు రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న హిందూజా ఫైనాన్స్ కం పెనీ దౌర్జన్యం అరికట్టాలని,అదేవిదంగా పట్టా భూములను తప్పుడు సర్వేనెంబర్ లు సృ ష్టించి రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాక రప్పలు డిమాండ్ చేశారు.ఈ మేరకు కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ము జఫర్ నగర్ లో పేద కుటుంబమైన జాకీర్ హుస్సేన్ ఇంటికి హిందూజా ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది తాళం వేసి బెదిరింపు లకు పాల్పడుతున్న ఘటనకు శనివారం సిపిఎం పార్టీ ఆ ధ్వర్యంలో జాకీర్ హుస్సేన్ ద్వారా సమాచారం సేకరించారు.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యధర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ,నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాక రప్పలు మాట్లాడ...

బీసీ రిజర్వేషన్లు...హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

Image
బీసీ రిజర్వేషన్లు...హైకోర్టు కీలక వ్యాఖ్యలు VS9TV న్యూస్,హైదరాబాద్‌ :  బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిపింది.హౌస్‌ మోషన్‌ పిటి షన్‌ విచారించేందుకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ఏర్పాటు చేశారు.జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి,జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్‌ విచారణ చేపట్టింది.పిటిషనర్‌ తరఫున సీనియ ర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు.రిజర్వేషన్లు 50 శాతం దాట డం...రాజ్యాంగ విరుద్ధమని...స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం దాటకూడ దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వం తరపున ఏ జీ వర్చువల్‌గా హాజరుకాగా...బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయ న పేర్కొన్నారు.తమిళనాడులో రిజర్వేషన్లు 50శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తా వించింది.బీసీ బిల్లు గవర్నర్‌ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా...గ వర్నర్‌ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు.గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీఓ ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీఓ ఎలా ఇ స్తారు? అంటూ హైకోర్టు ప...

ఆదిలాబాద్‌లో గంజాయి సాగు పట్టుబడ్డ రైతు...

Image
ఆదిలాబాద్‌లో గంజాయి సాగు...పట్టుబడ్డ రైతు VS9TV న్యూస్,జైనూర్ : జైనూర్ మండలం,ఢాబోలీ గ్రామానికి చెందిన అథ్రం లక్ష్మణ్ (55) తన భూమిలో 10 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్ పె క్టర్ రాణాప్రతాప్ బృందం శనివారం పట్టుకుంది.నిందితుడిని మొక్కలతో పాటు జైనూర్ పోలీసులకు అప్ప గించగా కేసు నమోదు చేశారు.గంజాయి సాగు,వినియోగం,రవాణా నేరమని,ఇలాంటి అక్రమాలకు కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు.

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి మింగళం...

Image
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి మింగళం రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ  ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగి VS9TV న్యూస్,మంచిర్యాల : ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసిన కూడా కొందరు ప్రభుత్వ అదికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయంలో  అవినీతి  పెరిగిపోతూనే ఉంది.ప్రతి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఒకరు ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి ప ట్టుపడుతూనే ఉన్నారు.అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడ్డ అవినీతి అధికారులు మాత్రం వారికి లంచం ఇవ్వందే ఏ పని కూడా చేయడం లేదు.తప్పని పరిస్థితుల్లో బాధితులు ఏ సీబీని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.వివరాలు ఇలా ఉన్నాయి...మంచిర్యాల జి ల్లా,కన్నేపల్లి ఎంపీడీవో కార్యాలయలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దుర్గప్రసాద్,ఓ రైతు వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి ప ట్టుబడ్డారు.ఒకవైపు ఉదయం మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణారెడ్డి ఇంట్లో ఏసీ బీ సోదాలు కొనసాగుతుండగానే,మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఉ ద్యోగిగా పనిచేస్తున్న దుర్గప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం.

తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ...

Image
తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ V S9TV న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం భారీగా IAS, IPS లను బదిలీ చేసింది. బదిలీఅయిన వారు : 1. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ 2. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ 3. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్ 4. ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్ 5. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు 6. సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు 7. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్ 8. పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర 9. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్ 10. హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు 12. హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్ 13. వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్ 14. నారాయణపేట ఎస్పీగా వినీత్,  15. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత 16. స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా

పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక...

Image
పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక VS9TV న్యూస్,ములుగు : పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా,మ ల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు.ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు.తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపిక య్యారు.

బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధాని...జి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం...

Image
బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి జాతికి అంకితం చేసిన భారత ప్రధాని జి.రమేష్,కర్నూలు బిజినెస్ ఏరియా పిజిఎం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అ భివృద్ధి చేసిన బిఎస్ఎన్ఎల్ 4జి సేవలను భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడి శాలోని జార్సుగూడ నుండి ప్రారంభించారని కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనర ల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు.శనివారం కర్నూలు జిల్లా,పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి టవర్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ హాజరై మాట్లాడుతూ జాతీయ సమాచార మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా రూ.37,500 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో ( మేక్ ఇన్ ఇండియా) దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన 97,500 టవ ర్లను,దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 108గ్రామాల్లో 4జి సేవలను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారని అన్నారు.ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10గ్రామాల్లో కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం,పులికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన 4జి శాచురేషన్ ...

జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తాం...డాక్టర్ ఏ.సిరి,జిల్లా కలెక్టర్...

Image
జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేయడానికి  అన్నివిధాలా కృషి చేస్తాం డాక్టర్ ఏ.సిరి,జిల్లా కలెక్టర్  VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జి ల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప ర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ...ఈ ఏడాది ప్రపంచ పర్యాటక ది నోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం,పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడు కుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందామని సూచించారు.జిల్లాలో రూ.14 కోట్లతో ఐదు టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను,కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని,పర్యావరణాన్ని పాడు చేసు కుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని,అలాగే ఇళ్లలో,కార్యాలయాల్లో ఏసీ,కరెంటు వా ...

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి...

Image
ఐదు లక్షలు లంచం తీసుకుంటూ  ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి VS9TV న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జిల్లా,ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.వెంచర్కు అనుమతి కోసం రూ.5 లక్షలు లం చం డిమాండ్ చేశారు.ఇప్పటికే లక్ష రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ రెడ్డి...శనివారం మరో రూ.3.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.దీంతో ఆయనను అదుపు లోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. రాధాకష్ణారెడ్డి ఇల్లు,కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండి...వెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండి...

Image
అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడండి వెంటనే నోటీసులు జారీ చేసి,చార్జిషీట్ దాఖలు చేయండి ఎల్‌ఆర్‌ఎస్ పథకం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని వీడాలని,వెంటనే నోటీసులు జారీ చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధి కారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు,సిబ్బందితో కలిసి ఓపెన్ ఫోరం కా ర్యక్రమం నిర్వహించారు.పలువురు అర్జీదారులు తమ సమస్యలను చెప్పగా,జాప్యానికి కా రణాలను అడిగి,చట్టపరిధిలో వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రతి సచివాలయ పరిధిలో సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి,ఇతర కార్యదర్శుల సహాయం తీసుకుని అక్రమ నిర్మాణాలు గుర్తించాలని అన్నారు.అప్రూవల్ ఉందా? ప్లాన్‌ విరుద్ధంగా ఏమైనా నిర్మాణాలు చేస్తున్నా రా? చెక్‌లిస్ట్ ప్రకారం పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.అందు...

అంబులెన్సు కు దారి ఇవ్వమన్నందుకు ఘోర దాడి...

Image
దారి ఇవ్వమన్నందుకు ఘోర దాడి VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌ బీఎస్ రెడ్డినగర్‌లో మానవత్వం మంటగలిసింది.కోఠి ENT ఆసుపత్రి నుంచి బాలిం తను ఇంటికి తీసుకెళ్తున్న అంబు లెన్స్ డ్రైవర్‌పై కొందరు యువకు లు దాడి చేశారు.దారి ఇవ్వమని అడిగినందుకు డ్రైవర్‌తో పాటు స హాయం చేసిన సెక్యూరిటీ గార్డు ను కూడా విచక్షణా రహితంగా కొట్టారు.పేషెంట్ ఉందని తెలిసి నా అంబులెన్స్‌ను అరగంట పా టు ఆపి,డ్రైవర్‌ను కాళ్లు మొక్కించుకున్నారు.అంతేకాకుండా నడిరోడ్డు మీద ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చేష్టలతో వీరంగం సృష్టించారు.ఈ ఘటనపై స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా వైరల్ చేశారు.

ఆర్పీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి...ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పిడికి వినతి...

Image
ఆర్పీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పిడికి వినతి VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ఆర్పీల పెండింగ్ వేతనాల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కర్నూలు మెప్మా పిడికి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి ఎస్.ఉమాదేవి, జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి మాట్లా డుతూ రాష్ట్రప్రభుత్వం వెంటనే బకాయి పడ్డ ఆరు నెలల వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోరారు.ఈ నేపథ్యంలో ఆర్పీల వేతనలకోసం పడుతున్న ఆవేదనను మిగత ఆ ర్పీలు సైతం స్పందించి భవిష్యత్ లో చేసే కలెక్టరేట్ ధర్నాలో పాల్గొనాలని వారు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.రుద్రమ్మ,నగర కార్యదర్శి ఎస్.షబాన,కో శాధికారి సుజాత ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సుజాత, కమిటి సభ్యులు కె.నాగమణి,నాగేశ్వ రి, బి.జ్యోతి,సంధ్యారాణిలు పాల్గొన్నారు.

నిజాయితీ నిరూపించుకున్న ఆటో డ్రైవర్... సన్మానించిన నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ...

Image
నిజాయితీ నిరూపించుకున్న ఆటో డ్రైవర్ సన్మానించిన నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ జంక్షన్ వద్ద గత గురువారం అభిరామ్ (8886498 774) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటో డ్రైవర్ పి రవికుమార్ నాయక్ (9010230 689) ఆటోలో బాబా బృందావన్ నగర్ కు వచ్చి ఆటోలో తన ఐఫోన్ మరిచిపోయారు. అనంతరం అక్కడ నుండి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ వెంకటరమణ కాలనీ నందు పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ వేయించుకోవడానికి ఆటో దిగి చూసుకోగా సీటుపై ఐఫోన్ కనపడ టంతో తిరిగి తాను దించిన ప్యాసింజర్ల వద్దకు వెళ్లి వారికి సెల్ ఫోన్ పోయిన విషయం వారికి తెలిపి నాలుగో పట్టణ సిఐ విక్రమసింహ సమక్షంలో ఆటో డ్రైవర్ వారి సెల్ఫోన్ వా రికి అప్పగించారు.ఫోన్ విలువ సుమారు రూ.80000 వేలు.కావున ఈ సందర్బంగా ఆ టో డ్రైవర్ రవికుమార్ నాయక్ ను సిఐ విక్రమ్ సింహ అభినందించి శాలువా కప్పి సన్మా నించారు.ఈ కార్యక్రమంలో నాలుగో పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నా రు.

ఏపీ 108 సర్వీసెస్ లో EMT & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...

Image
ఏపీ 108 సర్వీసెస్ లో EMT & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : అంధ్రప్రదేశ్–108 అంబులెన్స్ సర్వీసెస్ కోసం EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) మరియు డ్రైవర్ల పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) అర్హతలు : B.Sc Nursing / GNM / B.Sc Life Sciences / B.Sc Physiothe rapy / B.Sc / M.Sc EMT గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు. డ్రైవర్లు అర్హత : 10వ తరగతి పాస్ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) + 2 ఏళ్ల అనుభవం. గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు. ఇంటర్వ్యూ ప్రదేశం : అంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్,భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,PMD బ్రాంచ్ ఆఫీస్,మెగాసిటీ ప్లాజా సమీపంలో,మంగళరావుపేట, విజయవాడ. తేదీలు : 29,30 సెప్టెంబర్ 2025. గమనిక : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు రెజ్యూమ్,ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు,అనుభవ సర్టి ఫికేట్లు,ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్ & జిరాక్స్ తీసుకురావాలి.

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు...

Image
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు VS9TV న్యూస్,విశాఖపట్నం : విశాఖలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ACBకి చిక్కారు.రవితేజ అనే వ్యక్తి తన ఇంటికి సంబందించి సర్వే నంబర్ తప్పుగా ఉందని...సర్వే చేసి సరైన రిపోర్టు ఇ వ్వాలని ములగడ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ కు రూ.30 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ సత్య నారాయణ,జూనియర్ అసిస్టెంట్ నగేశ్ డిమాండ్ చేయడంతో రవితేజ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.మహాత్ కాలనీ సచివాలయం వద్ద లంచం తీసుకుంటుండగా వీరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏఐ భయంలో సెలబ్రిటీలు...కోర్టులకు పరుగులు...

Image
ఏఐ భయంలో సెలబ్రిటీలు...కోర్టులకు పరుగులు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఏఐ వీడియోల భయంలో సెలబ్రిటీలు కంగారు పడిపోతున్నారు.తమ ఫోటోలు వాడు కుంటూ కొందరు ఏఐ మార్ఫ్‌డ్ ఫోటోస్,వీడియోలు క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించ డం,తమ ఇమేజ్ ను దుర్వినియోగం చేయడం చేస్తన్నారని అసహనం వ్యక్తం చేస్తున్నా రు.వీరందరిని కంట్రోల్ చేయడానికి న్యాయపరంగా ముందుకు వెళ్తున్నారు.తాజాగా నా గార్జున ఈ ఏఐ ట్రెండ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు.‘యాక్టర్‌గా ఇప్పటికే ఆన్ లైన్‌లో ఉన్న ఫోటోలు,వీడియోలను AI ద్వారా మార్ఫింగ్ చేసి నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు.అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దాని ఆధారంగా డబ్బులు సంపాదిస్తున్నారని పిటిషన్ వేశారు.ఆ వీడి యోలు ప్రమోషన్లుగా వాడుతున్నారు.తన హ్యాష్ ట్యాగ్‌తోనే వీటిని మార్కెటింగ్ చేస్తున్నా రని...ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్‌ను ఇలా తప్పుడు మార్గంలో ఉపయోగించి తన వ్యక్తి త్వాన్ని దెబ్బ తీస్తున్నారు పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా అనుమతి లేని ఫోటో స్,కంటెంట్‌తో తన ఇమేజ్ ప్రమాదంలో పడిందని నాగార్జున తరపు లాయర్ వాదించా రు.నాగార...

రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన జూనియర్ లైన్‌మెన్...

Image
రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి  చిక్కిన జూనియర్ లైన్‌మెన్ VS9TV న్యూస్,హైదరాబాద్ :  రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు మరోమారు లంచగొండిని పట్టుకున్నా రు.ప్రజల ఇళ్లకు విద్యుత్ సరఫరా పనుల్లో సహాయం చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ లైన్‌మెన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి ... గచ్చిబౌలి డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్,ఫిర్యాదు దారుని ఇంటికి 5 కె.వి.నుండి 11కె.వి వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించే పనుల్లో సహాయం చేస్తానని,వైరింగ్ మార్చడంలో, అలాగే ఇంట్లో ఉన్న మీటర్‌ను విప్పి మళ్లీ సీల్ చేయడంలో అధికారిక సహకారం అందిస్తానని చెప్పి రూ.30వేలు లంచం డిమాండ్ చే శాడు.ఫిర్యాదుదారు అనిశాకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు.ముందుగా ఒప్పుకున్న లంచం మొత్తంలో రూ.11వేలు తీ సుకుంటూ ఉండగా ఆయనను అధికారులు పట్టుకుని సాక్ష్యాలతో అదుపులోకి తీసుకున్నా రు.ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి  లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగి/అధికారి పట్ల వెంటనే ఫిర్యా దు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ పిలుపు ...

స్టేషన్ బెయిల్ కోసం రూ.40వేలు అడిగిన ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు...

Image
స్టేషన్ బెయిల్ కోసం రూ.40వేలు అడిగిన  ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు VS9TV న్యూస్,మణుగూరు : మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని రూ.40 వేలు డిమాండ్ చేసిన ఎ స్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.బాధి తుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చే పట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు రూ.40వేలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో,అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తె లిపారు.ఈ విషయంపై ఏసీబీ అధికారులు పూర్తిగా విచారిస్తున్నారు.

అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండి...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

Image
అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండి విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ప్రజలు,బాధితులు అత్యవసర పరిస్ధితులు,ఆపద సమయాల్లో,ఎమైనా స మస్యలు,అసాంఘిక కార్యకలపాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే డయల్ 112 కి కాల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు.గొడవలు,తగాదాలు,కుటుంబ సమస్యలు,అనుమానాస్పద వ్యక్తుల కదలి కల వివరాలు ఎదైనా మీ దృష్టికి వచ్చిన కూడా వెంటనే డయల్ 112 కి జిల్లా ప్రజలు కా ల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.డయల్ 112కు కాల్ చేసినా వెం టనే స్పందించి పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ వారు కేవలం 15 ని మిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకుని,తగిన చర్యలు తీ సుకోవడం జరుగుతుందన్నారు.డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ 24X7 కమాండ్ కం ట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ సిబ్బందికి క్షణాల్లో సమాచారం వెళుతుందన్నారు.జిల్లాలోని ప్ర జలు గతంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ గా ఉన్న డయల్ 100నంబర్ కు బ...

కోడింగ్ అవగాహనకు కోడెక్స్ 3.0...

Image
కోడింగ్ అవగాహనకు కోడెక్స్ 3.0 VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : టీసీఎస్ కోడ్‌విటా పోటీకి ముందు విద్యార్థుల్లో కోడింగ్,సమస్యల పరిష్కార నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్),కర్నూలు ప్ర తి సంవత్సరం కోడెక్స్ కోడింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలో సెప్టెంబర్,25, 2025న కోడెక్స్ 3.0ఘనంగా జరిగింది. ఈ పోటీలో మొత్తం 280మంది విద్యార్థులు హాజరయ్యారు.జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల,ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజ్,జి.పుల్ల య్య ఇంజినీరింగ్ కాలేజ్,రవీంద్ర ఇంజినీరింగ్ కాలేజ్,అశోక ఇంజినీరింగ్ కాలేజ్‌తో పా టు ఇతర విద్యాసంస్థల విద్యార్థులు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు.రెండు రౌండ్ల లో నిర్వహించిన ఈ పోటీలో ఐఐఐటిడిఎమ్ కర్నూలు విద్యార్థులు మొదటి బహుమతి గె లుచుకోగా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రెండవ,మూడవ బహుమతు లను సాధించారు.విజేతలను కళాశాల ప్రిన్సిపాల్,మేనేజ్మెంట్,అధ్యాపకులు అభినందిం చారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కోడింగ్ నైపుణ్యాల పెంపుదలతో పాటు పోటీ ప్రోగ్రా మింగ్‌పై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విలువైన వేదికగా నిలిచిందని పేర...

దొరల గుండెల్లో బడబాగ్ని ఐలమ్మ...నేడు 130వ జయంతి ఉత్సవాలు...

Image
దొరల గుండెల్లో బడబాగ్ని ఐలమ్మ నేడు 130వ జయంతి ఉత్సవాలు VS9TV న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి : ఈ భూమినాది… పండించిన పంట నాది...తీసుకెళ్లడానికి దొరెవ్వడు...నా ప్రాణం పో యాకే ఈ పంట,భూమి దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన వీరనారి చిట్యాల ఐలమ్మ.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మడమతిప్పని పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతిని పు రస్కరించుకొని VS9TV న్యూస్ ప్రత్యేక కథనం...ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో పేద కుటుంబంలో ఐలమ్మ 1895,సెప్టెంబర్‌,26న జన్మించింది.ఆమెకు ఐదుగురు కుమా రులు,ఇద్దరు కుమార్తెలు సంతానం.రజక కులవృత్తినే జీవనాధారంగా చేసుకుని బతికేది. 1940-44 కాలంలో విసునూర్‌ దేశ్‌ముఖ్‌,రజాకార్ల అరాచకాలు పెట్రేగిపోయాయి.అ ణచివేతకు గురవుతున్న కులాలవారు దొరా అని పిలువకపోతే అగ్రకులాల్లో ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాల్లో బయటకు వచ్చేది.తమను దొరా అని పిలువని స్త్రీల మీద త మ భర్తలను ఉసిగొల్పి,దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు.ఇలాంటి దారుణ పరిస్థి తులపై ఐలమ్మ ఎర్రజెండా పట్టి ఎదురు తిరిగింది.మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో నలభై ఎకరాల భూమి ...

వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదు...

Image
వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదు పెళ్లయ్యాక మహిళ గోత్రం మారుతుంది వారసత్వ హక్కులపై సుప్రీం తీర్పు VS9TV న్యూస్,న్యూఢిల్లీ : భర్త,పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తిం టివారికే చెందుతుందని,పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించింది .వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొంది.హిందూ వారసత్వ చట్టం,1956లోని సెక్షన్‌ 15(1)(బీ)ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్శంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ సెక్షన్‌ ప్రకారం వీలునామా రాయ కుండా హిందూ మహిళ మరణిస్తే,ఆమెకు భర్త,పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది.చట్టంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక ఛట్రాన్ని అర్థం చే సుకోవాలని జస్టిస్‌ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు గు ర్తు చేసింది.వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి.ఇది హిందూ వారస త్వ చట్టం.హిందూ అంటే అర్థం ఏమిటి హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు.కాని కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మా రుతుంది.ఆమె ఇంట...

వృద్ధాప్య తల్లితండ్రులను పట్టించుకోకపో తే...ఆస్తి అనుభవించే హక్కు లేదు... సుప్రీంకోర్టు స్పష్టం...

Image
వృద్ధాప్య తల్లితండ్రులను పట్టించుకోకపోతే ఆస్తి అనుభవించే హక్కు లేదు సుప్రీంకోర్టు స్పష్టం VS9TV న్యూస్,హైదరాబాద్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.అలా ప్రవర్తించే సంతానాన్ని బయ టకు వెళ్లగొట్టొచ్చని తేల్చి చెప్పింది.బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ,పోషణ చట్టం అండగా నిలుస్తుంద ని వ్యాఖ్యానించింది.కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మ హారాష్ట్రకు చెందిన 80ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా...ఈ తీర్పు వెలువ డింది. తల్లిదండ్రుల సంరక్షణ,పోషణ చట్టం ప్రకారం...ఏర్పాటైన ట్రైబ్యునళ్లు కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది.ఇలాంటి వి వాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్... బహిరంగ లేఖ ద్వారా వివరాలు...

Image
బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్ బహిరంగ లేఖ ద్వారా వివరాలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ తో జరిగిన సినీ పెద్దల సమావేశంపై అసెం బ్లీలో జరిగిన చర్చపై చిరంజీవి స్పందించారు.విదేశాల్లో ఉన్నందున లేఖ విడుదల చేశా రు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గత గురువారం శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది.అసెంబ్లీ వేదికగా శాసన సభ్యులు బాల కృష్ణ మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈ యన వచ్చాడు అన్నది అబద్ధం అన్నారు.గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ” అంటూ ” ఆ యనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట.లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట”,అంటూ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్ర సారం ద్వారా చూసినట్లు పేర్కొన్నారు.ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది.కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను.రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొం...

ఆయుర్వేదంపై అవగాహన సదస్సు...డాక్టర్ ఎస్.లలిత,కళాశాల ప్రిన్సిపల్...

Image
ఆయుర్వేదంపై అవగాహన సదస్సు డాక్టర్ ఎస్.లలిత,కళాశాల ప్రిన్సిపల్ VS9TV న్యూస్,నంద్యాల ప్రతినిధి : బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయు ర్వేదంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ ఎస్.లలిత మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాముఖ్యత,విద్యార్థులు ఏ విధమైన జీ వన శైలికి అలవాటు పడాలనే విషయాలను వివరించారు.ప్రశాంతమైన మనసు,వాతా వరణం రెండు మనిషి ఆయుష్షును పెంచుతాయని తెలియజేశారు.మన వంట ఇంటిలోని అనేక ఆయుర్వేద మూలికలను గుర్తు చేశారు.అదేవిధంగా ఆయుర్వేద మొక్కల పెంపకా న్ని ప్రోత్సహిస్తూ వాటి ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని విద్యార్థులకు సూ చించారు.బనగానపల్లె,ఆయుర్వేద హాస్పిటల్,సీనియర్ మెడికల్ అధికారిణి డాక్టర్ టి.వా ణి మాట్లాడుతూ చరక సంహిత నుండి ఇప్పటి వరకు మనం నిత్యం అనుసరించే ఆయు ర్వేద విధానాలను,పంచకర్మ విధానాలను వివరించారు.గోల్డెన్ మిల్క్,పోషక విలువలతో నిండిన ఆహారాన్ని భుజిస్తూ, సానుకూల దృక్పథంతో ఉండటం ఆయుర్వేదంలో భాగమని తెలియజేశారు.వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ కరోనా సమ యంలో మనం ఉపయోగి...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్...

Image
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి VS9TV న్యూస్,తిరుమల : భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవేంక టేశ్వరస్వామిని దర్శించుకున్నారు.తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్,టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు.దేవాలయం లోపలికి వెళ్ళిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు వ కుళామాత ఆలయం,విమాన వేంకటేశ్వరస్వామి,భాష్యకార్ల సన్నిధి,యోగ నరసింహ స్వా మి ఆలయాలను కూడా దర్శించుకున్నారు.  తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి.బ్రహ్మోత్సవాల తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ ప్రధాన గోపురం నుంచి పెద్ద శేషవాహనంపై తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ శేషవాహన సేవలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతు లు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద...

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు...ఈడీ విచారణకు జగపతిబాబు...

Image
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు ఈడీ విచారణకు జగపతిబాబు VS9TV న్యూస్,హైదరాబాద్ :  నటుడు జగపతిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు.ఆయనను నాలుగు గంటల పాటు అధి కారులు విచారించినట్లు సమాచారం.సాహితీ ఇన్‌ఫ్రా కేసులో జగపతిబాబును ఈడీ వి చారణకు పిలిచింది.సాహితీ తరపున పలు ప్రకటనలో నటించిన జగపతిబాబుకు,సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఆయనను ఈడీ విచా రించింది.సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్‌లో నుంచి జగపతిబాబుకు నగదు బది లీ అయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినం దున జగపతిబాబును పిలిచి విచారించినట్లు వెల్లడించారు.జగపతిబాబుకు సాహితి నుం చి వచ్చిన డబ్బులకు సంబంధించి సమాచారం తెలుసుకున్నామని అధికారులు స్పష్టం చే శారు.సాహితీ ఇన్ఫ్రా,ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు,విల్లాల నిర్మాణం పేరిట కొను గోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి,నిర్మాణాలు చేపట్టకుండా మో సానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి.ఈ మేరకు సాహితీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది.సాహితీ నిర్వాహకులు రూ.126కోట్లు కొను గోలు దారుల నుంచి వస...

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వరాదు...ఎస్.దేవ సహాయం,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు...

Image
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు  స్టేషన్ బెయిల్ ఇవ్వరాదు ఎస్.దేవ సహాయం,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు   VS9TV న్యూస్,విజయవాడ : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వరాదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్.దేవ సహాయం రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరారు.గురువారం విజయవాడ నందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసి టీ బాధితులతో జరిగిన ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ...ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరు గార్చకుండా పటిష్టంగా అమ లు చేయాలని విన్నవించారు.రాజకీయ నాయకుల జోక్యంతో కేసులు కట్టడం,ఫాల్స్ చే యడం,రాజీ వంటి చర్యల వల్ల నీరుగారి నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుం దని ఆవేదన చెందారు.ఈ డిమాండ్లతో ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ బాధితులతో కలిసి జిల్లా కేం ద్రాలలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నట్లు వివరించారు.ఈ ఉద్యమానికి అ ట్రాసిటి చట్టం పరిరక్షణ దిశగా కలిసొచ్చే వ్యక్తులతోనూ,శక్తులతోనూ ముందుకెళుతున్న ట్లు వారు తెలిపారు.

వైసీపీ యువనేత దారుణ హత్య...

Image
వైసీపీ యువనేత దారుణ హత్య VS9TV న్యూస్,అనంతపురం : అనంతపురం జిల్లా,పామిడి మండలం,కలాపురంలో దారుణం చోటు చేసుకుంది.వైసీపీ యువనేత సతీష్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.బైక్ పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలి యని దుండగులు సతీష్ రెడ్డి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు.ఇటీవలే వైసీపీ పార్టీ సతీష్ రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా నియమించింది.ఇంతలోనే సతీ ష్ రెడ్డి హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

టీడీపీ ప్రభుత్వ వేధింపులపై వైసీపీ డిజిటల్ బుక్...

Image
టీడీపీ ప్రభుత్వ వేధింపులపై వైసీపీ డిజిటల్ బుక్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించిన జగన్ నారా లోకేశ్ రెడ్ బుక్‌కు కౌంటర్‌గా రూపకల్పన అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం ఫిర్యాదుల కోసం వెబ్‌సైట్, ఐవీఆర్ఎస్ నంబర్ ఏర్పాటు 15నెలల కూటమి పాలనపై తీవ్ర విమర్శలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది.తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు,వేధింపులను నమోదు చే సేందుకు 'డిజిటల్ బుక్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని,అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ ప్ర స్తావించిన 'రెడ్ బుక్'కు ఇది సమాధానంగా కనిపిస్తోంది.నేడు అది రెడ్ బుక్ కావచ్చు, రాబోయే రోజుల్లో అది డిజిటల్ బుక్ అవుతుంది అని జగన్ వ్యాఖ్యానించారు.తమ ప్రభ...

ద్విచక్ర వాహనాల దొంగల గ్యాంగ్ అరెస్ట్...పది ద్విచక్ర వాహనాలు,ఒక కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ స్వాధీనం...

Image
ద్విచక్ర వాహనాల దొంగల గ్యాంగ్ అరెస్టు పది ద్విచక్ర వాహనాలు ఒక కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ స్వాధీనం దొంగలించిన వాహనాలు కొనుగోలు చేసిన తాకట్టు  పెట్టుకున్న వారిపై కూడా కేసులు నమోదు సీఐ వై శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ VS9TV న్యూస్,మంగళగిరి : మంగళగిరి పోలీసు స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులను మంగళగిరి గ్రామీణ సీఐ వై.శ్రీనివాసరావు గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు ఛేదించారు.బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బైక్ చోరీలు చేసిన నిందితుల వివరాలను గ్రామీణ సిఐవై శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు వెల్లడించా రు.దొంగలించిన పది బైకులను స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులు,వీరిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు.వారందరినీ గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.వీరి వద్ద నుండి స్వాధీనం చేసిన వాహనాల్లో ఒక కేటిఎమ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఉండ టం విశేషం.దొంగల గ్యాంగ్‌లో ప్రధాన నిందితులు లేళ్ల పవన్ తేజ @ క్రాంతి తేజ @ పవన్,తేజావత్ ప్రకాష్,పెడల అంకమ్మరాజు @ రాజు,ఇసుకుపల్లి కీర్తి ద...

ఏపీఎస్పీసీఎల్ కు భూమి కేటాయింపుపై ప్రతిపాదనలు వెంటనే పంపండి...జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా...

Image
ఏపీఎస్పీసీఎల్ కు భూమి కేటాయింపుపై  ప్రతిపాదనలు వెంటనే పంపండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా VS9TV న్యూస్,నంద్యాల కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (APSPCL) వారికి లీజ్ ప్రాతి పదికన భూముల కేటాయింపుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా వెంటనే పంపించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులకు సూచించారు. విజయవాడలోని సీసీఎల్ఏ (CCLA) కార్యాలయం నుంచి సీసీఎల్ఏ విజయలక్ష్మి ఆధ్వ ర్యంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లతో భూ కేటాయింపుపై వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు.కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజకుమారి గణియా,జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్,డీఆర్ఓ రామునాయక్,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావు తదితర అధికారులు సమావేశంలో హాజరయ్యా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గతంలో భూమి కేటాయింపు ప్రతిపాదనను సమర్పించడం జరిగిందన్నారు.ఈ క్రమంలో నంద్యాల జిల్లా లోని గడివేముల మండలం,గ...

సమాజానికి చేతనంత సేవచేయాల్సిన అవసరముంది...ఆచార్య వి.వెంకట బసవరావు, రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్....

Image
సమాజానికి చేతనంత సేవచేయాల్సిన అవసరముంది వి.వెంకట బసవరావు, రాయలసీమ  యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆచార్య VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : సమాజం నుండి వివిధ సౌకర్యాలను పొందుతున్న ప్రతిఒక్కరూ తిరిగి సమాజానికి చేత నంత సేవచేయాల్సిన అవసరముందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆ చార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.జాతీయ సేవాపథక దినోత్సవాన్ని పురస్క రించుకొని బుధవారం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన స మావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణ,అటవీ మరియు వాతావరణ శాఖవారు సేవాపర్వ్ కార్యక్రమంలోభాగంగా వాయుకాలుష్య నివారణ,ప్లాస్టి క్ వ్యర్థాల నిర్మూలన, వినియోగాన్ని తగ్గించుట,సమర్ధవంత మైన నిర్వహణల గురించి వి విధ కార్యక్రమాలకు రూపకల్పనచేసి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించడం హర్షణీయమన్నారు.పర్యావరణ విద్య,అవగాహన పరిశోధన మ రియు నైపుణ్యశిక్షణలను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా వాయుకాలుష్యం–ప్లాస్టిక్ వ్యర్థాలగురించి అవగాహనా కార్యక్రమాన్ని రాయల సీమ యూనివర్సిటీలో నిర్వహించడం సంతోషకరమన్నారు.ఈ సందర్భంగా ...

సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు...

Image
సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె. శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు.వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశ పూరితంగా చంద్రబాబు ప లుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి.ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు.అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి.అసెం బ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని,తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎవరీ శంకరయ్య : 2019,మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె.శంక రయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని,రక్తపు మరకలు కడిగేశార ని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించా రంటూ 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.వివేకా హత్యపై కేసు న...