కంచ గచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరి స్తారా ? లేక జైలుకెళ్తారా?...సుప్రీం కోర్ట్...
VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ : హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.దీనితో ఏప్రిల్,3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు…263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది.సుమోటో కేసుతో పాటే బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపై గత బుధవారం జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మాసి్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘కంచగచ్చి బౌలిలోని వందెకరాలను పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళతారా?’’ అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించింది.చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది.కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే ప్రశ్నకు సూటిగా జవాబివ్వాలని నిలదీసింది. ‘‘మీరు పెద్దఎత్తున చెట్లను కొట్టివేస్తే…ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి.వాటిన...