Posts

పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ  కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్ర క్రియను శనివారం పారదర్శకంగా చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలి పారు.ఈ కౌన్సిలింగ్ కు మొత్తం 839మంది బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యా రు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దే శించిన నిబంధనల మేరకు ర్యాంకింగ్ ప్రకారం పిలిచి పారదర్శకంగా గ్రామ,వార్డు మహి ళా పోలీసుల బదిలీలు చేపట్టామన్నారు.బదిలీలు కోరుకునే ఉద్యోగిని తన స్వగ్రామం/వా ర్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని,ఖాళీల వారీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ ప్లే తెరపై ఉంచామని,అందులో మీకు నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. విజువల్ ఛాలెంజ్ (దృష్టి లోపం,అంధత్వం),మెంటల్లీ డిసెబుల్డ్ (మేధో వైకల్యం),ట్రైబ్స్, దివ్యాంగులు,మె...

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...దాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలి...మచ్చ రామలింగారెడ్డి,APWJU...

Image
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన వారిపై పిడి యాక్ట్ పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక  చొరవ చూపి కఠినచర్యలు తీసుకోవాలి మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ VS9TV న్యూస్,అమరావతి ప్ర తినిధి : మహా న్యూస్ కార్యాలయంపై రా జకీయ పార్టీలు దాడి చేయడం మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి గానే భావిస్తున్నామని ప్రజాస్వా మ్యంలో ఇది మాయని మచ్చ అని దాడుల ద్వారా మీడియాని తమ ఆధీనంలో తీసుకోవాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంక టేశులు,ఆనంతపురం జిల్లా కార్యదర్శి విజయరాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.దాడి చేసిన వారిపై పీడి యాక్ట్ ప్రయోగించాలని,భవిష్యత్తులో ఇటువంటి దాడులు పునరావత్వం కాకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మచ్చా రా మలింగారెడ్డి అన్నారు.తన 30 ఏళ్ల జర్నలిస్టు ఉద్యమంలో అనే...

పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీలు...నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు...

Image
పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీలు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు   VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5 మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్బన్ సచివాలయాల కార్యదర్శుల బదిలీలు పారదర్శకంగా చేపట్టినట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు.శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని కౌన్సిల్ హాల్లో బదిలీలపై కౌన్సిల్ నిర్వహించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మొ త్తం 308 సచివాలయాలు ఉండగా,173 అడ్మినిస్ట్రేటివ్,235 ఎడ్యుకేషన్,248 వెల్ఫేర్, 208 శానిటేషన్ కార్యదర్శులు ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్నారన్నారు.వీరికి ప్రస్తు తం పని చేస్తున్న వార్డు,వారి సొంత వార్డు మినహా ఇతర వార్డులకు బదిలీలు చేయను న్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఆదివారం ప్లానింగ్,అమెనిటీస్ కార్యదర్శుల బదిలీలపై కౌన్సిల్ జరగనుందని వెల్లడించా రు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,ఆర్‌ఓ జునైద్,ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వర్ రెడ్డి,ఆదోని కమి షనర్ ఎం.క్రిష్ణ,నందికొట్కూరు కమిషనర్...

కలుషిత నీటిని అరికట్టాలి..ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి...సిపిఎం...

Image
కలుషిత నీటిని అరికట్టాలి ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి సిపిఎం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు కార్పోరేషన్ పరిధి,43వ వార్డు,ఇందిరాగాంధీ నగర్ లో త్రాగునీటి కులాయిల లో కలుషితమైన శుద్ధిచేయని వండ్రుతో కూడిన నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గు రవుతున్నారని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ టి.రాముడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అనేకసార్లు కొళాయిలలో శుద్ధి చేసిన త్రాగునీటికి బదులు కలుషితమైన ఒండ్రు నీరు తరచూ వస్తున్నా కార్పొరేషన్ అధి కారులు,ప్రజా ప్రతినిధులకుగాని ఏమాత్రం పట్టడం లేదన్నారు. ప్రజలు ఈ నీరు త్రాగి విరోచనాలు,వాంతులు,జ్వరం,జలుబు,తదితర అనారోగ్యాలకు గు రవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నగర పాలక సంస్థ కమిషనర్ ఈ విషయాన్ని సీరి యస్ గా తీసుకొని ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని శుద్ధి చేసిన ఫిల్టర్ చేసిన త్రాగునీటిని కులాయిల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఫిల్టర్ బె డ్ లో పనిచేస్తున్న కార్మికులు గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేద ని,వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రజలకు త్రాగునీరు అ...

గుండెపోటుతో నటి,మోడల్ షెఫాలీ జరీవాలా కన్నుమూత...

Image
గుండెపోటుతో నటి,మోడల్ షెఫాలీ జరీవాలా కన్నుమూత VS9TV న్యూస్,ముంబై : సినీ నటి,మోడల్ షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు.ముంబైలో నిన్న రాత్రి గుండె పోటుకు గురై తుదిశ్వాస విడిచారు.'కాంటాలగా' మ్యూజిక్ వీడియోలతో ఆమె పాపులర్ అయ్యారు.హిందీలో ముజ్సే షాదీ కరోగి కన్నడలో హుడుగురు వంటి సినిమాలతో పాటు సీరియళ్లు,వెబ్ సిరీస్లలో నటించారు.హిందీ బిగ్ బాస్-13లో కంటెస్టెంట్ గా  పాల్గొన్నా రు.ఆమె మృతిపై బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

కన్నీటితో కాలం గడుపుతున్నా...అసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయం...పూట గడవని దీన స్థితిలో నటి పాకీజా...

Image
కన్నీటితో కాలం గడుపుతున్నా అసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయం తమిళనాడులో ఆదరణ కరువు పూట గడవని దీన స్థితిలో నటి పాకీజా VS9TV న్యూస్,గుంటూరు ప్రతినిధి : తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం లేని పేరు కాదు వాసుగి.తనదైన హావభావాలతో,సమయోచి త కామెడీ టైమింగ్‌తో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకు లను ఆకట్టుకున్న ఆమె,నేడు జీవిత పోరాటంలో క న్నీటితో కాలం గడుపుతున్నారు.ముఖ్యంగా 1991 లో వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో 'పాకీజా' అనే పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.కానీ ఆ తరువాత కాలంలో ఆమెకు అవ కాశాలు తగ్గిపోవడం,కుటుంబ పరిస్థితులు కుదుటపడక పోవడంతో నిత్యం పోరాటమే జీవితం అయ్యింది.ప్రస్తుతం పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుం టుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి : చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడి యా ప్రతినిధులు పలకరించారు.ఈ సంద...

T న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య...

Image
T న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య VS9TV న్యూస్,తెలంగాణ : జర్నలిజంలో ఎంతో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న స్వే చ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అ త్యంత బాధాకరం.తెలంగాణా ఉ ద్యమంలో పోరాడిన జర్నలిస్ట్ ఆ మె...పీడిత జనం స్వేచ్ఛ కోసం త న అక్షరాయుధంతో యుద్ధం చే సిన ధీర వనిత...ప్రముఖ ఛానె ల్లో పని చేస్తున్నపుడు ఆ ఛానెల్ ని తెలంగాణలో నిలిపివేస్తే...ఏ కంగా ఢిల్లీ వెళ్లి అప్పటి సీఎం ఇంటిముందు ధర్నా చేసిన గొప్ప జర్నలిస్ట్...కానీ ఒక వ్యక్తి పూర్ణ చంద్రరావు కారణంగా...ఆమె ఆ ఛానెల్ లో మంచి పొజిషన్ ని వదులుకుని బయ టకు రావాల్సి వచ్చింది.తన కెరీర్ ని ఆ వ్యక్తి నాశనం చేసాడని ఎన్నోసార్లు బాధపడింది. ఆ తర్వాత తన కెరీర్ కోసం ఎంతో పోరాటం చేసింది.ప్రస్తుతం టీ న్యూస్ లో ఎంతో మంచి పొజిషన్ కు చేరుకుంది.ఎప్పుడూ చిన్నారి పాప భవిష్యత్తు కోసం ఆలోచించే స్వే చ్ఛ ఇప్పుడు ఆ పాపని తల్లి లేకుండా చేసి ఎందుకు వెళ్ళిపోయిందో అర్ధం కావడం లేదు. జర్నలిజాన్ని ప్రాణంగా భావించే స్వేచ్ఛ ఇక లేదంటే జర్నలిస్ట్ సమాజం నమ్మలేకపోతోం ది. అందరికీ ధైర్యం చెప్పే స్వేచ్చ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం.జర్నలిస్టు,రచయిత స్వే చ్ఛకు ఇదివర...

నవ వధువుపై అత్యాచారయత్నం...

Image
నవ వధువుపై అత్యాచారయత్నం VS9TV న్యూస్,పల్నాడు : ఆంధ్రప్రదేశ్,పల్నాడు జిల్లా,అచ్చంపేట, అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన న వ వధువుపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమో దైంది.అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు.దీంతో నిందుతులు అక్కడినుంచి పారిపోగా ఈ ఘ టనతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.ప్రస్తుతం జిజి హెచ్ లో చికిత్స పొందుతోంది.భర్త,కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసు లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పరారీలోవున్న నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే...శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.డబ్బుల కోసం సొంత తల్లి,దండ్రులే మూడేళ్ల కుమార్తెను విక్రయించారు.ఉపాధి కోసం కేరళకు వెళ్లిన రవీంద్ర నాయక్‌,శ్రీవాణి దంపతులు రూ.10లక్షలకు విక్రయించారు.ఈ విషయం తెలుసుకున్న బంధువులు విషయం అడగడంతో వారు వివాదానికి దిగారు.పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.

ఏపీ విద్యాశాఖ కమిషనర్ పట్ల హైకోర్టు ఆగ్రహం...

Image
ఏపీ విద్యాశాఖ కమిషనర్ పట్ల హైకోర్టు ఆగ్రహం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పి టిషన్ పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసులో భాగంగా కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పెళ్లొద్దని చెప్పండి...ప్రాణాలెందుకు తీస్తున్నా రు?

Image
పెళ్లొద్దని చెప్పండి...ప్రాణాలెందుకు తీస్తున్నారు? VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : పెళ్లంటేనే కుర్రాళ్లు వణికిపోతున్నారు.ఇటీవల భర్తలను చంపిన భార్యలే ఇందుకు కార ణం.కాబోయే వాడిని, కట్టుకున్న వాడిని,కన్నవాళ్లను కూడా కడ తేరుస్తున్నారు. పెద్దల బలవంతమో,పుట్టింటి పరువు కోసమో...కారణం ఏదైనా లేని ఇష్టాన్ని నటిస్తూ పె ళ్లి చేసుకుంటున్నారు.నెల తిరగకుండానే భర్త ప్రాణాలు తీస్తున్నారు. హత్య చేసే ధైర్యం ఉ న్నప్పుడు...ఇష్టం లేదని చెప్పలేరా? పెళ్లొద్దని చెప్పండి...ప్రాణాలు తీయకండి ప్లీజ్ !

రీల్స్ పిచ్చి...13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి...

Image
రీల్స్ పిచ్చి...13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి VS9TV న్యూస్,బెంగళూరు : ప్రస్తుతం సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది.ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుం న్నారు.తాజాగా ఓ యువతి రీల్స్ చేసేందుకు వెళ్లి...బిల్డింగ్ పైనుం చి పడి మృతి చెందిన ఘటన క ర్ణాటకలో జరిగింది.వివరాలు ఇ లా ఉన్నాయి...బెంగళూరులోని అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కొందరు పార్టీ చేసుకుంటున్నారు.పార్టీ మ ధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్ పైకి వెళ్లింది.అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి 13వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియ ని వ్యక్తి మృతి.... ఎస్.మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...

Image
గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి ఎస్.మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళు రోడ్డులో గుత్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ముగింపు వద్ద,రామచంద్ర నగర్ లోని వెల్కమ్ సూపర్ మార్కెట్ ప్రాం తంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీ కొన్నట్లు ట్రాఫిక్ సిఐ ఎస్.మన్సూరుద్దిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరాలు...ప్రమాదానికి గురైన వ్యక్తి తలకు బల మైన రక్తగాయాలు కలిగి రోడ్డుపై పడి ఉన్నాడు.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీ సులు గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ జనర ల్ హాస్పిటల్ కు తరలించిన్నట్లు చెప్పారు.చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మార్చురీ రూముకు తరలించినట్లు సిఐ తెలిపారు. మృతుడి ఆనవాళ్లు : గుర్తుతెలియని మగ వ్యక్తి వయసు : సుమారుగా (40) సం..లు, ఎత్తు : సుమారుగా 5.03 అడుగులు వెంట్రుకలు : సుమారుగా 02 ఇంచులు నలుపు, వర్ణము : చామన చాయ దుస్తులు : నలుపు మరియు తెలుపు చారల షర్టు,నల్లటి జీన్స్ ప్యాంటు, ...

బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలో అధికారుల నిర్లక్ష్యం తగదు...

Image
బీఎస్ఎఫ్ జవాన్ భూమి విషయంలో అధికారుల నిర్లక్ష్యం తగదు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : దేశ భద్రత కోసం ప్రాణాలను పనంగా పెట్టి సేవలు అందిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్‌ షేక్ ఖలీ ల్ భూమి విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.వివ రాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా, నందవరం మండలం,నాగలదిన్నె గ్రామానికి చెంది న షేక్ ఖలీల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేస్తున్నారు.నందవరం మండలం గురజా ల గ్రామ సరిహద్దుల్లో ఆయనకు సొంతంగా 2.00 ఎకరాల భూమి ఉంది.అయితే వైఎ స్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో చేపట్టిన జగనన్న రీ-సర్వే సమయంలో అధికారులు కేవ లం 1.32 ఎకరాలు మాత్రమే చూపించారు. సచివాలయ ధ్రువపత్రం  వాస్తవాలను పూర్తిగా నమోదు చేయాలని,మళ్లీ సర్వే చేసి న్యాయం చేయాలని ఖలీల్‌ ఇ ప్పటికే పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులను,జిల్లా కలెక్టర్‌ను కలసి విన్నవించారు. కానీ ఇప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‘‘దేశానికి సేవ చేస్తున్న నాకు ఇంత నిర్లక్ష్యం అయితే... సామాన్య రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనడా నికి ఇది నిదర్శనం’’ అని ఖలీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.పాలకులు,అధికారులు స్పందిం చ...

సంప్రదాయిని శుద్ధ పూసనీ...పెళ్లి కూతురు మద్యం సేవిస్తూ...మరో చేతిలో సిగరెట్‌...

Image
సంప్రదాయిని శుద్ధ పూసనీ... మద్యం సేవిస్తూ... మరో చేతిలో సిగరెట్‌ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : పెళ్లి రోజు అనగానే అందరికీ కడుపులో సీతాకోక చిలుకలు పరుగెత్తిన ఫీలింగ్ వస్తుంది. అంత టెన్షన్ ఉంటుంది.కానీ ఓ పెళ్లికూతురు మాత్రం వివాహానికి కొద్దిసేపటి ముందు మందు,సిగరెట్‌తో చిందేసింది.స్నేహితులతో కలిసి పార్టీ మూడ్‌లో కనిపించిన ఆమె వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక చేతిలో గ్లాస్‌...మరొక చేతిలో సిగరెట్‌ తో దర్శనమిచ్చిన ఈ పెళ్లికూతురిని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు విమర్శలు కూడా చేస్తున్నారు.సమాజంలో మహిళలు ప్రయాణం ఎటువైపు అని నిలదీస్తున్నారు.ఇలాంటి వ్యవహారాలతో సభ్యసమాజానికి వీరు ఏ సమాచారం ఇస్తున్నారు.ఇలాంటి వారిని చూ స్తుంటే అందితే జుట్టు...అందకపోతే కాళ్ళు అనే సామెత దేశ ప్రజలు గుర్తుచేసుకోవాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి.ఇప్పటికే దేశంలో మహిళలపై జరుగుతున్న దాడు లు,అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.వీటిని కట్టడి చేయాలనీ తాము పోరాటాలు సాగి స్తూ ఉంటే,మరోవైపు ప్రస్తుతం మహిళల వ్యవహారాలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆ రోపిస్తున్నారు. ప్రేమ పేరుతో కొందరు.డబ్బుల కో సం కొందరు సోషల...

అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహ త్య...శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

Image
అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య శేషయ్య,మూడవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,మూడవ పట్టణ పరిధిలో శుక్రవారం అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జరిగినట్లు సిఐ శేషయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు వెల్లడించారు.కర్నూలు నగరం,లక్ష్మి నగర్ కు చెందిన కర్రే మహే శ్వరయ్య (59)అనే వృద్ధుడు గతంలో కర్నూలు నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఓపన్ హార్ట్ సర్జరీ జరిగిందని అన్నారు.అప్పటి నుండి ఫిర్యాది భర్తకు ఆరోగ్యం క్షీనిస్తూ వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుండి ఫిర్యాది భర్తకు అస్తమా వ్యాధితో,గ్యాస్టిక్ సమస్య,తీవ్ర క డుపు నొప్పితో బాధ పడుతూ ఉండేవాడు.అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం వాళ్ళ ఇబ్బంది పడుతూ తట్టుకోలేక గత గురువారం రాత్రి సమయంలో మిద్దెపైకి వెళ్లి రిట్రో అనే పేరు కల పురుగుల మందు తాగాడు.దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ల గా,చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు.భార్య కర్రె సర స్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు సిఐ తెలిపారు.

సుప్రీంకు చేరిన కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్...

Image
సుప్రీంకు చేరిన కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ VS9TV న్యూస్,తిరుపతి : తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తమ ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రెండు రోజుల కిందట సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు సిట్ నియమించిన తర్వాత పూర్తి స్థా యిలో దర్యాప్తు చేసి పాత్రధారులను గుర్తించారు.అరెస్టు చేశారు.వారుసరఫరా చేసింది అసలు నెయ్యే కాదని,కెమికల్స్ తో తయారు చేసిన పామాయిల్ లాంటి పదార్థమని గు ర్తించారు.నిందితుల రిమాండ్ రిపోర్టులో కొన్ని విషయాలను పొందు పరిచారు.అసలు చాలా విషయాలను సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో వెల్లడించి ఉంటారని భావిస్తున్నా రు.సూత్రధారులు తెర వెనుక ఉండి పాత్రధారులతో ఆడిస్తున్న నాటకాలు,కోర్టుల్లో వేస్తు న్న పిటిషన్ల అంశంపైనా సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించే అవకాశా లు ఉన్నాయి.ఇటీవల తనకు ఓ పోలీసు అధికారి నోటీసులు జారీ చేశారని,ఆయన సిట్ లో భాగం కాదని వైవీ సుబ్బారెడ్డి కోర్టుకెళ్లారు.కోర్టు కూడా వైవీ సుబ్...

కల్తీ డీజిల్ తో నిలిచిన మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్...

Image
కల్తీ డీజిల్ తో నిలిచిన మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్ VS9TV న్యూస్,మధ్యప్రదేశ్ : అధికారిక కార్యక్రమం కోసం భోపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణం ప్రాతంభించాడు.మార్గమద్యంలో ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ పోయించారు.అయితే డీజిల్ లో నీరు కలవడంతో సీఎం కాన్వాయ్ లోని 19కార్లు మ ధ్యలోనే నిలిచిపోయాయి. వెంటనే కార్లను రోడ్డు పక్కకు తోసి వేరే కార్లను రప్పించి సీఎం మోహన్ యాదవ్ ను వే దిక వద్దకు అధికారులు పంపారు.డీజిల్ లో నీళ్లు కలవడం వల్లే కార్లు ఆగిపోయాయని గుర్తించిన అధికారులు పెట్రోల్ బంక్ ను మూసివేసి అధికారులు విచారణ చేపట్టారు.

33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు కాలువలు నిర్మించాలి...సీపీఐ...

Image
33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు  కాలువలు నిర్మించాలి... సీపీఐ VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగునీరు పోవడానికి కొత్త కాలువలు నిర్మించాలని,కొన్ని కాలువలను సరిచేయాలని,ఇక్కడి ప్రజల ఆరోగ్యాలు కార్మికుల ఆరో గ్యాలు కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శి దంభో ళంశ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కార్పొ రేషన్ పరిధిలో చెన్నమ్మ సర్కిల్ నుండి ముజఫర్ నగర్ పోవడానికి దారిలో భారత్ పెట్రో ల్ బంక్ పక్కన ఎస్టేట్ పోవు మార్గంలో కాలువలు లేక మురుగునీరు రోడ్డు మీదకు వచ్చి కుంటల మారింది ఇక్కడ దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు.ఈ మార్గంలో నడవడం నేను కూడా దాడి సరిగ్గా లేదు.ఒకవైపు మురికి కుంట,మరోవైపు మురుగు నీరు నిలిచిం దని,ఇక్కడ కార్మికులు వ్యాపారస్తులు ఇంకా వివిధ రకాలుగా అక్కడ జీవనం సాగించే వారు ఆ మార్గం గుండా పోవటం,రావటం జరుగుతుందని చెప్పారు.ఆ సందర్భంలో టూ వీలర్ మీద పోయేవాళ్లు కిందపడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయ ని,మరి కొన్ని సందర్భాల్లో ఆ కుంటలో పశువులు ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా ఉ న్నాయన...

రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరు... పట్టణ పౌర సంక్షేమ సంఘం...

Image
రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరు ప్రధాన మురుగుకాలువలు శుభ్రం చేయించాం ప్రకటించిన మున్సిపల్ కమిషనర్  మురుగు,చెత్తతో నిండిన పొర్లి  పొంగుతున్న మురికి కాలువలు ఏడాది క్రితం దాదాపు కోటితో  నిర్మించిన మురిగుకాలువలు  ఎవరికోసం? ఏమయ్యాయి? రోడ్డుకు ఒకవైపు నిండిన కాలువలు, మరోవైపు ఎండిన కాలువలు అడ్రస్ లేని ఆరోగ్యశాఖ అధికారులు పట్టణ పౌర సంక్షేమ సంఘం VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో 15 కాలనీలకు వెళ్లే 60అడుగుల ప్రధాన రోడ్డుపై మురిగునీరు ప్రవహి స్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడి గంటలు గడుస్తున్న ప్రజారోగ్య శాఖ అధి కారులు సానిటరీ ఇన్  స్పెక్టర్లు ఏం చేస్తున్నారని పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎ. ఆంజనేయులు గౌడ్,మహమ్మద్ యూనుస్,ఇరిగినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.ఇళ్ళ ముం దు మురికి నీరు ప్రవహిస్తున్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని అశోక నగర్,శ్రీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఉదయం పిపిఎస్ ఎస్ ప్రతినిధి బృందం ఆ ప్రాం తంలో పర్యటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల కు పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కన...

నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలి... మహిళలపై జరిగే నేరాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలి...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
నేర నియంత్రణ,ప్రజలకు  ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలి అత్యాధునిక సాంకేతికతను  వినియోగించాలి నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలి   జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో  గస్తీని పటిష్ట చేయాలి మహిళలపై జరిగే నేరాల  నివారణకు గట్టి చర్యలు చేపట్టాలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : శాంతిభద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ,ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా ప ని చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాల యంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు,సిఐలు,ఎస్సైలతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.పోలీసు అధికారులతో చ ర్చించారు.కర్నూలు,పత్తికొండ,ఆదోని,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలో ఉన్న పెండింగ్‌ కే సుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు,సూచనలు చేశారు.ఈ సంధ ర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి గట్టి గా పని చేయాలన్నారు.పెండింగ్ కేసుల సం...

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి... నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు...

Image
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా ఉపయోగించు కుంటూ,అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నేషనల్ క్లీన్ ఎయి ర్ ప్రోగ్రామ్ (యన్‌క్యాప్) పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,జాప్యం చేయకుండా సకాలం లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. శుక్రవా రం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. యన్‌క్యాప్ కార్యక్రమం ద్వారా సుంకేసుల రోడ్డు,మద్దూర్ నగర్,బి.క్యాంపు పోస్ట్ ఆఫీస్ నుండి సి. క్యాంపు టిటిడి కళ్యాణ మండపం వరకు, బి.క్యాంపు విజ్ఞన్ మందిర్ ప్రాంతాల్లో రహ దారి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలపై రహదారుల నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలిం చారు.గాయత్రీ ఎస్టేట్ కూడలి కుదింపు,కిమ్స్ ఆస్పత్రి రహదారిలో విభాగినిల్లో మొక్కలు నాటుట,సుద్దవాగు పూడికతీత పనులు పూర్తి చేయవల్సిన పనులను కమిషనర్ పరిశీలిం చి...

ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలి... తల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి...

Image
ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయాలి తల్లితండ్రులు డిఈఓ కార్యాలయం ముట్టడి VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరంలోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలు ఆర్ టీఈ యాక్ట్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని,అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కో రుతూ కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంను విద్యార్థుల తల్లితండ్రులు శుక్ర వారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆర్ టీఈ నాయకులు చామకూరు వీరప్ప మాట్లాడుతూ కల్లూరు ప్రాంతంలోని ఆదిత్య, శాంతినికేతన్,నగరంలోని సిస్టర్ స్టా న్ సిల్స్,సెయింట్ జోసఫ్,ఇతర పాఠశాలలు,కళాశాలు అమలుచేయడంలో పూర్తిగా నిర్ల క్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం 2025 -26సంవత్సరానికిగాను ప్రభుత్వం నోటి ఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేట్ పాఠశాలల్లో లాటరీ సిస్టం ద్వా రా ప్రవేశాలు పొందిన విద్యార్థులను కొన్ని విద్యాసంస్థలు ప్రవేశాలను తీసుకోవడం లేద న్నారు.అందుకుగాను విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున డిఈఓ కార్యాలయంను ముట్ట డించడం జరిగిందని ఆయన తెలిపారు.అనంతరం డిఈఓ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ జరిగింది.కావున తప్పనిసరిగా ...

కల్లూరు మండలంలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాం... కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...

Image
1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాం కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్ VS9TV న్యూస్,కల్లూరు : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా నిర్మాణ ప్రక్రియలో పారదర్శక తను పాటించేందుకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టరు,ఓటర్ల నమోదు అధికారి,138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ ల హేతుబద్ధీకరణ చేయుట కొరకు కల్లూరు మండలం తహసిల్దార్,మండలంలోని అన్ని పోలింగ్ బూత్ ల ను శుక్రవారం సందర్శించి,వాటిలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గు ర్తించిన్నట్లు కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా తహసీ ల్దార్ కె.ఆంజ నేయులు మాట్లాడుతూ గుర్తించిన వాటిలో 47పోలింగ్ బూత్ ల ఓటర్లను పక్క పోలింగ్ బూత్ లోకి సర్దుబాటు చేయుటకు,13పోలింగ్ బూత్ లను కొత్తగా ఏర్పా టు చేయుట కొరకు గుర్తించామని తెలిపారు.

కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం...ఎస్ఎఫ్ఐ...

Image
కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో  విద్యాశాఖ అధికారులు వైఫల్యం... ఎస్ఎఫ్ఐ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వం నిబంధన తుంగలో తొక్కి పుస్తకాల వ్యాపారం,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగ ర అధ్యక్షులు అబూబకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల విచ్చలవిడిగా ప్రభు త్వాన్ని ఉద్దేశించిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.పాఠశాల లోనే పుస్తకాల మాఫియాను చేస్తున్నారన్నారు.కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం వ్యక్తం చేసిన విద్యాశాఖ అధికారులకు పలుమార్లు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల సెల్లార్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాఠశాలను నడుపుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టిం చుకోకుండా ఉల్లంఘించిన కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చే...

ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలి... ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...

Image
ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ భవనాలపై వర్షపునీరు నిలవకుండా స్పెషల్ డ్రైవ్ ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కా ర్పోరేషన్ : నగర ప్రజలు తమ ఇళ్ళు,భవనాల పైకప్పులను శుభ్రంగా ఉంచుకో వాలని,పైకప్పుల్లో వర్షపునీరు ని లవకుండా సజావుగా కిందికి సా గేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బా బు సూచించారు.గురువారం ఆ యన సచివాలయ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు.పై కప్పుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఆ నీరు లోపలికి వెళ్ళి ఐరన్ పాడై పెచ్చులు ఊడు తాయని,స్లాబ్ పటిష్టత దెబ్బ తింటుదన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని మున్సిపల్, సచివాలయ,పాఠశాల,కమ్యూనిటీ భవనాలపై శుభ్రం చేసేందుకు వారం రోజులపాటు ప్ర త్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.సంబంధిత సిబ్బంది పైకప్పులను శుభ్రం చేసి, నీ రు సజావుగా,ఆటంకం లేకుండా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశిం చారు.ప్రజలు సైతం తమ ఇంటి,భవనాల పైకప్పులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు.‌అదేవిధంగా ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పాత టైర్లు,కుండలు,ప్లాస్టిక్ బాటిల్ త దితర వాటిల్లో మురుగునీరు ల...

హైదరాబాద్‌లో విస్తుపోయే దందా...శృంగార వీడియోలను అమ్ముకున్న దంపతులు...

Image
హైదరాబాద్‌లో విస్తుపోయే దందా శృంగార వీడియోలను అమ్ముకున్న దంపతులు ఇంటి టెర్రస్ పైనే షూట్...సెక్స్ యాప్లలో అప్లోడ్ అరగంట వీడియోకు రెండు వేలు వసూల్  వెలుగులోకి వచ్చిన అంబర్ పేట ఘటన VS9TV న్యూస్,హైదరాబాద్ : డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా తయారైంది నేటి సమాజం.కష్టపడకుండా...కాసు లొస్తున్నాయంటే ఎంతకైనా తెగించేస్తున్నారు.అచ్చం అలాంటి హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే...అంబర్పేట్ పరిధిలోని మల్లికార్జుననగర్ లో ఏపీకి చెందిన ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు.అయితే ఆన్లైన్లో అశ్లీల వీడియోలు అప్లోడ్,లైవ్ చాటింగ్ చేస్తే లక్షల్లో సంపాదించొ చ్చని ఆలోచించారు.అనుకుందే తడువుగా...8 హై రెజల్యూషన్ కెమెరాలతోపాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఏకంగా తమ సొంత ఇంటి టెర్రస్ పైనే పరదాలు కట్టి పెద్ద సెటప్ వేశారు.నిత్యం కెమెరా ఎదుట శృంగారంలో పాల్గొని అనంతరం ఆ ఫుటేజీని సెక్స్ యాప్ లో అప్లోడ్ చేసేవారు.10నిమిషాల నుంచి అరగంట వరకు వీడియోలను చూడాలంటే రూ.500 నుంచి రెండు వేల వరకు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.అలా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగ...

ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘం ఆర్ పి ఎస్.షబీరాభానును కొనసాగించాలి... సిపిఎం...

Image
ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘం ఆర్ పిగా ఎస్.షబీరాభానును కొనసాగించాలి...సిపిఎం డిమాండ్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఆర్.పిగా పనిచేస్తున్న ఎస్.షబీరాభానును కొనసాగించాలని సిపిఎం నగర కార్యదర్శి టి. రాముడు సిఐటియు నగర కార్యదర్శి సి.హెచ్.సాయిబాబా,ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప, ఆర్.పిల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి నగర అధ్యక్షులు పి.రుద్రమ్మ,రమా ఐక్య సంఘం అధ్యక్ష,కార్యదర్శులు ఎస్. శారదమ్మ,కె.సువార్తలు మెప్మా ఐబి మురళిని కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిహెచ్ సాయిబాబా,టి.రాముడు మాట్లాడుతూ రమా ఐక్య సంఘంలో పొదుపు సంఘాల సభ్యులు కట్టిన డబ్బులను తన సొంతానికి వాడుకోవడం వల్ల పాత ఆర్పీని తొలగించి తీర్మానం చేయడం జరిగిందని అ న్నారు.2023,జనవరిలో రమా ఐక్య సంఘం కొత్త ఆర్పీగా ఎస్ షబీరాబానును నియ మిస్తూ ఐక్య సంఘం తీర్మానం చేయడం జరిగిందని,అప్పటి నుండి గత రెండున్నర సం వత్సరాలుగా ఎటువంటి జీతం లేకుండా ఆర్పీగా పనిచేస్తుందని తెలిపారు.ఐక్య సంఘం తీర్మాణం ప్రకారం ఆర్ పిగా ఆన్ లైన్ లో ఎక్కించమని ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం ఎం సీఈఓ, ...

కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరు...

Image
కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం  నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరు సుధారాణి, కర్నూలు ఇంచార్జి, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,బస్ స్టేషన్ కు ఒక్కొక్క కుర్చీలో ముగ్గురు కూర్చునే వీలున్న,25 కుర్చీలు (3-సీటర్) కేంద్ర కార్యాలయం ద్వారా మంజూరైనర్లు కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫి క్ మేనేజర్ సుధారాణి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధారాణి,కర్నూలు బస్టాండులోని సినియర్ సిటిజెన్ లు, కర్నూలు జిల్లా సి.బెళగల్ వాస్తవ్యులు, టీచర్ అనుమన్న,కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త సుబ్బా రావు చేతుల మీదుగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వి భాగం ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు జిల్లా వారు బస్టాండులో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు-2 డిపో మేనేజర్ శర్మ,కర్నూ లు-1 అసిస్టెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం,బస్ స్టేషన్ మేనేజర్ కాంచన,ఇతర ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు...రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై...

Image
కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు రూ.10వేలు లంచం తీసుకుంటూ   ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై VS9TV న్యూస్,కల్వకుర్తి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో రూ.10వేలు లంచం తీసుకుంటూ రెం డవ ఎస్సై రాంచందర్ ఏసీబీకి చిక్కాడు.వివరాలు ఇలా ఉన్నాయి.జీ,గుండూరు గ్రామాని కి చెందిన వెంకటయ్యకు సంబంధించిన భూ వివాదం కేసు రాజీ కోసం రూ.20 వేలు డి మాండ్ చేసిన ఎస్సై రూ.10వేలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధి కారులు పట్టుకున్నారు.ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏ సీబీ అధికారులు సూచించారు.

ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా...

Image
ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా VS9TV న్యూస్,గుంటూరు క్రైం : ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది.డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణా లకు పాల్పడింది.మూడు హత్యలు చేసి...ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురికి పోలీసు లు కటకటాల వెనక్కి నెట్టారు...సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధిం చారు.వివరాలు ఇలా ఉన్నాయి...తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది.ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమా రికి చెప్పారు.అయితే కుసుమ కుమారికి సుభాషిణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది.మే, 25వ తేదీన తనకు తెలిసిన ఆటో డ్రైవర్ గోపిక్రిష్ణను సుభాషిణి ఇంటికి రమ్మని కుసుమ కుమారి చెప్పింది.గోపిక్రిష్ణ గోడ దూకి సుభాషిణి ఇంటిలోకి వెళ్లాడు. అ ప్పటికే అక్కడే ఉన్న కుసుమకుమారి గోపిక్రిష్ణ సాయంతో సుభాషిణిని గొంతు నులిమి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.కొద్దీసేపటి తర్వాత సుభాషిణి కుమార్తె ఫోన్ చేయగా ఆమె తీయలేదు.దీంతో అనుమానం వచ్చిన కు మార్తె...కుసుమ కుమారికి...

కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం...డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...

Image
కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య  రహిత జిల్లాగా తీర్చిద్దుదాం డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పుర స్కరించుకొని గురువారం డ్రగ్స్ వద్దు బ్రో...భవిష్యత్ ముద్దు బ్రో కార్యక్రమంను కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్,జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిల ఆధ్వ ర్యంలో నగరంలోని రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.అనంత రం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.సమావేశానికి కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి,నగర మేయర్ బి.వై.రామయ్య,ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి హాజరయ్యా రు. ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ము...

పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లైన్స్ రద్దు...ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి...

Image
పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్  బదిలీల గైడ్ లైన్స్ రద్దు ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : అసిస్టెంట్(జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) బదిలీలపై ఇచ్చిన ఏపీ ఈపీడీసీఎల్ యాజమా న్యం ఇచ్చిన గైడ్ లైన్స్ తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు,అన్ని జిల్లాల విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూ నియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం వెంటనే స్పం దించి ఏపీ ఈపీడీసీఎల్ యాజమాన్యం ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) గైడ్ లైన్స్ రద్దు చేయడం జరిగిందని కర్నూలు జిల్లా,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కర్నూలు జిల్లా రీజినల్ అధ్య క్షులు ఎం.డి.అంజిబాబు,ఏపీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ ఉపాధ్యక్షులు పి.నాగరాజు హ ర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వారు గురువారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 7529 మంది ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) ని యమించడం జరిగిందని,మీరందరూ గ్రామ సచివా...

మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలి...రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపు...

Image
మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలి రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సులర్  ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపు VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని రాయలసీమ విశ్వవిద్యాల య వైస్‌ ఛాన్సులర్ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.వర్సిటీ వి.సి.కాన్ఫరె న్సు హాలులో గురువారం జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్య క్రమానికి అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆచార్య వి.వెంకట బసవరావు మాట్లా డుతూ మత్తుపదార్ధాల కారణంగా యువత నిర్వీర్యమౌతోందని ఆందోళన వ్యక్తం చేశా రు.రకరకాల ఆకర్షణలకులోనై బంగారంలాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యు వతకు ఆయన హితవు పలికారు.రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్సుకు స్థా నంలేకుండా చూసుకోవలసిన బాధ్యత వర్సిటీ వర్గాలపై ఉందని అన్నారు.మాదక ద్రవ్యా ల వినియోగాన్ని అరికట్టడంతోపాటు తెలిసో,తెలియకో వాటికి బానిసలుగా మారినవారి కి సరైన చికిత్స అందించడం,సాధారణ స్థితికి చేరుకొనేలా చేయాలన్నారు.నషాముక్త్ భారత్ పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపు నిచ్చాయని తెలియజేశారు.మాదక ద్ర...