మా ఇంట్లో ఏసీ ఉండదు...రూ.50 వేల కోట్లు...అరట్టై శ్రీధర్ వేంబు...
మా ఇంట్లో ఏసీ ఉండదు...సంపద రూ.50 వేల కోట్లు అరట్టై శ్రీధర్ వేంబు VS9TV న్యూస్,హైదరాబాద్ : గూగుల్,మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్...నిత్యం ఈ టెక్ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్ వేంబు.తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి...‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అం టున్నారు.ఆయన సంపద కూడా ఆ స్థాయిలోనే ఉంది...రూ.50వేల కోట్లు మరి! ఈ వి జయాలన్నింటినీ తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటూనే సాధిస్తున్నా రాయన.మన దేశంలో సరికొత్త ఐటీ విప్లవానికి నాంది పలికిన శ్రీధర్ వేంబుతో చేసిన అ రట్టై(పిచ్చా పాటి)లోని కొన్ని విశేషాలు... పల్లెలంటే ప్రాణం : మా నాన్నావాళ్లది తంజావూరులోని ఒళిగచ్చేరి అనే కుగ్రామం.కావేరి ఉపనది కొల్లిడం ప్ర వహించే పల్లెకాబట్టి...పచ్చదనంతో నిండి ఉండేది.నాకు ఎప్పుడు సెలవులొచ్చినా ఈ ఊరి కి వచ్చేసేవాణ్ణి.సెలవులు అయిపోయాక తిరిగి వెనక్కి వెళ్ళనని మొండికేసేవాణ్ణి.ఏడ్చి గీపె డుతున్న నన్ను బలవంతంగా తీసుకొచ్చి బస్సెక్కించేవారు.ఆ ఊరి గుర్తుగా ఏ రాయో ర ప్పో తెచ్చుకుని...దాచుకునేవాణ్ణి.ఆ ఊరిపైన నాకున్న మమకారమే జోహో కంపెనీని గ్రా మీణ ప్రాంతాలకి తెచ్చేలా చేసింది. మూడున్నరవేల రూపాయలతో : మా నా...