Posts

ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్...

Image
ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్ VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి,31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు.కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎ స్ కాత్యా యనీ దేవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు ఆర్థిక శా ఖ ముఖ్య కార్య దర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు స్మిత స బర్వాల్ తన ఎక్స్ ఖాతాలో ట్విట్ షేర్ చేశారు.కొన్ని రోజులుగా చాలా నొప్పితో కూడి న అనారోగ్యంతో బాధపడు తున్నానని,ఆమె చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే స్మితా సబ ర్వాల్ ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు.ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం లీవ్‌ను మంజూరు చేసింది.గత ప్రభుత్వంలో సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా పని చేసిన స్మితా సబ ర్వాల్...కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్యపాత్ర పోషించారు.కాళేశ్వ రం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్మితా సబర్వాల్‌ పై కూడా చ ర్యలకు సిఫార్సు చేసింది.కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో ఆ మె సెలవు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ తేదీన బస్సు రూట్ మార్పు... మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...

Image
వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ  తేదీన బస్సు రూట్ మార్పు మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ తేదీన బ స్సు రూట్ మార్పులు చేస్తున్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ శుక్రవారం ఒక ప్రక టనలో పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు,కర్నూలు డిఎస్పి బా బు ప్రసాద్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం చేసినట్లు చె ప్పారు.ఈ నెల 31వ తేదీ నుండి డోన్,అనంతపురం,బెంగుళూరు వైపు నుండి వచ్చు ఆర్ టిసి బస్సులు గుత్తి పెట్రోల్ బంకు,చెన్నమ్మ సర్కిల్,బళ్లారి చౌరస్తా మీదుగా ఆర్ టిసి బ స్టాండ్ కు చేరుకుంటాయి.అదేవిదంగా డోన్,అనంతపురం,బెంగుళూరు వెళ్ళు బస్సులు క ల్లూరు మీదుగా చెన్నమ్మ సర్కిల్,గుత్తి పెట్రోల్ బంక్ మీదుగా వెళతాయని సూచించారు. కావున కర్నూలు పట్టణ ప్రజలు ఈ విషయం గుర్తించాలని అన్నారు.ఈ నేపథ్యంలో తమ ప్రయాణాలు కొనసాగించాలి.దూర ప్రాంతాల్లో ఉన్న తమకు సంబంధించిన వారికి,బం ధువులకు కర్నూలు పట్టణంలో ఆర్ టిసి బస్సుల మళ్లింపు సమాచారంను తెలియజేసి వా రి...

పర్యావరణహితం కోసం పాత్రికేయల కృషి వెలకట్టలేనిది...డీఆర్ ఓ వెంకట నారాయణ మ్మ...

Image
పర్యావరణహితం కోసం పాత్రికేయల కృషి వెలకట్టలేనిది డీఆర్ ఓ వెంకట నారాయణమ్మ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : పర్యావరణహితం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని కర్నూలు డీఆర్ ఓ వెంకట నారాయణమ్మ అన్నా రు.శుక్రవారం కర్నూలు కలెక్టరేట్  పాత్రికేయ గణపతి ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని ఆమె సందర్శించి ప్ర త్యేక పూజలు చేశారు.కర్నూలు నగర వ్యాప్తంగా ఈ ఏడాది యువత అధిక సంఖ్యలో మ ట్టి వినాయకులను ప్రతిష్ఠిం చడం శుభపరిణామం అన్నారు. మధ్యాహ్నం సమాచార శాఖ కార్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ బృందం కందనవోలు శ్రీనివాసులు,విద్యాసాగర్,మంజునాధ్ యాదవ్,శ్రీ నాథ్ రెడ్డి,అవినాష్ శెట్టి, రామకృష్ణ,మల్లికార్జున,విజయ్ కుమార్,పరమేష్,అసిఫ్,గంగా ధర్,మధు,రాఘవేంద్ర,చెన్నయ్య,రమేష్,సురేష్,భక్తులు పాల్గొన్నారు.

ఇదే స్పూర్తితో 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి... విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...

Image
జిల్లాలో మూడవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు ఇదే స్పూర్తిని 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,757 విగ్రహాలు (ఆయా సబ్ డివిజన్ లలో కర్నూలు 612,ఆదోని 143,ఎమ్మిగనూరు 832,పత్తికొండ 1170) నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు.నిమజ్జనం ప్రాంతాలకు చిన్నపిల్లలు,వృద్దులను దూరంగా ఉంచే విధంగా గణేష్ ఉత్సవ నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక మండపాలలలో,వినాయక విగ్రహాలు తరలించే సమయంలో వర్షం కురిస్తే విద్యుత్తు తీగల దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.నిమజ్జనం ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని నిర్వాహకులకు సూచించారు.ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే...

వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ కేసు నమోదు...

Image
వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ కేసు నమోదు VS9TV న్యూస్,వరంగల్ : అనిశా అధికారులు అతనికి,అతని బంధువులకు సంబంధం గల 7 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి 1- భవనం (1.15 కోట్లు),17.10 ఎకరాల (1,43 కోట్లు) వ్యవసాయ భూ మి,ఆభరణాలు (బంగారం - 70తులాలు & వెండి 1.791 కిలోలు),చేతి గడియారాలు - 23,వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు - 2 & ద్విచక్ర వాహనం - 1) మరియు గృహోపకరణాలు వంటి స్థిర మరియు చరాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు.గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5,02,25,198.కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.

వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిన భార్య...

Image
వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిన భార్య VS9TV న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్–సరూర్ నగర్ పీఎస్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య,ప్రి యుడు కలిసి భర్తను హత్య చేసిన దారుణం చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నా యి...కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో జెల్లెల శేఖర్(40),చిట్టి(33)లు నివాసం ఉంటు న్నారు.గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో చిట్టి వివాహేతర సంబంధం కొనసాగి స్తోంది.ఈ నేపథ్యంలో రాత్రి భర్త పడుకోగానే,ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి శేఖర్ ను హత్య చేశారు.ఉదయం ఏమి తెలియనట్లు నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయినట్లు చిట్టి 100కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది.అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా,తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు చిట్టి ఒప్పుకుంది.చిట్టిని అ రెస్ట్ చేసిన పోలీసులు..పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేప ట్టారు.

జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడతాం...సిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు హామీ...

Image
జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ  ఉపసంఘంలో పెడతాం సిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు హామీ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : జర్నలిస్టుల బహుళ అంతస్థుల  హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడ తామని సిఆర్డీఎ  కమిషనర్ కన్నబాబు తెలిపారు.అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సిఆర్డీఎ కమిషనర్ ను ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు.ఈ సం దర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వం బహుళ అంతస్తుల హౌసింగ్ ప్రాజెక్ట్ నిమి త్తం  మందడంలో  కేటాయించిన  30ఎకరాలు  భూమి వివరాలు సర్వే నెంబర్లతో కూడిన మంజూరు పత్రాలను కమిషనర్ కి అందచేయడం జరిగింది.ఈ సందర్బంగా గత తెలుగు దేశం ప్రభుత్వంలో 2014-19 మ‌ధ్య కాలంలో జ‌ర్న‌లిస్ట్ ల‌కు అమ‌రావతిలో ప్ర‌తిపాదిం చిన హౌసింగ్ ప్రాజెక్ట్ ను తిరిగి అమలు చేయాలని కోరుతూ జర్నలిస్టులు వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ అమ‌రావ‌తిలో జ‌ర్న‌లిస్టుల కోసం గ‌త టీడీ పీ ప్ర‌భుత్వంలో భూమి కేటాయించగా తదుపరి ప్ర‌భుత్వం మార‌డంతో ప్రాజెక్ట్ అమలు ని లిచిపోయింద‌ని జ‌ర్న‌లిస్ట్ లు వివ‌రించారు.తిరిగి ప్రాజెక్ట్ ను కొన‌సాగించి,ప్ర‌భుత్వ‌మే ...

మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యానికి పాల్పడి,కొట్టిన వ్యక్తికి మహిళల బాదుడు..

Image
మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యానికి పాల్పడి  కొట్టిన వ్యక్తికి మహిళల బాదుడు పోలీసులు కేసు నమోదు VS9TV న్యూస్,మందమర్రి : మందమర్రి పట్టణం ఫస్ట్ జోన్ కు చెందిన 55 సంవత్సరాలు కలిగిన మహిళపై అఘాయి త్యానికి పాల్పడి,కొట్టిన వ్యక్తికి స్థానిక మహిళలు చెట్టుకు కట్టేసి,తగిన గుణపాఠం చెప్ప డంతోపాటు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉ న్నాయి...మహిళ ఇంటి ముందు గంధం శ్రీకాంత్ (31) అనే యువకుడు నివాసం ఉన్నా డు.అయితే తాను ఇంట్లో చేసిన పప్పు ఉడికిందా? లేదా ? చూడటానికి బాధితురాలిని తన ఇంట్లోకి పిలిపించుకున్నాడు.ఆమె లోపలికి వచ్చిన వెంటనే తలుపులు మూసి,ఆమె ను చేతులతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ,వెయ్యి రూపాయలు ఇస్తాను.నేను చెప్పినట్లు వి ను.లేకుంటే నేను చంపేస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డాడు.ఈ నేపథ్యంలో మహిళ భ యంతో గట్టిగా అరవడంతో,దగ్గర్లో ఉన్న బాధితురాలి కోడలు వచ్చి నిందితుని ఒక ఇంటి డోర్ కొట్టడంతో,నిందితుడు వెనుక గోడ దూకి పారిపోతుండగా స్తనికులు పట్టుకుని చె ట్టుకు కట్టి చెప్పులతో గుణపాఠం చెప్పారు. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్...

నా చావుకు కారణం ఆ ముగ్గురే...సూసైడ్ నోట్ లో విస్తుపోయే నిజాలు...మైనర్ బాలిక ఆత్మహత్య...

Image
నా చావుకు కారణం ఆ ముగ్గురే సూసైడ్ నోట్ లో విస్తుపోయే నిజాలు మైనర్ బాలిక ఆత్మహత్య VS9TV న్యూస్,రాజన్న సిరిసిల్ల : మైనర్ బాలికను ముగ్గురు మానవ మృగాలు కత్తులతో బెదిరించి,లైంగిక దాడి చేసి,వీడి యోలు చిత్రీకరించి వేధించిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...రాజన్న సిరి సిల్ల జిల్లా,ఇల్లంతకుంట మండలం,రంగంపేట గ్రామంలో తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.తమ కూతురు రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో,ఆమె ఫోనులో ఉన్న వీడియోలు,ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు.ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన ము గ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ,లైంగిక దాడి చేసి,వీడియోలు చిత్రీకరిం చారని బాలిక తండ్రి ఆరోపించారు.ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతా మని రెండు సంవత్సరాలుగా బాలికను నిందితులు చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి మైనర్ బాలిక మరణించింది.ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు.

విద్యుత్తు ఉద్యమ అమరవీరుల సాక్షిగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం...వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ...

Image
విద్యుత్తు ఉద్యమ అమరవీరుల సాక్షిగా మరో  విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సాక్షిగా చంద్రబాబు తీసుకున్న స్మార్ట్ మీటర్లకు,విద్యుత్ వా రాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వామపక్ష పార్టీలు నాయ కులు,కార్యకర్తలు,ప్రతిజ్ఞ పూనారు.గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల వర్ధంతి సందర్భంగా సిపి ఎం పార్టీ నగర కార్యదర్శి ఎం. రాజశేఖర్,సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్ష తన ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య,సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప రిపాలనలో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన సందర్భంగా దాదాపు ఆరు నెలలపాటు విద్యుత్ పోరాటం జరిగిందని,ఆ పోరాటం ఉదృతం కావడానికి కర్నూలు జిల్లా అనే నాంది పలికిందని 2000 సంవత్సరం జూలై,28వ తేదీ ఎగ్జిబిషన్ గ్...

పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయం...రెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలు,అన్నదానం... బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు...

Image
పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయం రెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలు బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : పాత్రికేయులు వృత్తి నిర్వహణలో ఉన్నప్పటికీ మట్టి గణపతిని నెలకొల్పి ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయమని బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు అన్నారు.గురువారం కలెక్టరేట్ సమాచార భవన ఆవరణలో పాత్రికేయ గణపతి ఉత్సవ క మిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపయ్యను ఆయన సందర్శించి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు.అనంతరం ఆనంద్ బాబు సహకారంతో సుమారు 350మందికి అ న్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వ హణలో బిజీగా ఉన్న కర్నూలు పాత్రికేయులు గణనాధుని కొలవుదీర్చి పూజ కార్యక్రమా లు నిర్వహించడం సంతోషకరం అన్నారు.ప్లాస్టర్ పారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయం గా మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పర్యావరణహితాన్ని చాటడంపై అభినందనలు తెలిపా రు. ప్రతిరోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం వ్య క్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మంజునాథ్ యాదవ్,కందనో లు శీను,రామకృష్ణ, స...

బ్రాహ్మణపల్లి కానుగుల రాజారావుకు న్యాయం చేయాలి...తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి...విజయ్ కుమార్,ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి...

Image
బ్రాహ్మణపల్లి కానుగుల రాజారావుకు న్యాయం చేయాలి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి విజయ్ కుమార్,ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ &  యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారా వుకు న్యాయం చేయాలనీ ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ అధికారులను కోరారు.గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రై ట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఇంచా ర్జి విజయ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు విజయ్ కుమా ర్,ఉపాధ్యక్షులు పరమేష్ లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యా యం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామంలోని 177/సి సర్వే నెంబర్లు లో ఐదు ఎకరాల భూమిని కానుగుల సత్యరాజు కుటుంబ సభ్యులు రెండు తరాలుగా సా గు చేసుకుంటూ జీవనం సాగిస్తు...

దోపిడి ముఠా అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ..

Image
దోపిడి ముఠా అరెస్ట్ విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో భాగంగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు తెలియచేశారు. కర్నూలు నగరం,ముజాఫర్ నగర్ కు చెందిన గోర్లగట్ట నాగేంద్రుడు,బుధావర్ పేట,ప్రస్తుతం TV9 కాలనీకి చెందిన కురువ రమేష్,కర్నూలు మండలం, దిన్నేదేవరపాడు గ్రామానికి చెందిన దూదేకుల మాలిక్ బాషలు కర్నూలు బెంగళూర్ జాతీయ రహదారి  44,జగన్నాత గట్టుపై వెళ్లే ప్రేమికుల దగ్గరకు వెళ్లి వారి ఫోటోలు,వీడియోలు తీసి,వారిని బ్లాకు మెయిల్ చేస్తూ వారి నుండి డబ్బు,విలవయిన వస్తువులు తీసుకొని,ఇవ్వని వారిపై మరణాయుధాలతో చంపుతామని బెదిరించి వారి నుండి,డబ్బు,బంగారు లేదా విలువయిన వస్తువులను బలవంతంగా తీసుకొంటూ దోపిడీకి పాల్పడేవారు.అదేవిదంగా ఈనెల 19వ తేదీన పిర్యాదురాలు తనకు తెలిసిన అబ్బాయితో రాయలసీమ యూనివర్సిటీకు ఆటోలో వెళుతుండగా, అమ్మాయి,అబ్బాయిలు వెళుతున్న ఆటో ను అనుసరిస్తూ హ్యాంగౌట్ హోటల్ దాటినా తర్వాత ఆ ఆటోను ఆపి అమ్మాయి,అబ్బాయి ఫోటోతీసి,మీ తల్లిదండ్రులకు పంపుతామ...

చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్...డి.శ్రీహరి రాజు,ఎస్ డిపిఓ పెద్దాపురం సబ్ డివిజన్...

Image
చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్ డి.శ్రీహరి రాజు,ఎస్ డిపిఓ పెద్దాపురం సబ్ డివిజన్ VS9TV న్యూస్,ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం,ధర్మవరం గ్రామం, జగనన్న కాలనీలో ఈ నెల 21వ తేదిన  గాలి త లుపులయ్య ఇంట్లో జరిగిన చోరీ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం సబ్ డివిజన్ ఎస్ డిపిఓ డి.శ్రీహరి రాజు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ఎస్ డిపిఓ డి.శ్రీ హరి రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.గాలి తలుపులయ్య పిర్యాదు మేరకు,కా కినాడ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు చోరీ కేసును న మోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని అన్నారు.కేసు దర్యాప్తు ఆధికారి బి.సూర్య అ ప్పారావు, ప్రత్తిపాడు  సిఐ,ప్రత్యేక బృందాలు కలిసి ముద్దాయిలు కోసం విచారణ జరుపు తుండగా,సదరు నేరంలో ముద్దాయిలు గురించి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్తిపాడు గ్రామశివారులోని పాదలమ్మ గుడి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు,రాజమండ్రి అర్బ న్,భవానిపురం,క్వారీపేట సెంటర్ కు చెందిన కొవ్వూరి సునీల్,రాజమండ్రి రూరల్ మండ లం,తొర్రేడు గ్రామానికి చెందిన మోర్త దీవెన రాజులు అనుమానాస్పదంగా తిరుగుతుం డగా,అనుమానంపై ఇరువురిని అదుపులోనిక...

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

Image
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు.ప్రజలకు ఎక్కడ ఇ బ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పురాతన ఇళ్లలో ఉంటున్న వా రిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూ చించారు.తెలంగాణ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైం ది.ఇళ్లలోకి వరద నీరు చేరింది పంటలకు తీవ్ర నష్టం కలిగింది.మరోవైపు భారీ వర్షాలు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,నిర్మల్,సిరిసిల్ల,జిల్లాలను గురువారం పరి శీలించారు.కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయ ని,ఈ నేపథ్యంలో కామారెడ్డి,మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది...

గణేశుడిపై గుడ్లతో దాడి...పోలీసుల వినూత్న శిక్ష...

Image
గణేశుడిపై గుడ్లతో దాడి...పోలీసుల వినూత్న శిక్ష VS9TV న్యూస్,గుజరాత్ : గుజరాత్ లోని వడోదరలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తుండగా దానిపై గుడ్లు విసిరిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని వినూత్న పద్దతిలో శిక్షించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వడోదర పోలీసు కమిషనర్ నరసింహ కొ మార్ ఆదేశాల మేరకు..పోలీసులు నిందితులను చేతులు కట్టి,ఊరేగింపుగా సంఘటన జ రిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.గణపతిపై గుడ్లు విసిరిన చోట నిందితులను మోకాళ్లపై కూ ర్చోబెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు.

ఈడీ సోదాలు...గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే...

Image
ఈడీ సోదాలు...గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే VS9TV న్యూస్,హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాల కుంభకోణం పెను సంచల నం సృష్టిస్తుంది.ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా వందల కో ట్లు చేతులు మారాయని ఆరోపణలు రావడంతో అధికార టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈడీ అధికారులు తనిఖీలు చేయడాని కి వచ్చారని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే తన ఇంటి గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నిం చారు.అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మెల్యే వెంటపడి పట్టుకున్నారు.

CPM ఆఫీసుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చు...

Image
CPM ఆఫీసుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవచ్చు VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగ స్పందించారు.కులాంతర వివాహాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్నారు.ప్రే మికుల కోసం మార్క్సిస్టు కార్యాలయాలు తెరచి ఉంటాయని తెలిపారు.కులాంతర వివా హాలు చేసుకోవాలనుకు ప్రేమికులు ఇకపై రాష్ట్రంలోని తమ పార్టీ కార్యాలయాల్లో చేసు కోవచ్చని పేర్కొన్నారు.తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం కార్యాలయా ప్రేమ పెళ్లిళ్లు చే సుకోవచ్చని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

పాఠశాలలో సైన్స్ టీచర్ స్పెషల్ డ్రెస్...

Image
పాఠశాలలో సైన్స్ టీచర్ స్పెషల్ డ్రెస్ VS9TV న్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ కాస్త భిన్నంగా తయరయ్యారు.సాధారణ దుస్తుల స్థానంలో ప్రత్యే కంగా రూపొందిం చిన వేషధారణలో విద్యార్థుల ముందు నిలిచారు.చొక్కాపై,ప్యాంట్పై మానవ శరీర అవయవాల చిత్రాలు ప్రదర్శిం చారు.మానవ శరీర అవయవాలు ఎక్కడ ఉంటాయి.వాటి పనితీరు ఎలా ఉంటుంది.ఒక్కో అవయవం మరో అవయవంపై ఎలా ఆ ధారపడి పని చేస్తుందో ఆయన కళ్లకు కట్టినట్టు చూపిస్తూ వివరించారు.

భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య...

Image
భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య VS9TV న్యూస్,పశ్చిమ గోదావరి : పశ్చిమగోదావరి జిల్లా,పెనుగొండ మండలంలో భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్ లైట్తో కొట్టి చంపిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...మృ తుడు వెంకటనారాయణకు మొదటి భార్య చనిపోవడంతో అనంతలక్ష్మిని రెండో పెళ్లి చే సుకున్నాడు.వెంకటనారాయణ వారం రోజుల క్రితం గల్ఫ్ దేశం నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఏ పనికి వెళ్ళడం లేదని భార్య అనంతలక్ష్మికి కోపం పెరిగింది.ఆగ్ర హంతో టార్చ్ లైట్తో భర్త తల వెనుక తీవ్రంగా కొట్టింది.తీవ్ర గాయాలపాలైన వెంకటనారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు.

భర్త నపుంసకుడని రూ.90 లక్షల భరణం కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు...

Image
భర్త నపుంసకుడని రూ.90 లక్షల భరణం   కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను  కొట్టేసిన తెలంగాణ హైకోర్టు VS9TV న్యూస్,హైదరాబాద్ :  తన భర్త నపుంసకుడు అని విడాకులతో పాటు రూ.90 లక్షల భరణం ఇప్పించాలని ఓ మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.2013లో తమ వివాహం జరిగినా,ఇప్ప టి వరకు తమ శోభనం కాలేదని ఆమె ఆరోపించింది.తన భార్య చెప్పేవన్నీ అబద్దాలేన ని,ఆమెను చాలా సార్లు లైంగికంగా కలిశానని భర్త కోర్టుకు తెలిపాడు.ఇరువురి వాదన లు విన్న కోర్టు,మహిళ అప్పీల్ ను తోసిపుచ్చింది.సరైన ఆధారాలు లేని కారణంగా విడా కులు ఇప్పించలేమని పేర్కొంది.

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన 56ఏళ్ల మహిళ...

Image
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన 56ఏళ్ల మహిళ VS9TV న్యూస్,కర్ణాటక : కర్ణాటక,చిక్కమగళూరుకు చెందిన సుబ్రమణ్య (60) కనిపించడంలేదంటూ అతడి భార్య మీనాక్షమ్మ,కూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ ప్రారంభించిన పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ రైల్వే ట్రాక్ పై మృతదేహన్ని గుర్తించారు.కాని పో లీస్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.33ఏళ్ల ప్రియుడు ప్రదీప్,మృతు డి భార్య మీనాక్షమ్మతో ఉన్న వివాహాతర సంబంధం వల్లనే హత్య చేసినట్టు వెల్లడించా రు.మీనాక్షమ్మ ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయ్యాయి.మనవళ్లు,మనవరాళ్లు సైతం ఉ న్నారు.

యువతి కిడ్నాప్...ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్...

Image
యువతి కిడ్నాప్...ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ఒడిశాలో కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా ఆరు నెలల పాటు గ్యాంగ్ రేప్ పాల్పడటం కలకలం రేపింది.ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.బాలాసోర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని అక్కడి స్థానిక వ్యక్తి ఈ ఏడాది మార్చిలో కిడ్నాప్ చేసి,గత ఆరు నెల లుగా సామూహిక అత్యాచారం చేస్తూనే ఉన్నారు.

పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు...

Image
పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,స్థానిక పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ గోడల ఆంజనేయ స్వామి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.ఈ వేడుకల్లో భాగంగా కమిటీ సభ్యులు శేఖర్ రెడ్డి,రాము,నాగేంద్రుడు,నాగ రాజు,అన్వర్ భాష,మౌలాలి,షేక్షావలిలతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు.భక్తులు ఉదయం వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.భక్తుల కు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.కార్యక్రమం విజయవంతం కావడానికి కమిటీ సభ్యు లు,కాలనీ వాసులు విశేష కృషి చేశారు.ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలు కాలనీలో ఆధ్యాత్మిక వా తావరణాన్ని నింపాయి.

కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్...రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు...హైకోర్టు సంచలన ఆదేశాలు...

Image
కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్ రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు హైకోర్టు సంచలన ఆదేశాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నేడు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఉత్సవాల కో సం ఊరూవాడా ముస్తాబయ్యాయి.అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ని బంధనలు విధించింది.సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది.ఇం కా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు.పిటిషనర్ల అభ్యంతరా లను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది.అయినా పట్టించు కో పోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధ ర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయం లో ప్రజల నుంచి వచ్చే వినతులు,ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని పోలీ సులను,అధికారులను ఆదేశించింది. హైకోర్టు నిబంధనలు : 1. పొల్యూషన్ యాక్ట్ లోని నిబంధనల మేరకు సాయంత్రం 6-00 గంటలు నుండి రాత్రి 10-00 గంటల వరకు మాత్రమే సౌండ్‌ సిస్టమ్‌ను అనుమతించాలి. 2. సౌండ్ ను నిబంధనల ప్రకారం నిర్దేశించిన డె...

సొంత ఇంట్లోనే ప్రమాదం పెరుగుతోంది...మీరు ప్రేమలో పడ్డారా...??...మీ తల్లి,తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటు న్నారా...??...

Image
సొంత ఇంట్లోనే ప్రమాదం పెరుగుతోంది మీరు ప్రేమలో పడ్డారా...?? మీ తల్లి,తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా...?? లవ్ అనే ఆకర్షణలో పడి కొట్టుమిట్టాడుతున్నారా..?? జీవితం కన్నా నాకు లవరే ముద్దు అనుకుంటున్నారా...? అయితే మీ బ్రతుకు మధ్యంతర ఎన్నికల టైపే..! VS9TV న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి : కన్నతల్లి తండ్రులు,గ్రామం,సమాజం,మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని చిదరించుకుం టారు ఇది మీకు కావాలా...!?తల్లి తండ్రులు బంధువులు చూసిన సంబంధంనే ఒప్పుకు ని పెళ్లి చేసుకొని జీవితాంతం హాయిగా,చక్కగా భార్యా పిల్లలు తల్లితండ్రులతో సుఖంగా ఉండాలని కోరుకోండి.మీ చుట్టూ సమాజాన్ని ఒక్కసారి చూడండి,లవ్ ఫెయిల్ వల్ల కొం పలు కూలిపోవడం,మన చుట్టూ జరుగుతున్న జీవిత సమాజంలో ప్రదర్శించబడుతుం ది.దీంతో బంధువులు రక్తసంబంధాలు మానవత్వాలు అన్న తమ్ముళ్లు,అక్కచెల్లెళ్లు,బావ మరదలు ఈ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి మీ ప్రేమ లవ్ వల్లనే అని గ్రహించం డి.ప్రేయసి ప్రియుడి మధ్య మొదలయ్యే "లవ్ స్టోరీస్" మన సమాజంలో కొత్తేమీ కావు. కానీ ఇప్పుడు ఇవి తాత్కాలిక ఎన్నికల్లా మారిపోయాయి.మధ్యంతర ఎన్నికలప్పుడు ప్రజ లు ఉత్సాహంగా,హడావు...

నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు...పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5కిలోల గంజాయి పట్టివేత...

Image
నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5 కిలోల గంజాయి పట్టివేత   ఆరుగురు గంజాయి ముఠాసభ్యులు అరెస్ట్ 2మోటార్ బైకులు,4సెల్ ఫోన్లు స్వాధీనం 14మంది యువతకు కౌన్సిలింగ్ VS9TV న్యూస్,నాయుడుపేట : తిరుపతి జిల్లా,నాయుడుపేటలో పట్టణ సిఐ బాబి పర్యవేక్షణలో విద్యార్థులు యువతే ల క్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి గు ట్టు రట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల స మావేశంలో పాల్గొన్న నాయుడుపేట డిఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివ రాలను వెల్లడించారు.నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత లక్ష్యంగా ఎంచుకొ ని గంజాయ విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2.50 లక్షలు విలువ గల 11.30కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు,రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తె లియజేశారు.గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14మంది విద్యార్థులతో పాటు కొం త మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు.

సైబర్ బారిన పడిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయం సీనియర్ అసిస్టెంట్... రూ.9.60లక్షలు దోపిడీ చేసిన కేటుగాళ్ళు...

Image
సైబర్ బారిన పడిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయం సీనియర్ అసిస్టెంట్ రూ.9.60లక్షలు దోపిడీ చేసిన కేటుగాళ్ళు  VS9TV న్యూస్,మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా,కురవి,శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా వి దులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి జగన్నాధం సైబర్ బారిన పడ్డాడు.దీంతో రూ.9.6 0లక్షలు మోసపోయారు.ఈ నేపథ్యంలో అతని నాలుగు క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు కాజేశారని గమనించిన బాదితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా కురవి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కే కన్,మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్యల సూచనల మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని,అ యినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఎవరైనా సైబర్ నేరస్తుల బారిన పడినట్లయితే వెంటనే గోల్డెన్ హవర్ ని వినియోగించు కుని 1930నెంబర్ కి డయల్ చేసినట్లయితే వారి సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉం టుందని తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు కురవి ఎస్ఐ సతీష్ తెలిపారు.

భార్యకు తిండి పెట్టకుండా...విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త...

Image
భార్యకు తిండి పెట్టకుండా...విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త VS9TV న్యూస్,కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో భర్త,భార్యకు తిండి పెట్టకుండా విగతజీవిలా మార్చి హతమార్చిన ఘ టన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...ఖమ్మం జిల్లా,కల్లూరు మండలం,విశ్వన్నాథ పు రం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు,ఖాన్‌ఖాన్‌ పేట గ్రామానికి చెం దిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా,మూడేళ్ల నుండి అశ్వారావు పేట లో దంపతులు నివాసం ఉంటున్న ఉంటున్నారు.అయితే లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కింద పడిపోయిందని,ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు.ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి,దీనస్థితిలో ఉన్న లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూ సి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.శరీరమంతా కొత్త గాయాలు,పాత గాయాల ఆన వాళ్లు చూసి లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని,అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీప్రసన్నను హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కామంతో కళ్లుమూసుకుపోయి..మైనర్‌ పై అఘాయిత్యం...పోక్సో కోర్టు సంచలన తీర్పు...51ఏళ్ళు జైలు శిక్ష...

Image
కామంతో కళ్లుమూసుకుపోయి..మైనర్‌ పై అఘాయిత్యం పోక్సో కోర్టు సంచలన తీర్పు 51ఏళ్ళు జైలు శిక్ష VS9TV న్యూస్,నల్గొండ క్రైం : మానవత్వం మరిచిన కామాంధులు ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక దాడులకు పా ల్పడుతున్నారు.మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి,హత్య చేసిన కేసులో నింది తుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం మైనర్ బాలికపై అ త్యాచారానికి పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ఖయ్యూంకు 51ఏళ్ళు జైలుశిక్ష విధిం చింది కోర్టు...వివరాలు ఇలా ఉన్నాయి...నల్లగొండ జిల్లా,తిప్పర్తి మోడల్ స్కూల్లో ఓ మై నర్ బాలిక పదవ తరగతి చదువుతోంది.తిప్పర్తికి చెందిన మమ్మద్ ఖయ్యూం...ప్రేమ పే రుతో బాలికను వేధింపులకు గురి చేశాడు.2021,నవంబర్,3వ తేదీన బస్ స్టాప్ వద్ద ఉ న్న మైనర్ అమ్మాయిని షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పాడు బడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో 2021,డిసెంబర్,5వ తేదీన వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఖయ్యూంపై నమోదు చేశా రు.2022 నుండి పోక్సో కోర్టులో వాదనలు కొనసాగాయి.ఈ కేసులో ప్రాసిక్యూషన్ తర పున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్...

మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు అవకాశం ఇవ్వాలి...ఆప్టా...

Image
మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు  అవకాశం ఇవ్వాలి... ఆప్టా VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు అవకాశం ఇవ్వాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎజిఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా కి ప్రకాష్ రావు లు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్ సి ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట ని చ్చింది.మెగా డిఎస్ సి యందు అనేక రకాల హోదాలు కల ఉద్యోగాలు ఉన్నందున దరఖా స్తు సమయంలో ఆప్షన్ అడగటం జరిగిందన్నారు.అందుకు అనుగుణంగా అభ్యర్ధులు ఆ ప్షన్ లు ఇవ్వడం జరిగింది.కొంత మంది అవగాహన లోపం వలన మరియు పోస్ట్ ల సంఖ్య చూసి మొదట ఆప్షన్ సెకండరీ గ్రేడ్ టీచర్ కు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం వారి లో కొంతమందికి స్కూల్ అసిస్టెంట్,ప్రిన్సిపల్ పోస్ట్ లకు ఉత్తీర్ణత సాధించిన మొదటి ఆ ప్షన్ కు కట్టుబడి ఉండడం వలన వారు నష్ట పోతున్నారని అన్నారు.కాబట్టి ఇప్పుడు మె గా డిఎస్ సి యందు ఉత్తీర్ణులు అయిన వారికి మరోసారి డిఎస్ సి యందు ఉద్యోగాల ఎంపికకు అవకాశం ఇవ్వాలని ఎపి ప్రైమరీ టీచర్స్ అ...

నగరపాలక సంస్థలో వినాయక చవితి వేడుకలు...

Image
నగరపాలక సంస్థలో వినాయక చవితి వేడుకలు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : వినాయక చవితి సందర్భంగా కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో వినా యకుని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు.మేయర్ బి.వై.రామయ్య,కమిషనర్ పి.విశ్వనాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ నగ ర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించి శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు.అందరూ భక్తి శ్రద్ధలతో గణనాథుని ఆశీర్వాదా లు పొందాలని కోరుకున్నారు.మండపం వద్ద వినాయక నామస్మరణతో మార్మోగింది.పూ జల అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,కార్పొరేటర్ విక్రంసింహా రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్,ఎంఈ మనోహర్ రెడ్డి,సూపరింటెండెం ట్ రామక్రిష్ణ,తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాలు తొలగాలి...అందరూ అభివృద్ధి చెందాలి...ఘనంగా కర్నూలు పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ పూజలు ప్రారంభం...

Image
విజ్ఞాలు తొలగాలి...అందరూ అభివృద్ధి చెందాలి ఘనంగా కర్నూలు పాత్రికేయ  గణేష్ ఉత్సవ కమిటీ పూజలు ప్రారంభం మహబూబ్ బాషా,ఆంధ్రఅక్షర అధినేత మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణం కాపాడుకుందాం పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : సమాజంలో విజ్ఞాలు తొలగాలి... అందరూ అభివృద్ధి చెందాలని ఆంధ్రఅక్షర అధినేత మ హబూబ్ బాషా వ్యక్తం చేశారు.బుధవారం వినాయక చవితి పురస్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం,సమాచార శాఖ భవన్ వద్ద పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాధుని పూజలు ఘనంగా నిర్వహించారు.మొదటి రోజు పూజలు జర్న లిస్ట్ లు నీలం సత్యనారాయణ,విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పూజలు జరిపారు.కా ర్యక్రమానికి విగ్రహ ప్రధాత, ఆంధ్రఅక్షర అధినేత మహబూబ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్బంగా మహబూబ్ బాషా మాట్లాడారు.ముందుగా కర్నూలు జిల్లా ప్రజలకు వినా యక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు.పాత్రికేయులు సైతం వినాయక చవితి పం డుగను జరుపుకోవడం శుభపరిణామం అన్నారు.పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ బృం దం మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలనుండి పాత్రికేయులు,దాతల సహకారంతో సంయుక్తంగా వినాయక చవితి ఉత్సవ...

మెదక్‌లో వరదల బీభత్సం...నీట మునిగిన పౌల్ట్రీ ఫాం...10 వేల కోళ్లు మృతి...

Image
మెదక్‌లో వరదల బీభత్సం...నీట మునిగిన పౌల్ట్రీ ఫాం 10 వేల కోళ్లు మృతి VS9TV న్యూస్,మెదక్ ప్రతినిధి : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.అకస్మా త్తుగా పోటెత్తిన వరదలకు వేలాది మూగజీవాలు బలవుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా, నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాద సంఘటన రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫాంను వరద నీరు పూర్తిగా ముంచెత్తడంతో సుమారు 10వేల కోళ్లు ప్రాణాలు విడిచాయి.వివరాల్లోకి వెళితే...నంది గామలో ఓ రైతు నిర్వహిస్తున్న కోళ్ల ఫాంలోకి ఈరోజు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తిం ది.చూస్తుండగానే ఫాం మొత్తం నీటితో నిండిపోవడంతో లోపల ఉన్న కోళ్లు బయటకు రాలేక ఊపిరాడక మృత్యువాత పడ్డాయి.ఈ ఘటనలో తనకు దాదాపు రూ.14 లక్షల ఆ స్తి నష్టం వాటిల్లిందని ఫాం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.ఊహించని విధంగా వర ద రావడంతో కోళ్లను కాపాడుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని ఆయ న కన్నీటిపర్యంతం అయ్యారు. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఫాం కళ్ల ముందే నా శనమైందని,ప్రభుత్వం తమను ఆదుకుని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ఒక్క ఘటనే కా...

యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కు సహకరించాలి...చంద్రయ్య,ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్...

Image
యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కు సహకరించాలి చంద్రయ్య,ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని యూనియ న్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కి సహకరించాలని ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ చంద్రయ్య తెలి పారు.సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సభ్యత కార్యక్రమం ప్రారంభించా రు.మొదటి సభ్యత్వం అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్త తీసుకున్నారు.అనంత రం ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ చంద్రయ్య సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రెస్ క్లబ్ కార్యాలయాలు ఉన్నాయని కానీ కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడం లోటుగా ఉండిందని అని తెలిపారు.సీనియర్ జ ర్నలిస్ట్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ప్రతి యూనియన్ సభ్యులు ప్రతి మీడి యా పాత్రికేయులు ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరమని,ప్రోత్సాహం సహకారం ఉండాలని ఆయన తెలిపారు.ప్రజా సంఘాలు,మధ్యతరగతి,సామాన్యులు ఎ దుర్కొనే అనేక సమస్యలకు పరిష్కార వే...