Posts

ఎస్ టియు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరంలోని స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవనంలో మంగళవారం ఎస్ టి యు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి అధ్యక్షతన ముస్లిం ఉపాధ్యాయులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ రాష్ట్ర పూర్వపు అధ్యక్ష,ప్రధాన కార్యదర్షులు ఈ.షణ్ముర్తి,హెచ్.తిమ్మన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సంఘంలో కూడా లేని విధంగా అన్ని కులాలు మతాల సంస్కృతులను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఎస్టియు కర్నూలు జిల్లా శాఖ క్రిస్మస్ క్యాండిలైట్,సంక్రాంతి ముగ్గుల పోటీలు,ఇఫ్తార్ విందు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రమదాన్ నే రంజాన్ అన్నారు.సమస్త మానవాళికి మార్గ నిర్దేశంగా పవిత్ర ఖురాన్ గ్రంధం రంజాన్ మాసంలోనే అవతరించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెల రోజులు విధిగా ఉపవాసాలు, దానధర్మాలు చేస్తారన్నారు.పండగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయన్నారు.పండగ అనేది ఏ మతానికి సంబంధించి...

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి... గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...

Image
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.మంగళవారం కర్నూలు నగరంలోని డివిఆర్ మాన్సస్ లో మలబార్ గోల్డ్ సంస్థ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమం నిర్వహించారు.స్టోర్ హెడ్ ఫయాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మలబార్ సంస్థ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయం అన్నారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న 209మంది విద్యార్ధినులకు రూ.18,64,000 స్కాలర్ షిప్ మొత్తంను చెక్కు ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.వి.ఇ.ఓ.వై.పరమేశ్వర రెడ్డి,వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్,మలబార్ గోల్డ్ సంస్థ వారి సిబ్బంది ఫయాజ్,నురుల్లా, విద్యార్ధినిలు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ గురైన రుషికేష్ అనే విద్యార్ధికి గుడ్ షెప్పర్డ్ స్కూల్ తల్లిదండ్రులు చేయూత...

Image
VS9TV న్యూస్,కర్నూలు జిల్లాపరిషత్ ' కర్నూలు నగరం,స్థానిక గుడ్ షెప్పర్డ్ ఇంగ్లీష్ స్కూల్,గౌతమి నగర్,కర్నూలు నందు పదవ తరగతి చదువుతున్న రుషికేష్ అనే విద్యార్థికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో సృహ కోల్పోవడం జరిగింది.విద్యార్థి ప్రస్తుతం స్థానిక మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పోందుతున్నాడు.పిల్లవాడి చికిత్స కొరకు చాలా ఖర్చు అవుతుందుని విద్యార్థి తల్లిదండ్రులు తెలియజేశారు.ఈ విషయం తెలిసి గుడ్ షెప్పర్డ్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు,తల్లిదండ్రులు దాదాపుగా రూ.2,10,000లు గుడ్ షెప్పర్డ్ స్కూల్ కరస్పాండెంట్ జి.ఏసుదాస్,తమ విద్యార్థి రుషికేష్ తల్లిదండ్రులకు అందజేశారు. సహాయం అందజేసిన స్కూల్ తల్లిదండ్రులకు ఉపాద్యాయ బృందానికి స్కూల్ కరస్పాండెంట్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కర్నూలు జిల్లా మహిళా మార్ట్ వ్యవహారంపై రెండు నెలలు సమయం కోరిన ఎం.డి ఎన్.తేజ్ భరత్...

Image
ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సమస్యలపై సానుకూల స్పందన... కె.ధనలక్ష్మి,ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఈ నెల 24న,విజయవాడ,అలంకార్ ధర్నా చౌక్ లో మెప్మా ఆర్ పిల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో మెప్మా ఎండి ఎన్ తేజ్ భరత్ ఆ సంఘం నాయకులతో చర్చలు జరిపారు.చర్చల సారాంశంను ఏపి మెప్మా ఆర్ పి యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు. చర్చల సారాంశం : 1. బకాయి వేతనాలు చెల్లిస్తామన్నారు. 2. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.  3. ఆగిన లాగిన్స్ ని పునరుద్ధరిస్తామన్నారు. 4. యూనిఫామ్ ఇస్తామన్నారు. 5. సెల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ ఇస్తామన్నారు. 6. ఎస్ ఎల్ ఎఫ్ ల నుండి రీఛార్జి చేయిస్తామన్నారు.ఐడి కార్డులు ఇస్తామన్నారు.  7. ఆర్ పిలతో మున్సిపల్ టాక్స్ వసూలు చేయించడం,ప్లాస్టిక్ కవర్లను గ్లాసులని కలెక్ట్ చేయించే పని మురుగు కాలువల క్లీనింగ్ చేసే పని ఆర్ పిలది కాదని,అలా పనిచేయిస్తున్న తెనాలి మున్సిపల్ కమిష...

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం...దేవనకొండ పోలీసుల ఫ్లాగ్ మార్చ్...

Image
VS9TV న్యూస్,పత్తికొండ : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో, దేవనకొండ సిఐ వంశీనాథ్ ఆధ్వర్యంలో దేవనకొండ పోలీసులు పి.కోటకొండ గ్రామంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా దేవనకొండ మండలం, పి.కోటకొండ గ్రామంలో బుధవారం మారెమ్మ దేవర జరుగుతున్న సంధర్బంగా పోలీసుల ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు దేవనకొండ సిఐ వంశీనాథ్ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు,ప్రజల భద్రతే ముఖ్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు,ప్రజలకు నిత్యం అందుబాటులో పోలీసులు ఉంటారని, భరోసా కల్పించడానికి,ఎవరైనా శాంతి భధ్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో దేవనకొండ సిఐతో పాటు 80మంది పోలీసులు పాల్గొన్నారు

శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష...

Image
VS9TV న్యూస్,అమరావతి క్రైం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి,రాష్ట్ర సచివాలయంలో శాంతి భద్రతలపై అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాల కలెక్టర్లు,జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు.ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నుండి కలెక్టర్ పి.రంజిత్ భాషా,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.

సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం...

Image
సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం... VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : బీసీ మహిళ,సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి అరుదైన గౌరవం దక్కింది.జె.చంద్రకళ బాయి సేవలు గుర్తించిన జర్మనీ,అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్శిటీ ఆమెకు డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం చేసింది.ఈ మేరకు అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్శిటీ, జర్మనీ" ఆధ్వర్యంలో పుదుచ్చేరి (పాండిచ్చేరి)లో జరిగిన సెమినార్ సందర్భంగా "గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్" ను ఆమెకు ప్రదానం చేసి సత్కరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.బీసీ మహిళగా గత 25 సంవత్సరాలుగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తూ,మహిళలు,అభాగ్యులకు అండగా నిలిచి,ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారికి సహాయం చేస్తూ సమాజ సేవను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.సమాజ సేవలో నిబద్ధతతో వివిధ ప్రజా సంఘాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాను అని అన్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం,బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తూ సమాజంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు చెప్పారు.ఈ ప్రయ...

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల...

Image
VS9TV న్యూస్,హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి,యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు శ్యామలను విచారించారు.ఇదిలాఉంటే...తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో శ్యామల పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.విచారణకు సహకరించా లని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం...రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే...మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి...సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు...

Image
మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని,ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది.ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు.అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు, హెచ్ పరీక్షలు జరిపారు.తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస...

ప్రజాసేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి...కట్టెల రామాంజనేయులు,కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు...

Image
ప్రజాసేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి కట్టెల రామాంజనేయులు,కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు VS8TV న్యూస్,కర్నూలు క్రైం : ప్రజా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ లో ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలంకు వెళ్తున్న కర్ణాటక పాదయాత్ర భక్తులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,కృష్ణ ధర్మ పరిషద్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం,మంచినీరు మజ్జిగను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ...ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్ళు పాదయాత్రలకు కృష్ణ ధర్మ పరిషద్ వ్యవస్థాపకులు తాటి అభిషేక్ గౌడ్ ప్రత్యేక చొరవ చూపి సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ పంపిణీ కార్యక్రమం నాలుగు రోజులు నిర్వహి స్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున,పురుషోత్తం,పవన్,అనిల్,శంకర్, వెంకటేష్,సూర్య,అభినయ్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ...

Image
చిన్నారి ఖర్చులకు ఐదువేలు సహాయం...డీఈఓ... VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :    పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ కోసిగిలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి చిన్నారిని పరీక్ష అనంతరం మౌంట్ కార్మెల్ పాఠశాలకు వెళ్లి పలకరించారు.కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,గత్యంతరం లేని స్థితిలో రూ.450 దినసరి కూలీగా తన తల్లిదండ్రులలో పాటు గుంటూరు మిరపకాయల పనికి వెళ్ళింది.స్థానికులు సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చిన్నారి పరీక్షలు రాసేలా ప్రయాణం ఏర్పాట్లు చేశారు.ఆ బాలిక డీఈఓతో మాట్లాడుతూ గత పరీక్షల్లో తనకు మెరుగైన మార్కులు వచ్చాయని,పరీక్షలో కూడా 80మార్కులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.గైర్హాజరైన సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పడం, ఖచ్చితంగా పాసై ఇంటర్మీడియట్ బైపిసి చదువుతానని చెప్పడంను డీఈఓ ప్రత్యేకంగా అభినందించారు.చిన్నారి చెప్పిన విషయాలపట్ల స్పందించి...

టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు... థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ...

Image
టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ VS9TV న్యూస్,అంబేద్కర్,కోనసీమ : అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో "కోర్టు" సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ అనే థియేటర్‌ యాజమాన్యంపై అమలాపురం ఆర్డీఓ కె.మాధవి చర్యలు తీసుకున్నారు.ఈ థియేటర్‌లో టికెట్లు రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు.నిజమేనని తేలడంతో ఆర్డీఓ చర్యలు చేపట్టారు.థియేటర్‌ సీజ్‌ చేశారు.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అమలాపురంలో ఓ మహిళ వచ్చి టిక్కెట్టు కౌంటర్‌ వద్దకు వెళ్లి కోర్టు సినిమాకు రెండు ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్లు కావాలని అడిగారు. రూ.300 ఇచ్చుకుని రెండు టిక్కెట్లు ఇచ్చాడు కౌంటర్‌లో టిక్కెట్టు అమ్ముతున్నారు.టిక్కెట్టు తీసుకున్న ఆమె నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా అదే కౌంటర్‌లోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.ఆ మహిళ వెంట సబార్డినేట్‌,స్థానిక తహసీల్దార్‌ ఉండడంతో ఆమె నార్మల్‌ వ్యక్తి కాదని తెలిసింది.ఆమె సినిమా చూడడానికి రాలేదని తనిఖీల కోసం వచ్చిన అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అని తేలింది."కోర్టు" సినిమాకు రూ.110 టిక్కెట్టు అమ్...

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు...డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత...

Image
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు... డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత... VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,బిర్లాగడ్డ,మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారని అన్నారు.ఈ నేపథ్యంలో మసీదులో 100 మందికి ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, జిఎన్ఆర్ మెయింటెనెన్స్ ఇంచార్జ్ కుమార్,మేనేజర్ శివ,ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ,పొడిచెర్ల భాష,తిమ్మప్ప,భాష  ,కలిల్,ఆరోగ్య మిత్ర అయూబ్,జిఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ...ఆధునిక సాంకేతికతతో నేరస్ధులపై నిఘా ఉంచాలి...పోలీసు అధికారులతో సమీక్ష...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ ఆధునిక సాంకేతికతతో నేరస్ధులపై నిఘా ఉంచాలి పోలీసు అధికారులతో సమీక్ష జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు,ఎస్సైలతో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్ తో జిల్లా ఎస్పీ చర్చించారు. సిఐడి ఐజి సిసిటిఎన్ఎస్ గురించి జిల్లా ఎస్పీతో వివరాలు అడిగితెలుసుకున్నారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ కర్నూలు,పత్తికొండ, ఆదోని,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు.కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్...

ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు...ఎస్ టియు

Image
ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు...ఎస్ టియు VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తగదని,ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్ టియు జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవనంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ 12వ పిఆర్సి నియామకం,మద్యంతర భృతి,పెండింగ్ బకాయిలు,పెండింగ్ డిఏలు,సరెండర్ బకాయిలు,ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఉందని ఇది తగదని అన్నారు.పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు ఉపాధ్యాయులలో తీవ్రఅసంతృప్తి నెలకొందని చెప్పారు.గత తొమ్మిది నెలల నుండి విద్యా సంస్కరణల పేరుతో ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేశారన్నారు.ప్రభుత్వం వెంటనే 12వ పి ఆర్ సి చైర్మన్ నియామకం చేపట్టాలని, 30శాతం మభ్యంత...

ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం...

Image
ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం మన న్యూస్,కర్నూలు క్రైం : మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు ఎస్. వి.విజయ మనోహరిలను వైఎస్ఆర్సిపి స్టేట్ మైనారిటీ సెక్రటరీ నియమించబడ్డ సలీం భాయ్ పూలమాలవేసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పజెప్పిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సలీం భాయ్ మాట్లాడుతూ కర్నూలు నగరం వైఎస్ఆర్సిపి కంచుకోట అని ముస్లిం సామాజిక వర్గంలో ఎస్.వి.మోహన్ రెడ్డికి తిరుగులేని ఆదిక్యత ఉందని,ఆయన నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తాము కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు,సలీం భాయ్ మిత్ర బృందం పాల్గొన్నారు

నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా...పవన్ కళ్యాణ్,డిప్యూటీ సిఎం...

Image
నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా... పవన్ కళ్యాణ్,డిప్యూటీ సిఎం... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : నారా చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్తే కాదు,వర్గీకరణ రూపకర్త కూడా.. దళితుల ఆత్మగౌరవ పోరాటంను ముందుకు తీసుకుని వెళ్లి,ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి,ప్రధాని దృష్టిలో పడింది అంటే,దీనికి బీజం ఆంధ్రప్రదేశ్‌లోనే పడిందన్నారు.అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము సమర్ధిస్తున్నాం.మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే,నారా చంద్రబాబు ఈ ఉద్యమానికి మొదటి నుంచీ వెన్ను దన్నుగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని వారు తెలిపారు.

నిమిషానికి రూ.90వేలు...బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ...

Image
నిమిషానికి రూ.90వేలు బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ VS9TV న్యూస్,హైదరాబాద్ క్రైం : బెట్టింగ్ యాప్స్‌ కేసులో పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు.బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కోసం ఎంత వసూలు చేస్తున్నారో వివరించారు.ఈ క్రమంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసుల ముందు ఉంచారు.పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తన లాయర్‌తో కలసి వచ్చిన విష్ణుప్రియ పోలీసులు అడిగిన సమాచారం అందజేశారు.ఆమెను క్వశ్చన్ చేసిన ఖాకీలు స్టేట్మెంట్ రిక్రాడు చేశారు.ఈ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.తాను 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు విష్ణుప్రియ పోలీసులకు వివరించారు.నిమిషం వ్యవధితో చేసే ఒక్కో వీడియోకు రూ.90 వేల వరకు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు మూడు గంటలకుపైగా సాగిన విచారణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా భారీగా డబ్బులు వచ్చినట్టు విష్ణుప్రియ అంగీకరించినట్టు సమాచారం.దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు వారికి అందజేశారు.కేసు దర్యాప్తులో భాగంగా మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ఆమె ఫోన్‌ కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు...ఎస్.రవీంద్ర బాబు,కమిషనర్...

Image
శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు ఎస్.రవీంద్ర బాబు,కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : నగరంలోని శివారు ప్రాంతాల కాలనీల్లో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు.గురువారం ఆయన పెద్దపాడు రోడ్డులోని బోసిరెడ్డి కాలనీ,పోలీస్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు.ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ రెండోవ పటాలం అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషాతో కలిసి కాలనీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రహదారులు,మురుగు కాలువలు,తాగునీటి సమస్య పరిష్కరించాలని పోలీస్ అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని,అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.కాగా అంతకన్నా ముందు ఆయన ఎస్‌బిఐ ఎంప్లాయిస్ కాలనీ,అశోక్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

సమాజసేవతోనే సంతృప్తి... టీ.జీ.వెంకటేష్,మాజీ రాజ్యసభ సభ్యులు

Image
సమాజసేవతోనే సంతృప్తి టీ.జీ.వెంకటేష్,మాజీ రాజ్యసభ సభ్యులు  VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :  సమాజ సేవతోనే సంతృప్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీ.జీ.వెంకటేష్ అన్నారు.ప్రతి వ్యక్తీ తన సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు వినియోగిస్తే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆయత్ ఫౌండేషన్ సేవా సంస్థ లోగోను తన నివాసంలో ఆవిష్కరించిన సందర్బంగా టీ.జీ.వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమాజాన్ని తన కుటుంబంలా భావించినప్పుడే ప్రగతి ఫలాలు అందుతాయని అన్నారు.పోలీసు శాఖలో విశేష సేవలు అందించిన రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా సమాజసేవా రంగంలోకి రావడం అభినందనీయమని అన్నారు.ఆయత్ ఫౌండేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఒక మంచి సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో తాము ఈ సంస్థను ప్రారంభించామని అన్నారు.మారుతున్న కాలానికనుగుణంగా రాబోయే తరాల కోసం ఒక వినూత్న ప్రణాళికతో తమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆనందరావు, రామమోహన్ రెడ్డి,వెంకట్రాముడు, నాగేశ్వరబాబు,సూర్యకుమార్, జ్యోతిరాణి,తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి... పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్...

Image
ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తేదీన జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.ఈ మేరకు గురువారం డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడి చెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫార్మ్ పాండ్ కు భూమి పూజ చేసి,తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు,భద్రత గురించి ఎస్పీ తో చర్చించారు. సుమారు నాలుగు వేల మంది వరకు బహిరంగ సభకు హాజరవుతారని,అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.స్టేజ్ అరేంజ్మెంట్స్,బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఆర్ అండ్ బి ఎస్ ఈకి పలు సూచనలు ఇచ్చారు.వేదికపై చేయవలసిన ఏర్పాట్లను చూసుకోవాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు.పారిశుధ్య చర్యలు,శిలా ఫలకం ఏర్పాటు,బ్యాక్ డ్రాప్,తాగునీటి సరఫరా,విద్యుత్ సరఫ...

35వ వార్డు మాదిరాజు నగర్ లో కాలువలు శుబ్రం చేయాలి...పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి...CPM...

Image
35వ వార్డు మాదిరాజు నగర్ లో కాలువలు శుబ్రం చేయాలి  పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి సిపిఎం VS9TB న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్ పరిధి,35వార్డులో కాలువలు శుభ్రం చేయాలని,పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 35 వార్డు మాదిరాజు నగర్ లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యురాలు జి.ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని,వాటిని పరిష్కరించడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా వైపల్యం చెందారని తెలిపారు.మంచినీరు రోజు రావడం లేదని రోజు మరిచి రోజు నీళ్లు వస్తున్నాయని అలాగే కాలువలు శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని, పందులు విపరీతంగా సంచరిస్తున్నాయని అన్నారు.కరెంట్ ట్రూ ఆఫ్ చార్జీలు విరితంగా పెరిగాయని, కరెంటు చార్జీలు పెంచడం ప్రజలపై భారం పెరిగిందని,ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఇక్...

ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు...

Image
ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి లోగో ఆవిష్కరణలో పిలుపునిచ్చిన లెనిన్ బాబు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : తిరుపతి నగరంలో మే,15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్,17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు పిలుపునిచ్చారు.గురువారం నాడు కర్నూల్ నగరంలోని సిఆర్ భవన్ లో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో లోగోను ఎన్.లెనిన్ బాబు ఆవిష్కరించారు.అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో మే,15 నుంచి 18వరకు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.మొదటిరోజు దేశ నలుమూలల నుండి వచ్చే వేలాదిమంది ఏఐవైఎఫ్ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి అనంతరం అన్ని రాష్ట్రాల నుండి 1000మంది ప్రతినిధులు ప్రతినిధుల మహాసభలో పాల్గొంటారన్నారు.ఈ మహాసభలో నేడు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై,మతం పేరుతో జరుగుతున్న దాడులపై,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ దేశంలోని యువతను శాశ్వత నిరుద్యోగులుగా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన సుదీర్ఘంగా మూడు రోజులపాటు చర్చించి భవిష్యత్తులో భగత...

ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు...మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ...

Image
ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ VS9TV న్యూస్,కోడుమూరు : గూడూరు మండలం,చనుగొండ్ల గ్రామం, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి మృతి చెందిన సమాచారంను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గురువారం చనుగుండ్ల గ్రామానికి చేరుకొని ప్రతాప్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో నాయకులను కలుపుకుపోయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.నేడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని ఆయన ఆవేదన చెందారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అస్లాం అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోండి...

Image
రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోండి నంద్యాల నాగేంద్ర,రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ది పొందేందుకు ఈనెల 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి,ఆ పైన డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉంటున్న 21సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వయసులోపు వారికి కుల ధ్రువీకరణ పత్రం,ఆదాయ ధ్రువీకరణ పత్రం,నివాస ధ్రువీకరణ పత్రం,ఆధార్ కార్డ్,రేషన్ కార్డు వంటి పత్రాలతో (apobmms.apcfss in) ద్వారా ఆన్ లైన్ చేసుకోవాలని లక్ష రూపాయల నుండి రూ.5 లక్షల వరకు 40% నుండి 50% వరకు సబ్ స్టీల్ నాలుగు అందజేయడం జరుగుతుందని అన్నారు. జనరిక్ మందుల షాప్ కి రూ.8 లక్షల వరకు 50% సబ్సిడీతో కూడిన రుణాలను కూ...

నగర పాలక సంస్థలో రూ.61.65కోట్లు పన్నులు వసూలు...ఆర్.జి.వి.కృష్ణ,అదనపు కమిషనర్...

Image
నగర పాలక సంస్థలో రూ.61.65కోట్లు పన్నులు వసూలు ఆర్.జి.వి.కృష్ణ,అదనపు కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి ఆస్తి పన్ను,తాగునీటి కొళాయి చార్జీలు,ట్రేడ్ లైసెన్స్ రుసుముల (మొండి బకాయిలతో కలిపి) మొత్తం రూ.61.65కోట్లు వసూలు చేసినట్లు కర్నూలు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 1. ఆస్తి పన్నులు : • అసెస్మెంట్ల సంఖ్య: 1,16,305 • డిమాండ్: రూ.94.73 కోట్లు  • వసూళ్లు: రూ.58.74 కోట్లు  • శాతం: 62% 2. తాగునీటి కొళాయి చార్జీలు : • అసెస్మెంట్ల సంఖ్య: 66,897 • డిమాండ్: రూ.19.84 కోట్లు  • వసూళ్లు: రూ.5.83 కోట్లు  • శాతం: 29.41% ట్రేడ్ లైసెన్స్ రుసుములు : • ట్రేడ్ లైసెన్సుల సంఖ్య: 11,222 • డిమాండ్: 4:51 కోట్లు  • వసూళ్లు: 1.08 కోట్లు  • శాతం: 24.05%

బకాయి సముదాయాల ఎదుట చెత్తా వాహనంతో నిరసన...ట్రేడ్ లైసెన్స్ మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచేందుకు చర్య...

Image
బకాయి సముదాయాల ఎదుట చెత్తా వాహనంతో నిరసన ట్రేడ్ లైసెన్స్ మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచేందుకు చర్య VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో,మొండి బకాయిలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.కొంతకాలంగా వినూత్న కార్యక్రమాలతో పన్ను బకాయిదారులపై ఒత్తిడి తీసుకొస్తున్న అధికారులు, తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.స్థానిక దేవనగర్‌లోని ఎంయస్9 లార్జ్ యాజమాన్యం,గత ఏడేళ్లుగా రూ.3,31,250 లు నగరపాలకకు ట్రేడ్ లైసెన్స్ రుసుములను చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గురువారం సంబంధిత లార్జ్ ఎదుట అధికారులు చెత్త వాహనం నిలిపి నిరసన వ్యక్తం చేశారు.నగరపాలక నుండి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, తనిఖీదారుడు అనిల్,తదితరులు పాల్గొన్నారు.

గేట్ తెలుగు విద్యార్థి సత్తా...ఆలిండియా ఫస్ట్ ర్యాంక్...

Image
గేట్ తెలుగు విద్యార్థి సత్తా...ఆలిండియా ఫస్ట్ ర్యాంక్... VS9TV న్యూస్,నెల్లూరు : ఏపీ,నెల్లూరు జిల్లాలో ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ గేట్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్తో మెరిశారు.డేటా సైన్స్,ఎఐ టెస్ట్ పేపర్లో 100కు గానూ 96.33 మార్కులతో ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం నోయిడాలో ఎక్స్ పర్ట్క్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు.ఎఐలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.

యూకే పార్లమెంట్లో చిరంజీవికి ఘన సత్కారం...

Image
యూకే పార్లమెంట్లో చిరంజీవికి ఘన సత్కారం VS9TV న్యూస్,న్యూఢిల్లీ : మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు.సినిమాల ద్వారా కళారంగానికి,సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది.యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.మరోవైపు,అదే వేడుకలో 'బ్రిడ్జ్ ఇండియా' సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది.

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులు,అనాధలను చేర్చుకుంటాం...వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

Image
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులు,అనాధలను చేర్చుకుంటాం వాసంతి,ట్రస్ట్ చైర్మన్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,పందిపాడు గ్రామ సమీపం,బిఆర్ రెడ్డి కాలనీలోని  శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ లో అనాధ పిల్లలను వృద్ధులను చేర్చుకుంటామని ట్రస్ట్ చైర్మన్ వాసంతి అన్నారు.బుధవారం ట్రస్ట్ లోని వృద్ధులకు బ్రాంచ్ మేనేజర్ అనిల్ చేతుల మీదగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ వాసంతి మాట్లాడుతూ నేటి నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో తల్లి,తండ్రులు లేని పిల్లలను ట్రస్ట్ లో చేర్చుకుని అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.కుల,మత వర్ణ తేడా లేకుండా పిల్లలకు సంరక్షణ కల్పిస్తామని, వారికి మంచి చదువు,భవిష్యత్తు కల్పించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ వాసంతి తెలిపారు.అనంతరం ట్రస్ట్ చైర్మన్ వాసంతి చేతుల మీదుగా హైదరాబాద్ బ్రాంచ్ చర్లపల్లి బ్రాంచ్ మేనేజర్ అనిల్ ని ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రెటరీ పవన్ కుమార్,ట్రస్ట్ కోశాధికారి మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు...పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్....

Image
ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు. బుధవారం నగరంలోని రాజానగర్,బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,గౌతమి నగర్,గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో మార్చి,17వ తేది నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల కోసం 172పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.172 పరీక్ష కేంద్రాలలో  40,776 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.208మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.జిల్లా వ్యాప్తంగా 208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో 11మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.172కేంద్రాలలో ఎలాంటి సంఘటనలు జరగలేదని,మిగతా పరీక్షలు కూడా ప్రశాంత వాతావరణలో పరీక్షలు జరిగేలా చర...

స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి...నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...

Image
స్వచ్చత పనుల నిర్వహణపై అభిప్రాయం తెలుపండి నగర ర్యాంకు మెరుగుదలకు సహకరించండి ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో రోజువారీ స్వచ్చత పనులపై నగర ప్రజలు తమ అభిప్రాయం తెలపాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బుధవారం ఒక ప్రకటనలో కోరారు.కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా నగరాలు,పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై మదింపు జరిపి ర్యాంకులు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని,కర్నూలు నగరం ఆరంభంలో 221వ ర్యాంకులో ఉండగా, ప్రజలందరి భాగస్వామ్యంతో పురోగతి సాధించుకుంటూ, గత సంవత్సరానికి 32వ ర్యాంకుకు చేరుకున్నదని పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించాలనే సంకల్పానికి నగరంలోని ప్రతి పౌరుడి సహకారం అవసరం అన్నారు.ఇందు కోసం స్వచ్చ సర్వేక్షన్ వెబ్‌సైట్‌ https://sbmurban.org/feedback ను ఓపెన్ చేసి స్వచ్ఛతకు సంబంధించి పది ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలరని కోరారు.ఈ సర్వే మార్చి,31నాటికి పూర్తి అవుతుందన్నారు.కర్నూలు నగర ర్యాంకును జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రతి పౌరుడు ఫిడ్‌బ్యాక్ నమోదు చేయాలని కమిషనర్ ...

పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప...

Image
పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప VS9TV న్యూస్,కర్నూలు లీగల్ : పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు ని మహిళాభివృద్ధి,శిశు సంక్షేమంలో భాగమైన సఖి వన్ స్టాప్ సెంటర్ యొక్క లీగల్ అడ్వైసర్ డి.శిల్ప బుధవారం పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా వన్ స్టాప్ సెంటర్ యొక్క ఐదు సేవల గురించి,వారి శాఖ తరపు ఉన్న పోక్సో కేసుల గురించి విక్టిమ్ కాంపిన్సేషన్ ప్రొసీజర్ గురించి జడ్జితో చర్చించారు.ఈ విషయంలో జడ్జి ఈ.రాజేంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి...లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం...ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం...కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...

Image
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలి లబ్ధిదారులతో సమావేశాలు,సదస్సులు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు నిర్వహిస్తాం కె.రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :  పేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన కర్నూలు నగర శివారులో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించి,అక్కడ నివాసముంటున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు 2017లో - పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టిడ్కో పేరుతో నాణ్యతతో కూడిన గృహాలు నిర్మించడం జరిగిందన్నారు.కర్నూలు నగరంలో సుమారు 10,400 గృహాలు రూ.575కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.90శాతం పూర్తి అయిన గృహాలను అతరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పాటు అద్దె చెల్లించలేక, లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కర్నూలు నగర శివారులో ఉన్న టిడ్కో గృహాలకు నీటి వసతి,డ...

ఏప్రిల్‌లో పెళ్లిల్లే...పెళ్లిళ్లు...ముహూర్తాలు కుదరడం చాలా అరుదు...

Image
ఏప్రిల్‌లో పెళ్లిల్లే...పెళ్లిళ్లు... ముహూర్తాలు కుదరడం చాలా అరుదు... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో రెండు,మూడు,మాక్సిమం ఐదు ముహూర్తాలు ఉంటాయి.కాని ఈ ఏప్రిల్ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవు.ఆ పెళ్లి ముహూర్తాల తేదీలు,సమయాలు, పండితుల సలహాలు తెలుసుకుందాం...ఎవరింట్లో అయినా శుభకార్యం చేయాలంటే ముహూర్తం చూడటం మన సంప్రదాయం.ముఖ్యంగా పెళ్లిళ్లకు కచ్చితంగా శుభ ముహూర్తం చూస్తారు.కొంతమంది ముహూర్తం కుదరలేదని నెలల తరబడి పెళ్లిళ్లు వాయిదాలు కూడా వేస్తారు.ముహూర్తాలకు అంత ప్రత్యేకత ఉంది. మరి ఏప్రిల్,2025లో పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. హోళీ వేడుకల సందర్భంగా కొన్ని రోజుల వరకు ముహూర్తాలు ఉండవు.ముఖ్యంగా పెళ్లిళ్లు చేయడానికి ఈ సమయం మంచిది కాదు.ఎందుకంటే ప్రస్తుతం మూఢం నడుస్తోంది.ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు.ఈ మూఢం అయిపోయే నాటికి ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు : ఏప్రిల్ నెల మొత్తం మీద తొమ్మిది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి.సాధారణంగా పెళ్లి ముహూర్...

ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష...డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్...

Image
ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ లో వివిధ విభాగాల హెచ్ ఓడిలతో ఐవిఆర్ఎస్,ఎన్టీఆర్ వైద్య సేవ,ఈ హాస్పటల్,పలు అంశాలపై బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్యసేవకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా జరిగేటట్టు చూసుకోవాలని సంబంధించిన హెచ్ ఓ డిలకు ఆదేశించారు.ఈ హాస్పిటల్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు.అనంతరం ప్రతి విభాగపు ప్రొఫెసర్ ను నోడల్ ఆఫీసర్ గా ఉండి రెగ్యులర్గా ఒపి,ఐ పి,డిశ్చార్జ్ డేటాను ఈ హాస్పిటల్ లో అప్లోడ్ చేయడానికి హౌస్ సర్జన్స్,పీజీలు,నర్సింగ్ సిబ్బంది సేవలను వినియోగించుకొనేలా చూసుకోవాలని,ప్రతిరోజు ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్,మానిటరింగ్ చేయాలని వారికి ఆదేశించినట్లు తెలిపారు.(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ఐవిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సిస్ట...

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం...సిఎం చంద్రబాబు...

Image
బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం... సిఎం చంద్రబాబు... VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40నిమిషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు.భేటీ అనంతరం బిలేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు."బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం.ఆరోగ్య సంరక్షణ,విద్య,వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం.స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చం...

అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు... రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ...

Image
అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు రవిచంద్ర,జంగారెడ్డిగూడెం డీఎస్పీ VS9TV న్యూస్,ఏలూరు క్రైం : అనధికారికంగా ప్రభుత్వ సైరన్,ఇతర స్టిక్కర్ లు ఉపయోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు.ఈ మేరకు సిఎంఒ స్టిక్కర్స్ వేసుకొని హల్ చల్ చేసిన ఉరకరణం జగన్నాథరావును తడికలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సిఎంఒ స్టిక్కర్స్ పై డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో సిఎంఒ  స్టిక్కర్ నకిలీది కావడంతో జగన్నాథరావు ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఎవరైనా అనధికారికంగా సైరన్,ప్రభుత్వానికి చెందిన ఇతర గుర్తింపు స్టిక్కర్లని వేసుకొని తిరిగితే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు.ఇప్పటికే పలు కేసుల్లో ఉరకరణం జగన్ నిందితుడుగా ఉన్నట్లు చెప్పారు.కామవరపుకోటలో ఒక స్కూల్ అనుమతుల కోసం రూ.5లక్షలు డిమాండ్ చేశాడన్నారు.నగదు ఇవ్వకపోతే స్కూల్ పై ఫిర్యాదు చేసి ముసివేస్తానని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు జగన్ ను అరెస్ట్ చే...