Posts

పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటన లు...పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక...

Image
పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటనలు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక VS9TV న్యూస్,తెలంగాణ : హైదరాబాద్‌లో పెళ్లి ముసుగులో మోసాలు...బ్లాక్ మెయిల్ ఘటనలు జరుగుతున్నట్లు అ నేక పిర్యాదులు వస్తున్నాయని,ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగు తుందని తెలంగాణ పోలీస్ కమి షనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.ఈ మేరకు పోలీస్ క మి షనర్ వీసీ సజ్జనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నిశ్చితార్థం తర్వాత డబ్బు,అదనపు కట్నం కోసం వేధింపులు చేస్తున్న వారిపై కఠినచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు భయపడకుండా షీటీమ్స్ వాట్సాప్ 94906 16555 లేదా 100కు కాల్ చేయాలని సూచించారు.వివరాలు గోప్యంగా ఉంచు తామని హామీ ఇచ్చారు.

బాధ్య‌త‌తో సురక్షితమైన ప్రయాణం సాగించాలి... నవిత,ఎస్సై మధిర...

Image
బాధ్య‌త‌తో సురక్షితమైన ప్రయాణం సాగించాలి నవిత,ఎస్సై మధిర VS9TV న్యూస్,మధిర : ప్రతి ఒక్కరూ బాధ్యతతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం సాగిం చాలని మధిర ఎస్సై నవిత అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రెండోవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో సోమవారం మధిర పట్టణంలోని వాహనదారులకు అవగాహన కల్పించా రు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ...అతివేగం...మద్యం మత్తు...ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,దీంతో రహదారులు నెత్తురో డుతుండగా విలువైన ప్రాణాలు కోల్పోయి,బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుం టోందని అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ జిల్లాలో ప్రమాదా ల నివారణపై దృష్టి సారించిందని,కాబట్టి వాణిజ్య,వర్తక వ్యాపారులు తమ వద్ద పనిచేస్తు న్న వారికి కూడ తమవంతు భాద్యతగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత... ఎస్పీ ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు...

Image
ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఎస్పీ ఆదేశాలతో భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీ క్షలను ప్రశాంతంగా,సజావుగా నిర్వహించేందుకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఎస్పీ ఆదేశాల మేరకు జి ల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏ ర్పాటు చేశారు.పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను ఆకస్మి కంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల పనితీరును పర్యవేక్షి స్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.ట్రాఫిక్ అంతరాయం లేకుండా,పరీక్షలు నిర్వ హించే ప్రాంగ ణాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,కాపీ యింగ్ కు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.

పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాక రం...పార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్)ఘన నివాళులు...

Image
పాత్రికేయుడు ఎస్.జేమ్స్ అకాలమరణం బాధాకరం పార్థివ దేహానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)ఘన నివాళులు VS9TV న్యూస్,కల్లూరు : నిత్యభాను,స్వచ్ఛ ప్రభ ఎడిటర్ ఎస్.జేమ్స్ (45) అనారోగ్యంతో నగరంలోని అమీలియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది.ఘటన స మాచారం తెలుసుకున్న యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)బృందం ఆధ్వర్యంలో వ్య వస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు గిలిగిత్త విజయ్ కుమార్ ఆ ధ్వర్యంలోజేమ్స్ స్వగృహంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించా రు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా,ఆత్మకూరు నియోజక వర్గంకు చెందిన ఎస్.సంజీవ రాజు,సరోజమ్మ దంపతులకు కుమారుడిగా ఎస్.జేమ్స్ ఫోటో,వీడి యో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తూనే నిత్యభాను,స్వచ్ఛప్రభ వంటి దినపత్రికలు స్థా పించాడు. దీంతో ఎంతో మంది యువతను జర్నలిస్ట్ లుగా తీర్చిదిద్దినట్లుగా చెప్పారు.అలాగే యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) పిలుపు మేరకు జేమ్స్ ప్రతి కార్యక్రమాన్ని విజయవం తం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవాడని అన్నారు.కల్లూరు మండలంలోని ప్రధాన సమస్య జర్నలిస్ట్ ల ...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్ హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకో వాలి..డివైఎఫ్ ఐ...

Image
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్  హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్ హాస్పిటల్ పై విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ ఐ న్యూసిటీ కమిటీ కార్యదర్శి హుస్సేన్ భాష డిమాండ్ చేశారు.ఈ మేరకు డివైఎఫ్ ఐ కర్నూలు న్యూసీటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా న్యూసీటీ కార్య దర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ కర్నూలు నగరంలోని అంకురా అపెక్స్ హాస్పిటల్ యా జమాన్యం ప్రజల ప్రాణాలతో దందా చేస్తుందని విమర్శించారు.ఈ మధ్యకాలంలో ఒక గ ర్భిణీ మహిళ డెలివరీ కోసం అంకురా హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే,కేవలం 10రోజులకే కొన్ని లక్షల రూపాయలు బిల్లు వేసినట్లు సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు.ఒక అంకుర హాస్పిటల్ మాత్రమే కాదు కర్నూలులోని ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా అధిక బిల్లు లు,అనవసర పరీక్షలు,రోగుల నుండి అధిక మొత్తాలు వసూలు చేసే పరిస్థి తులు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.ప్రాణాలు బతికించుకోవడం కోసం హాస్పిటల్‌లో చేరిన రోగుల నుం డి డబ్బే ల...

సీనియర్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ కు ఘన నివాళి... కర్నూలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్...

Image
సీనియర్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ కు ఘన నివాళి కర్నూలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ VS9TV న్యూస్,కల్లూరు : సీనియర్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ ను స్వగృహంలో ఆయన పార్తివదేహాన్ని సోమవారం క ర్నూలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భార్గవా చారి,కోశాధికారి అక్షర ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ దేవి హరి బృందం సందర్శించి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి జేమ్స్ మరణం చాలా బాధా కరం అని అన్నారు.అనంతరం మన కర్నూల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరుపున మన ప్రెసిడెంట్ భార్గవ ఆచారి వారి కుటుంబానికి తక్షణ సహాయం రూ.10వేలు అందజేయ డం జరిగింది.జేమ్స్ ఆత్మకు శాంతి కలగాలని అసోసియేషన్ తరపున వారు కోరారు.ఈ కార్యక్రమంలో బంగారు పేట రామన్న,సింధు ల్యాబ్ అధినేత సుధాకర్,దొరబాబు,సురేష్ బాబు,శశి,తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్...అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు...

Image
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు VS9TV న్యూస్,మెదక్ : మెదక్ జిల్లా,రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజన తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మం ది విద్యార్థులు,ముగ్గురు టీచర్లు వాంతులు, విరే చనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు.ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచా రణ చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి...క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు తిన్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్పస్థతకు గురయ్యారు.ఈ ఘటన మెదక్ జిల్లా,రేగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. రోజులాగే రాత్రి పూట భోజనం చేసిన విద్యార్థి నిలు తెల్లవారు జామున నుండి వరుసగా వాం తులు,విరేచనాలు చేసుకోవడాన్ని పాఠశాల సిబ్బంది గుర్తించారు.వీరితోపాటు ఎస్ఎస్‌సీ ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్ టీంలో నలుగురు ఉపాధ్యాయులు ఈ అస్వస్థత బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన హాస్టల్ వార్డెన్,ఉపాధ్యా యులు విద్యార్థినులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు.వీరిలో పది మంది విద్యార్థినిలకు చికిత్స అందించగా ప్రస్...

మైనర్ బాలుడితో...కోడలు వివాహేతర బంధం...భర్త,అత్తను హత్య చేసేందుకు కుట్ర...ఊచలు లెక్కపెట్టించిన పోలీసులు...

Image
మైనర్ బాలుడితో...కోడలు వివాహేతర బంధం భర్త,అత్తను హత్య చేసేందుకు కుట్ర ఊచలు లెక్కపెట్టించిన పోలీసులు VS9TV న్యూస్,చిత్తూరు :  వివాహేతర సంబంధం మోజులో భర్త,అత్తను చంపడానికి ప్లాన్ చేసిన కవిత అలియాస్ వేలాం గని (37) అనే మహిళను చిత్తూరు వన్టన్ పోలీ సులు అరెస్టు చేశారు.వివరాల్లోకేలితే... గిరింపే టకు చెందిన ఈ మహిళ,ఓ మైనర్ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని...అడ్డుగా ఉన్న తన భర్త,అత్తను చంపాలనే ప్రణాళిక చేసుకుంది.దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది.ఆపై ఆమె,అత్త గొంతు కోసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఆ మ రుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి... తిరు పతి జువెనైల్ హోమ్ కు తరలించారు.పరారీలో ఉన్న మహిళను ఎస్ఐ నాగప్ప నాయక్ అరెస్టు చేసి,న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరం లోని జిల్లా జైలుకు తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ప్రేమ పేరుతో నయవంచన...ఆత్మహత్యకు పాల్పడిన యువతి...

Image
ప్రేమ పేరుతో నయవంచన ఆత్మహత్యకు పాల్పడిన యువతి VS9TV న్యూస్,గుంటూరు : ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.ఫోటోలతో బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు.చివరకు ఆ యువతి ప్రాణం పోయేలా చేశాడు.గుంటూరు జిల్లాలో ఈ దారు ణ ఘటన జరిగింది.తల్లిదండ్రులు ధైర్యం చెప్పి నా,ఆ కిరాతకుడి బెదిరింపులకు భయపడి యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలిం చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలాఉన్నాయి... గుంటూరు జిల్లా,తాడేపల్లి మండలం, పోలకం పాడులో శ్రీనివాసరెడ్డి,రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అమ్మాయి మీనాక్షి డిగ్రీ చదువుతుంది.అబ్బా యి ఇంటర్ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి ముఠా పనులకు వెల్తుండగా,రమణమ్మ హోటల్స్‌లో కూలీ పనులు చేస్తుంది.మీనాక్షి చదివే కాలేజ్‌లోనే రహీం చదువతుండగా.. అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఫోటోలు తీసుకున్నారు.అయితే రహీం ప్రవర్తన నచ్చక పోవడంతో మీనాక్షీ అతనికి దూరంగా ఉంటుం ది.మీనాక్షి తనతో మాట్లాడకపోవఠంతో రహీం కక్ష పెంచుకున్నాడు.మీనాక్షి ఫోన్‌కి మెస్సెజ్‌లు పంపుతూ బెదిరిస్తున్నాడు.ఇద్దరి ఫోట...

భర్త LLB ...B.Com భార్య...రాజన్న సన్నిధిలో భిక్షాటన...తల రాతలో చదువుల ‘సిరి’ ఉన్నా.. విధి రాతలో ‘భిక్షాటన...

Image
భర్త LLB ...B.Com భార్య...రాజన్న సన్నిధిలో భిక్షాటన. తల రాతలో చదువుల ‘సిరి’ ఉన్నా.. విధి రాతలో ‘భిక్షాటన వేములవాడ రాజన్న సన్నిధిలో కన్నీటి గాథ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేముల వాడ...ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ రాజ రాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీన గాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కాన్వెంట్ చదువు లు,ఉన్నత డిగ్రీలు ఉన్నా.. కాలం చేసిన గాయా నికి ఆ దంపతులు నేడు యాచకులుగా మారా రు. అనర్గళంగా ఇంగ్లీష్,ఆశ్చర్యపోయిన అధికారులు : వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తు న్న వారికి పోలీసులు,అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు.వారు మాట్లాడుతున్న అనర్గళ మైన ఇంగ్లీష్,వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు. భర్త జలంధర్ రెడ్డి: లా (LLB) పూర్తి చేసిన విద్యావంతుడు. భార్య శిరీష: బీకాం కంప్యూటర్స్ చదివిన పట్టభద్రురాలు. కరీంనగర్‌కు చెందిన ఈ దంపతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. భార్య ఆరోగ్యం క్షీణించ డంతో,ఆమెకు తోడుగా ఉంటూ...రాజన్నే దిక్క ని నమ్మి ఇక్కడికి వచ్...

కర్ణాటకలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే...

Image
కర్ణాటకలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే రహదారి పక్కన గోడ నిర్మించడంతో కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షలు డిమాండ్ తన ఆసుపత్రిలోనే ఎమ్మెల్యే రూ.5 లక్షలు తీసు కుంటుండగా పట్టుకున్న లోకాయుక్త VS9TV న్యూస్,కర్ణాటక : కర్ణాటకలో కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీ సులు ఒక బీజేపీ ఎమ్మెల్యేను పట్టుకున్నారు. గదగ జిల్లా శిరహట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే డా క్టర్ చంద్రులమాణి లంచం తీసుకుంటూ లోకా యుక్తకు చిక్కారు.రహదారి పక్కన గోడ నిర్మించి న విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారు.దీంతో విజయ్ పూజార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశా రు.లక్ష్మేశ్వరపురలోని తన ఆసుపత్రిలోనే ఎమ్మె ల్యే రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యేతో పాటు అతడి ఇద్దరు సహాయకులు మంజునాథ్ వాల్మీకి,గురునాయక్‌లను అరెస్టు చేశారు.మైనర్ ఇరిగేషన్ శాఖ కింద ఉన్న రోడ్డు లో గోడ నిర్మించడంతో, దీనికి క్లియరెన్స్ ఇవ్వ డానికి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి.ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు లోకా యుక్త తెలిపింది.దార...

ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం... అప్పటి డీఎస్పీ సహా నలుగురిపై సస్పెన్షన్...

Image
ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం అప్పటి డీఎస్పీ సహా నలుగురిపై సస్పెన్షన్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ రావు (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. దర్యాప్తులో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.2022లో జరిగిన ఈ హత్య కేసు దర్యాప్తులో నిందితుడైన అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈ వేటు పడింది.ఈ కేసు విచారణ "పోలీసు-అధికార వర్గాల కుమ్మక్కుకు స్పష్టమైన ఉదాహరణ" అని ఫిబ్రవరి 20న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాస నం ఘాటుగా వ్యాఖ్యా నించింది. ఛార్జిషీట్ దాఖ లులో ఉద్దేశ పూర్వ కంగా జాప్యం చేసి,నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించారని కోర్టు అభిప్రాయపడింది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం తక్షణమే స్పందించి,బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది...

హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య...విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు...

Image
హైదరాబాద్ లో ప్రేయసి ఆత్మహత్య విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు VS9TV న్యూస్,హైదరాబాద్ : విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యు వకుడు అనుమానస్పద మృతి కలకలం రేపిం ది...మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే,నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ..అంటూ రాసిన సూసైడ్ నోట్ లభిం చింది.ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా తెలుస్తుంది.హైదరాబాద్ లో శ్యామ్ కుమార్,పావని మద్య జరిగిన గొడవ కా రణంగా పావని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది.పావని పరిస్థితి విషమించడంతో హైదరా బాద్ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడు శ్యామ్ కుమార్.విశాఖలోని ఒక లాడ్జి అద్దెకు తీసుకు న్నాడు.అక్కడి నుండి తన స్నేహితులతో సమా చారం సేకరించాడు.పావని మరణ వార్త తెలుసు కున్న శ్యామ్ కుమార్ తలుపులు తీయకపోవ డంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి స్పేర్ కీ తో తలుపులు తీసి చూడగా విగతజీవిగా పడివున్నాడు.దీంతో ఖంగుతిన్న లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.ఘటన ...

బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు...

Image
బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు VS9TV న్యూస్,హైదరాబాద్ : మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు 'అవేక్ క్రానియోటమి' అనే ఆపరేషన్ చేస్తున్నా రు.ఈ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆప రేషన్ చేస్తారు.ఇటీవల ఓ రోగి గిటార్ వాయి స్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసిం ది.మాటలు,కదలికలకు అంతరాయం కలగకుం డా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచు కుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్, CMC వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30 ఏళ్లు గా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది•

నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం...కెసి కెనాల్ స్వచ్ఛత పనులు కలెక్టర్ ఏ.సిరి పరిశీలన...

Image
నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం కెసి కెనాల్ స్వచ్ఛత పనులు కలెక్టర్ ఏ.సిరి పరిశీలన VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని,నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం వినా యక ఘాట్ సమీపంలో కెసి కెనాల్‌లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సం స్థ కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.కెనాల్ పరిసరాల్లో చెత్త పార వేయడాన్ని కట్టడి చేయడానికి మున్సిపల్ శానిటేషన్, జలవనరుల శాఖ సిబ్బంది ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.దెబ్బతిన్న రక్షణ వలయాలను తక్షణ మే పునరుద్ధరించాలని సూచించారు.కెనాల్‌లోకి మురుగునీరు ప్రవహిస్తున్న ప్రదేశాలను గుర్తించి,వాటి మళ్లింపుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...నగర నడిబొడ్డున ప్రవహించే ఎసి కెనాల్ నగర సౌందర్యానికి ప్రతీకగా నిలవాలని,అయితే పరి సర ప్రాంతాల నిర్లక్ష్యంతో అపరిశుభ్రత నె లకొనడం విచారకరమన్నారు.నీటి ప్రవాహం తగ్గిన వేళ దుర్వాసనలు,దోమల ప్రబలత వంటి సమస్యలు పెరిగి ప్రజారోగ్యానికి మ...

సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొం గలించి ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు...

Image
సులభంగా డబ్బు సంపాదనకు బాలికలను దొంగలించి  ఎత్తుకెళ్తున్న నిందితురాలిని పట్టుకున్న  తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు తల్లిదండ్రులకు చిన్నారులను అప్పజెప్పిన పోలీసులు VS9TV న్యూస్,తిరుమల :  సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు చిన్నారులను దొంగిలించిన నిందితురాలిని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.బాలి కలను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.వి వరాలు ఇలా ఉన్నాయి...పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన లక్ష్మి,రాంబాబు దం పతులు తమ కుమార్తెలు నవదుర్గ(5),అశ్విని(3)లతో తిరుమల వచ్చారు.ఈ నెల 16న ఉ దయం స్థానిక నాదనీరాజనం ప్రాంతంలో బాలికలు ఆడుకుం టుండగా...అన్నమయ్య జి ల్లా,కలకడ మండ లానికి చెందిన గుండ్లూరు శివమ్మ వారిని దొంగిలించి,వెతుకెళ్లి తన వెంట తీసుకుపోయింది. ఈ నేపథ్యంలో బాలికల తల్లి తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పిర్యాదు మేరకు ఎస్‌ఐలు చలపతి,రమేష్‌బాబుల ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ప్రత్య క్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు.ప్రత్యేక పోలీసు బృందాలతో కలిసి ఈ నెల 17న కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో నిందితురాలిని అదుపులోకి తీసుకుని,ఇద్దరు చిన్నా...

పర్వతారోహకుడు గడ్డం భరత్ దేశానికీ గర్వకార ణం...బుర్ర అనిల్ కుమార్ గౌడ్,ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్...

Image
పర్వతారోహకుడు గడ్డం భరత్ దేశానికీ గర్వకారణం బుర్ర అనిల్ కుమార్ గౌడ్, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ VS9TV న్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం,దమ్మన్న పేట గ్రామానికి చెందిన యువ పర్వతారో హకుడు గడ్డం భరత్ తన అసాధారణ ధైర్యసా హసాలతో రాష్ట్రానికే కాక దేశానికీ గర్వ కారణంగా నిలుస్తున్నారు.2023 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అత్యంత క్లిష్ట మై న శిఖరం అయిన కాంగ్టో పర్వతంను విజయవంతంగా అధిరోహించి తన ప్రతిభను చాటుకున్నారు.అనంతరం 2025లో సిక్కింలోని మౌంట్ కబ్రు డోమ్ (21,655 అడు గులు) శిఖరాన్ని అధిరోహించి మరో మైలురాయిని సృష్టించారు.అదే సంవత్సరంలో డి సెంబర్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఉన్న మౌంట్ బందర్‌ పూచ్ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తన సాహస యాత్రను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు.అతి బీద కుటుంబానికి చెందిన భరత్‌కు సరైన శిక్షణా నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక పరిమితుల కారణంగా ముందుకు సాగడం కష్టసాధ్యమైంది.ఈ నేపథ్యంలో పాలకు ర్తి గ్రామానికి చెందిన అతని చిన్ననాటి మిత్రుడు,ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యజమాని బు ర్ర అనిల్ గారు రూ.50,000 ఆర్థిక సహాయం అందిం...

2021లో కర్నూలు జిల్లాలో కావేరి జాదురకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం జమ చేయాలి...ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్...

Image
2021లో కర్నూలు జిల్లాలో కావేరి  జాదురకం పత్తి విత్తనాలు వేసి  నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం జమ చేయాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కలెక్టర్ కార్యాలయం ముందు 2021వ సంవత్సరంలో కావేరి జాదు రకం విత్తనాలు వేసి నష్టపోయిన బాధిత రైతుల ధర్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆ ర్డర్ ను తక్షణమే అమలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.2021వ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మండలాలలో 1889 మంది రైతులు కావేరి జాదూరకం పంట సాగు చేసినట్లు చెప్పారు.కావేరి కంపెనీ వారు నకిలీ విత్తనాలు సరఫరా చేయడం వల్ల పంట దిగుబడి రాకపోవడం చేత వివిధ రూపాలలో ఆందోళన చేసిన ఫలితంగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మూడు కింటల నుం డి ఏడు క్వింటాళ్ల వరకు నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారని అన్నారు.జరిగిన నష్టానికి ప రిహారం ఇ...

శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు...

Image
శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు... 13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు VS9TV న్యూస్,శ్రీశైలం : నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు సమ ర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.గత 13రోజుల కు గాను మల్లన్నకు భారీగా ఆదాయం లభించింది.చంద్రవతి కళ్యాణ మండ పంలో కట్టుదిట్ట మైన భద్రత,సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపులో స్వామి వారికి రూ. 5,6 1,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివా సరావు అధికారికంగా ప్రకటించారు.నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో పెద్ద ఎ త్తున బంగారు,వెండి ఆభరణాలను సమర్పించారు.స్వామి అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం,5.550కేజీల వెండి సమకూరాయి.భారతీయ కరెన్సీతో పాటు విదే శాల్లోని భక్తులు కూడా స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరి కా డాలర్లు,25 ఇంగ్లాండ్ పౌండ్లు,15 ఆస్ట్రేలియా డాలర్లు,సింగపూర్ ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మంథని సబ్ రిజిస్ట్రార్...భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 డిమాండ్...

Image
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మంథని సబ్ రిజిస్ట్రార్ భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 డిమాండ్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బు స్వీక రిస్తూ అరెస్ట్ అవినీతిపై 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన VS9TV న్యూస్,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.మంథని సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న కాసర్ల రాజేందర్,భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే...ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రే షన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ. 16,500 లంచం డిమాండ్ చేశారు.బాధి తుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నా రు.రాజేందర్ సూచన మేరకు,బాధితుడు ఆ డబ్బును రషీద్ అనే ప్రైవేట్ డాక్యుమెంట్ రైట ర్‌కు మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టు కున్నారు.ఈ సంద ర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు.ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే,తమ టోల్ ఫ...

అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం... ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

Image
అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం ఎం.శ్రీహర్ష, కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా ప్రజల జీవనాధారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి,జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పే ర్కొన్నారు.శనివారం బిర్లా కాంపౌండ్‌లోని కేపిఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ...గుండ్రే వుల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ,వివిధ సాకులు ప్రస్తావిస్తూ ప్రక్రియను వాయిదా వేయాలనే భావనతో మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్రామాలు,కర్ణాటకలో ఒక గ్రామం ముంపునకు ప్రభావితమవుతాయని అది క్లిష్టమైన ప్రక్రియ కాకపోయినా దాన్ని సాకుగా చూపడం సరైంది కాదన్నారు.వాస్త వానికి ఆయా ప్రాంతాల ప్రజలకే అధిక ప్రయోజనం చేకూరే ఈ ప్రాజెక్టును పరస్పర చర్చ లతో పరిష్కరించవచ్చని శ్రీహర్ష స్పష్టం చేశారు.కేఆర్‌ఎంబి,సిడబ్ల్యుసి,అపెక్స్ కౌన్సిల్ అ ...

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి నీతిమాలిన చర్యమాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు...

Image
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి నీతిమాలిన చర్య మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బిజెపి యువ మోర్చా కార్యకర్తలు దాడి చేయడం నీతి మా లిన చర్య అని మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు ఎం.సుధాకర్ బాబు విమర్శించారు.శని వారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన వి డుదల చేస్తూ నిన్న అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నా యుడు బోయ జిల్లా ఎస్పీ,స్థానిక సిఐతో మాట్లాడి పార్టీ కార్యాలయానికి రక్షణ కల్పిం చాలని కోరడం జరిగిందని అన్నారు.పోలీసులు రక్షణగా ఉన్న వారి సమక్షంలోనే బిజెపి యువమోర్చా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయడం,గేటును డ్యామేజ్ చేసి,ఫ్లెక్సీలు చింపివేయడం,కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కఠిన పద జా లంతో విమర్శించడం బిజెపి గుండాలకే తగునని చెప్పారు.కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఎ రగని రీతిలో అధికార మదంతో మతతత్వ పార్టీ,బిజెపి పార్టీ యువ మోర్చా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి పునుకున్నది.దేశం,రాష్ట్రంలో ఏ పార్టీవాళ్లు ఏమి చే సుకున్నరో...

కాకతీయలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు...

Image
కాకతీయలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు విద్యార్థుల నృత్య ప్రదర్సన  VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు మద్దూరు నగర్ లోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి వి ద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వ హించారు.ఈ వేడుకల్లో చిన్నారు లు తమ నృత్యాలతో అలరించారు.పదో తరగతి బాలికలు,బాయ్ లు ఓ మై ఫ్రెండ్ అం టూ డ్యాన్స్ తో అదరగొట్టారు.నర్సరీ,ఎల్ కె జి,యూకేజీ చిన్నారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు.కరస్పాండెంట్ ఎం.సుమతి,ప్రిన్సిపల్ రమణి,హెడ్ మాస్టర్ కె.రామస్వామి పాల్గొన్నారు.

ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు...డోన్ గంగ పుత్ర సంఘం...

Image
ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత  విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు డోన్ గంగపుత్ర సంఘం VS9TV న్యూస్,డోన్ : నంద్యాల జిల్లా,డోన్,కోట్లవారిపల్లెలో ఈ నెల 22వ తేదిన ఫాల్గుణ శుద్ధ పంచమి,ఆది వారం వరకు శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు వేద పం డితులచే నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మే రకు ఉదయం గణపతి పూజ,పరిషత్,పంచగవ్యప్రాశన,దేవి మూలమంత్ర హోమములు, కళా హోమములు, ప్రతిష్టా హోమములు ఉదయం గం.11-52 లకు యంత్ర ప్రతిష్ట,అ మ్మవారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజప్రతిష్ట కళాన్యాసములు,మహాపుర్ణాహుతి,మండప,ఉద్వాసన, అవబృతము నిరాజన మంత్ర పుష్పాలు,వేద ఆశీర్వచనము,ప్రతిష్ట అనంతరం మధ్యా హ్నం గం.1-00కు భక్తాదులందరికి అమ్మవారి అన్నప్రసాదము కలదు.కావున యావన్మం ది ప్రజలు,భక్తులు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని శ్రీఅమ్మవారి తీర్థ ప్రసాదములు,స్వీక రించి అమ్మవారి అను గ్రహమునకు పాత్రులు కాగలరని వారు తెలిపారు.

అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్సులు,500 ఆటో హారన్ లు రోడ్ రోలర్‌తో ధ్వంసం...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్ లు రోడ్ రోలర్‌తో ధ్వంసం   కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డి బురుజు వద్ద అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటో హారన్ లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వ ర్యంలో శనివారం రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు.ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కొంతమంది యువకులు వారి యొక్క ద్విచక్ర వాహనాలకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్స్ ను మాడిఫైడ్ చేసి అమర్చుకుని,అధిక శబ్దం వ చ్చే విధంగా డ్రైవ్ చేయడంతో వారిపై ఒక నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చామ న్నారు.డ్రైవ్ లో 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటోల హారన్ లను సీజ్ చేయడం జరిగింద న్నారు.కావున వాటిని నేడు రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందన్నా రు.రాత్రి వేళల్లో అధిక శబ్దం వచ్చే విధంగా సౌండ్ పోల్యూషన్ చే స్తున్నారని ప్రజల నుం డి ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.ప్రజలు,యువతకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన చేస్తు న్నామన్నారు.ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లను ద్విచక్రవాహనాలకు,...

చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్ప డిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష...

Image
చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన   కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష VS9TV న్యూస్,న్యూఢిల్లీ :   చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది.నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్‌ ఇంజనీర్‌ రామ్‌ భవన్,అతని భార్య దుర్గా వతికి మరణశిక్ష విధిస్తూ చా రిత్రాత్మక తీర్పు నిచ్చింది.2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైన ర్‌ బాలురపై 3ఏళ్ల చిన్నారులతో సహా దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కో ర్టు నిర్ధారించింది.2లక్షలకుపైగా అభ్యంతరకర వీడియోలు,ఫొటోలను దాదాపు 47 దేశా లకు ఇంటర్నెట్‌ ద్వారా చేరవేశారు.ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యా యమూర్తి ప్రదీప్‌ కుమార్‌ మిశ్రా,నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునా దులనే కదిలిం చిందని పేర్కొన్నారు.బాధితులైన 33మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహా రం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.నిందితుల ఇంట్లో స్వాధీనం చే సుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించ...

డిజిటల్ అరెస్ట్ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసుల కు అభినందనలు...నారా లోకేష్,విద్యా శాఖ మంత్రి...

Image
డిజిటల్ అరెస్ట్ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులకు అభినందనలు నారా లోకేష్,విద్యా శాఖ మంత్రి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : డిజిటల్ అరెస్ట్ ప్రయత్నాన్ని భగ్నం చేసి వృద్ధ జంటను కాపాడిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కు, ఉయ్యూరు సీఐ టివివి రామారావుకు,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించా రు. గత గురువారం ఉయ్యూరు టౌన్ లో చోటు చేసుకున్న డిజిటల్ అరెస్ట్ సంఘట నలో అప్రమత్తంగా వ్యవహరించి త్వరితగతను స్పందించి వృద్ధ జంటను సైబర్ మోసంలో ఇరు క్కోకుండా కాపాడిన కృష్ణా జిల్లా పోలీసులు,ఉయ్యూరు టౌన్ సిఐ టివివి రామారావుల కృషి ఎనలేని దని చెప్పారు.నేడు అభివృద్ధి చెందుతున్న సైబర్ నేరాలలో సీనియర్ సిటి జన్లు అత్యంత దుర్బలమైన లక్ష్యాలు.వారిలో చాలా మంది,ముఖ్యంగా పదవీ విరమణ చే సినవారు,"డిజిటల్ అరెస్ట్" మోసాలు అని పిలవబడే ద్వారా భావోద్వేగ పరంగా మోస గించబడుతున్నారు.ఆర్థికంగా బెదిరించబడుతున్నారు.ఈ విధంగా వృద్ధులను బలిగొన డం చూడటం చాలా బాధాకరం అని అన్నారు.సకాలంలో జోక్యం చేసుకుని ఇద్దరు వృద్ధ పౌరులను గణనీయమైన ఆర్థిక నష్టం నుండి కాపాడినందుకు కృష్ణ జిల్లా పోలీసుల వేగ వంతమైన,సున్నితమైన చర్యను నిజంగా ...

చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!...డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు15 రోజు లకు మళ్లీ కాల్...రూ.49 లక్షలు మోసపోయిన వై నం...

Image
చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు! డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు 15 రోజులకు మళ్లీ కాల్..రూ.49 లక్షలు మోసపోయిన వైనం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  డిజిటల్ అరెస్టు అనేది లేదని,ఆ పేరుతో వచ్చే కాల్సు స్పందించవద్దని పోలీసులు ఆవిశ్రాం త ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు.రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకు కు వచ్చిన అతణ్ని ఆపారు.ఎవరైనా ఇబ్బంది పెడితే...తమను సంప్రదించాలని భరోసా ఇ చ్చి మరీ పంపించారు.15 రోజుల్లోనే మళ్లీ అలాంటి కాల్ రావడంతో ఈసారి ఆ విశ్రాంత ఉద్యోగి భయపడి,మోసగాళ్లకు రూ.49 లక్షలు బదిలీ చేసేశారు.విజయవాడలో స్థిరప డిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి (65)కి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నా మంటూ ఓ కాల్ వచ్చింది.మీపై కేసులున్నాయని బెదిరించారు.యూనిఫాంలో ఉండి వీడి యో కాల్ చేసిన ఓ వ్యక్తి తాను దర్యాప్తు అధికారినని, రూ.72.50 లక్షలు ఇస్తే కేసు మా ఫీ చేస్తానని అన్నాడు.దీంతో విశ్రాంత ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు.తన పేరిట ఉన్న రూ.78లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి,అందులో రూ.72.50లక్షలను మరో ఖాతాకు బదిలీ చేయాలని...

చంద్ర గ్రహణం కారణంగా మార్చి,3న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత...

Image
చంద్రగ్రహణం కారణంగా మార్చి,3న శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత VS9TV న్యూస్, శ్రీశైలం : చంద్రగ్రహణం కారణంగా మార్చి,3వ తేదీన ఉదయం గం.6.00ల నుండి రాత్రి గం.7. 30ల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి.ఈ కారణంగా ఆలయములోని అ న్నీ ఆర్జితసేవలు,పరోక్షసేవలు,శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా నిలు పుదల చేయబడ్డాయి.అదే విధoగానే సాక్షిగణపతి,హాఠకేశ్వరం–ఫాలధార-పంచధార ,శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగు తుంది.దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా యిదేవిధంగా ఆలయద్వారాలు మూసివే యబడుతాయి. 3వ తేదీ ఉదయం గం. 3.00లకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవా యిద్యాలు,సుప్ర భాతసేవ ప్రాత: కాలపూజలు,మహా మంగళ హా రతులు జరిపించబడు తాయి.మహా మంగళ హారతులు సమయం నుంచే అనగా గం. 4.30ల నుంచి గం. 5.30గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శ నం కల్పించబడుతుంది.అనంతరం ఉదయం గం.6.00లకు శ్రీస్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలను మూసివేయ బడుతాయి.తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయద్వారాలను తెర చి ఆలయశుద్ధి,మంగళ వాయిద్యాలు,సుసాంధ్యం,సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్...

మహిళలు,బాలల రక్షణ – సైబర్,ట్రాఫిక్ భద్రతపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు...

Image
మహిళలు,బాలల రక్షణ–సైబర్,ట్రాఫిక్ భద్రతపై  జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు,బాలల రక్షణ,సైబర్ నేరాల నివారణ,ట్రాఫిక్ భద్రత,పోలీస్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.శుక్రవారం పాఠశాలలు,పట్టణాలు,గ్రామాలను సందర్శించి సీఐలు,ఎస్సైలు కలిసి వివిధ అవగాహన సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రధానంగా మహిళలపై నేరా లు,బాల్య వివాహాల నిరోధం,గుడ్ టచ్–బ్యాడ్ టచ్ పై అవగాహన,ఈవ్ టీజింగ్ పై ని యంత్రణ,సైబర్ నేరాలు,ఆన్‌ లైన్ మోసాలు,ట్రాఫిక్ నిబంధనలు,పోలీస్ సేవల గురించి సూచించారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు స మాచారం ఇవ్వాలని సూచించారు.శక్తి యాప్,అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించా ల్సిన డయల్ 112,డయల్ 100,1930 సైబర్ క్రైమ్,హె ల్ప్‌లైన్ గురించి వివరించారు.

ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీ పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది...

Image
ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీకి  పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది VS9TV న్యూస్,హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శు క్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా ఐదు వేల లంచం తీ సుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.అ ధికారుల వివరాల ప్రకారం...కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వ డానికి సంబంధించి లంచం డి మాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో లంచం స్వీకరిస్తున్న సమ యంలోనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ వారిలో పాలకుర్తి సా యి చరణ్ (స్టెనోగ్రాఫర్),పున్నం రజిత,కొమ్ము సునీత ఉన్నారు.సర్టిఫైడ్ కాపీ జారీ చే యడానికి ఐదువేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడిం చారు.పట్టుబడ్డ సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కోర్టు పరిధిలో అవినీతి చర్యలు చోటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు,ప్రజలు ఆగ్రహం వ్యక...

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేత నాలు,శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లిం చాలి...సిఐటియు...

Image
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు, శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి సిఐటియు VS9TV న్యూస్,కర్నూలు క్రైం :  డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ప నిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు స్కూల్ శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించా లని కోరుతూ శుక్రవారం కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.నాగభూషణంకి వినతిపత్రం సమర్పిం చారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.విజయ రా మాంజనేయులు నగర ఉపాధ్యక్షులు కే.సుధాకరప్ప,జి.ఏసు మాట్లాడుతూ కర్నూలు జిల్లా లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో వివిధ మండల ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వే తనాలు పెండింగ్ బిల్లులు మెగా పేరెంట్స్ సమావేశపు బిల్లులు అలాగే శానిటేషన్ వర్క ర్స్ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని,దీని వల్ల తమ కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు.మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ వేతనాలు రా కపోయినా మధ్యాహ్న భోజనం పథకానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అప్పులు తీసు కొని వచ్చి వం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

Image
22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి  కంది వరుణ్ కుమార్ యాదవ్, బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : విజయవాడలో ఈ నెల 22న జరుగుతున్న బిసివై పార్టీ సభను జయప్రదం చేయాలని బి సివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బిసివై పార్టీ ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్బంగా బిసివై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్,ప్రజా సం ఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 78 ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజలను కు క్కలుగా చూస్తున్నారు అని అన్నారు.ఈ నేపథ్యంలో బోడె రామ చంద్ర యాదవ్ బిసివై పార్టీ స్థాపించడం జరిగింది అన్నారు.బిసి సామాజిక వర్గంతోపాటు ఎస్సి,ఎస్టీ,మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు.కావున ఈ నెల 22న జరుగుతున్న సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్ర జా సంఘాల నాయకులు శేషఫణి,దరూర్ నరేష్,విజయ్ కుమార్,నాగేశ్వరరావు యాద వ్,శివకృష్ణ,బుడగజంగం మన...

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొ డిచి చంపిన భార్య...

Image
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య VS9TV న్యూస్,మంగళగిరి : ఏపీ–మంగళగిరి మండలం,పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశా యి.టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసిం ది.పోలీసుల సమాచారం ప్రకారం...పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మె కానిక్‌గా పనిచేస్తున్నాడు.ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది.అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసి స్తున్నారు.క్రాంతికి గతంలోనే వివాహం కాగా,ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలు స్తోంది.ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.ఇంట్లో టీవీ సౌండ్ త గ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది.ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ ను పొడిచినట్టు సమాచారం.తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ లికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.క్రాంతిని అదుపులోకి తీసుకు ని విచారణ కొనసాగిస్తున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత...

Image
ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత..  VS9TV న్యూస్,హైదరాబాద్ : సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయో మనం రో జూ చూస్తూనే ఉన్నాం.అనైతిక సంబంధాలు,అసాంఘిక పనులకు సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు కొందరు.తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వి వాహితను దారి తప్పేలా చేసింది.పెళ్లై,పిల్లలున్న వివాహిత సోషల్ మీడియా మాయలో పడింది.ఏపీలో పరిచయం అయిన వ్యక్తిని నమ్మి...అతని ప్రేమలో మునిగిపోయింది.కానీ ఆ నమ్మకంలో చేసిన తప్పు...చివరకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.వివరాల్లోకి వె ళ్తే...జార్ఖండ్‌కు చెందిన 30ఏళ్ల వివాహితకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరి చయం ఏ ర్పడింది.ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్‌ లో మునిగితేలారు.ఆపై ఆడియో,వీడియో కాల్స్‌ కూడా నడిచాయి.వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.తనను ధనవంతుడిగా, అనుభ వం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మే సింది.భర్త,ముగ్గురు చిన్నారులను వదిలి...ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రా రంభించాలని ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయి ఏపీ చేరుకుంది.కృష్ణాజిల్లా మచిలీ ప...

రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టి వేత...రూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బి య్యం...

Image
రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత రూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బియ్యం VS9TV న్యూస్,కోనసీమ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎస్సై జి.న రేష్ పట్టుకున్నారు.30 టన్నుల బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు.వాటిని పట్టుకుని ఆరా తీయగా రేషన్ బియ్యంగా వెల్లడయింది.విజయవాడ సమీపం నుంచి ఈ బియ్యాన్ని తీ సుకొస్తున్నారు.ఈ బియ్యం విలువ సుమారు రూ.10.8లక్షలు ఉంటుంది.దీనిపై ఎస్ఐ న రేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠ ను అరెస్టు చేశారు.కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్‌కు చెందిన లారీగా గుర్తించారు.అయి తే ఈ బియ్యం కాకినాడ వెళుతున్నట్లు వారు చెబుతున్నారు.కాని కోస్తా జిల్లాలోనే రేషన్ బియ్యం కొను గోలు కేంద్రంగా ఉన్న ఆలమూరు మండలం మోదుకూరు రైస్ మిల్లులకు ఈ బియ్యం వస్తున్నట్లు సమాచారం.ఈ బియ్యాన్ని మండపేట మండలం,వేములపల్లి గౌ డౌన్ లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసుస్టేషన్ కు తరలిస్తామని మండల సివి ల్ సప్లై అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు.

మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు...

Image
మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు భూవివాదాన్ని క్షేత్ర స్థాయిలో విచారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు ఆదేశం గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ శిక్ష విధించిన హైకోర్టు VS9TV న్యూస్,హైదరాబాద్ : భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉ ల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భా రీ షాక్ ఇచ్చింది.కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.శిక్షతో పాటు రూ.2వేల జరిమానా కూడా విధించింది.ఉన్నత స్థా యి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ...ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు...

Image
ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు 19 ఏళ్ల పాటు సాగిన అన్వేషణ ఎట్టకేలకు సఫలం 130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన బ్రిటిష్ సైనికుడు జర్నలిస్ట్ సహాయంతో తిరుమలగిరి  శ్మశాన వాటికలో సమాధి గుర్తింపు పూర్వీకుడి సమాధి వద్ద కన్నీటి నివాళులర్పించిన ముని మనవడు VS9TV న్యూస్, హైదరాబాద్ : ప్రేమ,అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన.ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో కన్నుమూసిన తన ముత్తాత సమా ధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లండ్ నుంచి నగరానికి వచ్చారు.19 సంవత్సరాల పాటు సాగించిన అన్వేషణ ఫలించడంతో,తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళు లర్పించారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా,తన ముత్తాత (తాతకు తండ్రి) చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు.చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగ ళూరు,మద్రాసులలో పనిచేశారు.ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పని చేస్తున్న సమయంలో,1906,ఆగస్టు,4న అనారోగ్యంతో తిరుమ...