Posts

రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ ఎసిబి... డిఎస్పీ వై.రమేష్...

Image
రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ  ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులు లో కొన్ని చెట్లు తొలగించడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భ ద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డిఓ సుజాత రూ. 10లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను,చర్ల ఇంచార్జ్ డిఆర్ ఓ కృష్ణయ్యను బహిరంగంగా పట్టుకున్నారు.చర్ల మండలం,పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి.ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డిఓ సుజాత రూ.10లక్షలు డిమాండ్ చేసి భ ద్రాచలం కార్యాలయంలో రూ.3.5లక్షలు లం చం తీసుకుంటూ డిఆర్ ఓతో పాటు పట్టుబ డ్డారు.గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభి వృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5లక్షలు లం చం తీసుకుంటు పట్టు బడ్డారు.అటవీ శాఖలో అవినీతి పేరుకు పోయింది.ఎటువంటి సమా చారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి ఉమ్మడి జిల్లాల వై.ర మేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బం ది పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్...

Image
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్,సర్వేయర్ VS9TV న్యూస్,బనగానపల్లె : నంద్యాల జిల్లా,బనగానపల్లె తహసిల్దార్ కా ర్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశా రు.లంచం తీసుకుంటున్న తహసిల్దార్,సర్వే యర్‌ను బహిరంగంగా పట్టుకున్నారు.వివరా లు ఇలా ఉన్నాయి...బనగాన పల్లె పట్టణంలో ని కోనాపురం నారాయణరెడ్డికి చెందిన 121 సర్వే నెంబర్ చుక్కల భూమిని పట్టా భూమి గా మార్చడానికి బనగాన పల్లె కరెంట్ ఆఫీస్ దగ్గర రూ.50 వేలు లంచం తీసుకుంటూ ముం దుగా మండల సర్వేయర్ హుస్సేన్ భాష పట్టు బడ్డారు.తర్వాత ఆయనతో నేరుగా బనగాన పల్లె తహసిల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయించా రు.ఈ క్రమంలో రూ.50,0 00 డబ్బులు తీసు కుని కార్యాలయంకు రావాలని ఎంఆర్ఓ సూ చించారు.దీంతో సర్వేయర్‌ను తీసుకుని కా ర్యాలయానికి వెళ్ళిన ఏసీబీ డిఎస్పి సోమన్న ఇద్దరినీ బహిరంగంగా పట్టుకున్నారు.
ఏడు వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ అ రెస్ట్ బోధన్ టూ టౌన్‌లో ఏసీబీ దాడి  VS9TV న్యూస్,బోధన్ : నిజామాబాద్ జిల్లా,బోధన్ టూ టౌన్ పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ చిటన్నోజు భాస్కరాచారి అవినీతి నిరో ధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టుబడ్డారు. తన సోదరుడి కొడుకు పేరును ఒక క్రిమి నల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫి ర్యాదుదారుడి నుండి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.ఈ విష యంపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో,వారి సూచనల మేరకు వలపన్ని,లంచం తీసుకుంటున్న సమ యంలో ఎస్ఐని పట్టుకున్నారు.అనంత రం ఆయనను అదుపులోకి తీసుకుని,కే సు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గ తమయ్యాయి.ప్రజలకు న్యాయం చేయా ల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా లం చాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దా రితీస్తోంది.

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

Image
ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్ ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం సన్మానించిన నగర సీపీ సజ్జనర్ నగదు పురస్కారం,ప్రశంసా పత్రం అందజేత VS9TV న్యూస్,హైదరాబాద్ :  నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కా దు.ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్.ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందు కు ప్రయత్నిస్తే...ప్రాణాలకు తెగించి,తన ఆటో నే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీషీటర్ ను అడ్డుకున్నా రు.కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘ టించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించి న ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జ నర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు.ఆయ నకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కా రాన్ని అందజేశారు.మార్చి,4వ తేదీ తెల్లవారు జామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతం లో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మా ర్నింగ్ వాక్‌కు వెళ్లారు.హిందీ మార్వాడీ విద్యా లయ స్కూల్ వద్దకు చేరుకోగానే,డబీర్‌పురకు చెంద...

సంచలనం...మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్...చెన్నై రాజకీయాల్లో సామాన్యుడు గె లుపు...

Image
సంచలనం...మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్ చెన్నై రాజకీయాల్లో సామాన్యుడు గెలుపు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :  తమిళనాడు,రోయపురం నియోజక వర్గంలో T VK అభ్యర్థి,ఆటో డ్రైవర్ విజయ్ ధాము 14 వేల ఓట్ల మెజార్టీతో చరిత్రాత్మక విజయం సా ధించారు.రాజకీయ ఉద్ధండులైన AIDMK మా జీ మంత్రి జయకుమార్,DMK అభ్యర్థి సుబైర్ ఖాన్లను ఆయన మట్టికరిపించారు.నిన్నటి వర కు ఆటో నడుపుతూ సామాన్యుల కష్టాలు చూసిన ధాము ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో అడుగుపెడుతుండటం విశేషం.ఆయనకి మొ త్తంగా 59,091 ఓట్లు వచ్చాయి.

భాజపా 'విజయ'దుందుభి...కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు...బాణసంచా మోత, మిఠాయిల పంపిణీ...

Image
భాజపా 'విజయ'దుందుభి:  కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు  బాణసంచా మోత,మిఠాయిల పంపిణీ VS9TV న్యూస్,కల్లూరు : దేశ రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ప్రభంజనం సృష్టించడంతో కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.సో మవారం కల్లూరు మండలం ప్రధాన కూడలి వద్ద భాజపా శ్రేణులు నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.బాణసంచా పేలుళ్లు,మో దీ నినాదాలతో కల్లూరు వీధులు మార్మోగా యి.ఈ విజయోత్సవ సభలో పార్టీ ముఖ్య నా యకులు మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచు కుపడ్డారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో 20 5 స్థానాల భారీ మెజారిటీతో మమతా కోటను బద్దలుకొట్టి,అధి కారాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.అ స్సాంలో హ్యాట్రిక్ విజయం,పుదుచ్చేరిలో వరు సగా రెండోసారి అధికారం చేపట్టడం ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు నీరాజనాలు ప డుతున్నారనడానికి నిదర్శనమన్నారు."ఇది ఆరంభం మాత్రమే...రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక వంటి దక్షిణాది రా ష్ట్రాల్లోనూ భాజపా జైత్రయాత్ర కొనసాగుతుం ది...డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ...

మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్...ఇబ్రహీం ప ట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం...పార్శిల్ వెనక్కి తెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు...

Image
మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్ ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం పార్శిల్ వెనక్కితెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు VS9TV న్యూస్,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం స్థానిక ఆల్ఫా హోటల్ నిర్వా హకుల తీరుమారడం లేదు.ఒక వినియోగ దా రుడికి ఆదివారం మాడిన బిర్యాని రైస్,కుళ్లిన చికెన్ అంటగట్టారు.సేకరించిన వివరాల ప్రకా రం కొండపల్లికి చెందిన యువకుడు ఇబ్రహీం పట్నం ఆల్ఫా హోటల్ లో ఆదివారం మధ్యా హ్నం చికెన్ మం డీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకువె ళ్లాడు.ఇంటి కి వెళ్లి విప్పి చూడగా రైస్ మాడు వాసన వస్తుండటం గమనించారు...తింటున్న సమయంలో చికెన్ కూడా కుళ్లిన వాసన రావ డంతో తిరిగి ఆల్ఫా యాజమాన్యా నికి ఫిర్యా దు చేశారు.ఆల్ఫా హోటల్ నిర్వాహకులు నిర్ల క్ష్య సమాధానం ఇవ్వటంతో పార్శిల్ ను హో టల్ ముందే పడేసి వెళ్లిపోయాడు.ప్రజల ఆరో గ్యాలతో చెల గాటమాడుతున్న ఆల్ఫా హోట ల్ నిర్వా హకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫి ర్యాదు చేస్తానని తెలిపాడు.గతంలో కూడా ఆ ల్ఫా హోటల్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతు న్నారు.

కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉపసం హరించుకోవాలి...సిపిఐ ధర్నా...

Image
కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉప సంహరించుకోవాలి సిపిఐ ధర్నా VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి. మహేష్ అధ్యక్షత న ధర్నా చేపట్టారు.ఈ సంద ర్బంగా సిపిఐ సీనియర్ నాయకులు మనోహర్ మాణి క్యం,నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కా ర్యద ర్శి పి.శ్రావణి రెడ్డిలు మాట్లాడుతూ భారతదే శంలోని ప్రజలను మోసం చేయడంలో భారతీ య జనతా పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదని ఎన్నికల ముందర ఒక మాట,ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం బిజెపి ప్ర భుత్వానికి చెల్లు అన్నారు.నరేంద్ర మోడీ,అమి త్ షా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎ ట్టి పరిస్థితుల్లో గ్యాస్,పెట్రోలు,డీజీలు ధరలు పెంచబోమని,అది ప్రభుత్వ భరిస్తుందని ప్రజ లను నమ్మబలికి ఓట్లు వేయించుకున్న మరు సటి రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లపై రూ960 పెంచడం చాలా దారుణమని మండి పడ్డారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిపై ...

ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి...డివైఎఫ్ ఐ...

Image
ఉల్చాల గ్రామంలో తాగునీటి సమస్య పరి ష్కరించాలి డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు రూరల్ : కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని డివైఎఫ్ఐ గ్రా మ కమిటీ డిమాండ్ చేసింది.సోమవారం గ్రా మ ప్రజలతో కలిసి గ్రామ సచివాలయం ముం దు డివైఎఫ్ఐ నాయకులు అంజి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్,డివైఎ ఫ్ఐ నాయ కులు అంజి,రాము,సుధాకర్,శి వ,రహీం, శ్రీకాంత్ లు మాట్లాడారు.కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో గ్రామ ప్రజలు మంచినీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.వారం రోజుల నుండి పది రోజులు,15రోజులు,20రోజులకు ఒకసారి మంచి నీళ్లు అందిస్తే ఎండాకాలంలో ఎలా ఉండాలని ప్రశ్నించారు.ప్రజల దాహంతో అధికారు లు ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బావాపురం స్కీం నుండి నీళ్లు రె గ్యులర్ గా వస్తున్నప్పటికీ పంపిణీ చేయడం లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నా రు.ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ కా ర్యదర్శి మొదలుకొని,ఎంపీ డీఓ దృష్టికి తీసు కువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్య క్తం చేశారు.వేసవిలో నీళ్లు అవసరం ఎక్కువ గా ఉంటుంది.ప్రతిరోజు అందించా...

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు... సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష...

Image
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ విజయంపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు సో మవారం కర్నూలు జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ సూచన మేరకు సిటీ కాంగ్రె స్ అధ్యక్షులు షేక్.జిలాని భాష ఆధ్వర్యంలో సం బరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నా యకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి,స్వీట్లు పం చుకుని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బం గా జిలాని బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో గెలుపోటములు సహజమని,భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయ న స్పష్టం చేశారు.అలాగే బిజెపి పతనం ప్రారం భమైందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ డిసిసి అధ్యక్షులు కే.బాబురా వు,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.బతుక న్న,ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్.సి.బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డి.వి.సాంబశివ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఉద్యోగి...

Image
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  GHMC ఉద్యోగి VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్లో GHMC ఉద్యోగి లక్ష లంచం తీ సుకుంటూ ఏసీబీకి చిక్కింది.బోరబండ GH MC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీలత,బాధితుడి ఇంటి నిర్మాణ అను మతి ఫైల్ క్లియర్ చేసేందుకు ఐదు లక్షల లం చం డిమాండ్ చేసింది.అందులో భాగంగా లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు బహిరం గంగా పట్టుకుని,అరెస్టు చేసి,కేసు నమోదు చేశారు.

నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్...

Image
నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్ VS9TV న్యూస్,వరంగల్ : నకిల నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మా ర్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులు తెలంగాణలో తక్కువ డబ్బుల కు,ఎక్కువ డ బ్బులను 1:3లో తయారు చేసి ఇస్తామని చె ప్పి కోరిన వారికి రూ.5 00 నోట్ల పరిమాణంలో నోట్ల కాగితాలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగు రు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్,నర్సం పే ట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశా రు.అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలి నో ట్లు నగదు రూ.1,48,000 సుమారు రూ.28ల క్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్,13 సెల్ ఫోన్లు రెండు కార్లులను స్వాధీనం చేసు కున్నారు.అదే విదంగా నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్,నీరటి శివ,నీరటి రంజిత్,గుడి కందుల రవి,ములుగు జిల్లా,ఘన్ పూర్ కు చెం దిన పోరిక రాజ్కుమార్ @ రాజు,ఖమ్మం జిల్లా, వేం సూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి,తాతానగర్ కు చెందిన ముదురుకో ల యాకంబరం,కారకగూడెం మండలం,కొత్త గూడెంకు చేను సాయికిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం...కరీం నగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపి డీ...

Image
పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం కరీంనగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపిడీ VS9TV న్యూస్,కరీంనగర్ : కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉ ద యం చోటుచేసుకున్న సాయుధ దోపిడీ స్థాని కంగా తీవ్ర కలకలం రేపింది.ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులకు తెగబడి,భారీ మొత్తం లో బంగారు ఆభరణాలను దోచుకుని పరార య్యారు.జ్యువెలరీ షోరూమ్‌ లోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో ప్రవేశించారు.లోపలికి వెళ్లిన వెంటనే ఆయు ధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించా రు.అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు.ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు వినిపించడంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు షోరూమ్ సిబ్బందికి గాయాల య్యాయి.గాయపడిన వారిని వెంట నే సమీప ఆస్పత్రులకు తరలించారు.ఇద్దరిని కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించగా,మరొ కరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిం చారు.దుండగులు షోరూమ్‌లో ప్రద ర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలను దోచు కుని పరారయ్యారు.జ్యోతి నగర్ గల్లీ వద్ద నుం చి పారిపోతున్న సమయంలో వారు ప్రయాణి స్తున్న బైక...

దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి...

Image
దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి VS9TV న్యూస్,హైదరాబాద్ : దేశరాజధాని దిల్లీలో అగ్నిప్రమాదం చోటుచే సుకుంది.ఏసీ పేలడంతో ఓ నివాస సముదా యంలో మంటలు చెరలేగాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.మరో నలుగురు గాయపడ్డారు.షాదార్‌లోని వివేక్‌ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా మంటలు వ్యా పించడంతో చాలా మంది భవనంలో చిక్కుకు పోయారు.సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 14అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదు పుచేశారు.ప్రమాదంలో మరింతమంది ప్రాణా లు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు.10మందిని రెస్క్యూ సిబ్బంది రక్షిం చారు.

ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య... పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

Image
ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,శ్రీరాంనగర్ లో ఆదివారం ప్రే మ విఫలం చెందడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన జరిగిన ట్లు మూడవ పట్టణ సిఐ పి.శేషయ్య పేర్కొన్నా రు.ఈ మేరకు సిఐ తెలిపిన వివరాలు...శ్రీరా మ్ నగర్ లో నివాసం ఉంటున్న బి.సి.బాలన్న రెండవ కుమారుడు బి.సతీష్(27) అను యు వ కుడు అదే వీధికి చెందిన జనార్ధన్ రావు కు మార్తె కల్పనాంజలిని పది సంవత్సరాలుగా ఒ కరినొకరు ప్రేమించుకున్నారని అన్నారు.అయి తే గత కొద్ది రోజుల క్రితం నుండి ప్రేమించడం లేదని,సతీష్ మన స్థాపానికిగురై,జీవితంపై వి రక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఎ వరు లేని సమయంలో బి.సతీష్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కొంత సమయం తరువాత అ తని తల్లి ఇంటికి వచ్చి చూసి,తదుపరి వారి ఇ తర కుటుంబ సభ్యులు అందరు సతీష్ ను క ర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళ గా,డాక్టర్ పరీక్షించి అప్పటికే మార్గమద్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ నేపథ్యం లో బి.సతీష్ తండ్రి అయిన బి.సి.బాలన్న ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ద ర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ పి.శేషయ...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

Image
చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య దేవాలయం వద్ద గల వివేక్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి నాగేంద్ర అను వ్యక్తి ఇంట్లో పని చేసే పనిమనిషి చోరీ చేసిన వస్తు వులు ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేసి నట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు. ఈ మేరకు సిఐ విక్రమ్ సింహ తెలిపిన వివరాలు ప్రకా రం...కృష్ణమూర్తి నాగేంద్ర ఏప్రిల్,2వ తేదీ నుండి 27వ తేదీ మధ్యలో తన పనుల నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్ళాడు.ఆ సమయంలో పనిమనిషి పర్వీన్ ఇదే అదనుగా యజమాని కృష్ణమూర్తి నాగేంద్ర ఇంటిలోని సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు,30 తు లాల వెండి వస్తువులను చోరీ చేయడం జరిగిందని అ న్నారు.యజమాని కృష్ణ మూర్తి నాగేంద్ర ఇంటికి తిరిగి వచ్చాక చోరీ జరిగి నట్లు గుర్తించాడు.దీంతో నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు చెప్పా రు.పిర్యాదు మేరకు ఎస్సై గోపినాథ్,చంద్రశేఖర్,హెడ్ కానిస్టే బుల్ జీనస్,కాని స్టేబుళ్లు మురళి, సుబ్బారా యుడు...

NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం...

Image
NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ముగ్గురు ఎంపిక కావడం జరిగింది.ఇందులో డాక్టర్.సింధియా శుభ ప్రద,ప్రొఫెసర్,విభాగాధిపతి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం,వైస్ ప్రిన్సిపల్ డా.బాలే శ్వరి,ప్రొఫెసర్,హెచ్. ఓ.డి.పేథాలజీ విభాగాధిపతి.డా.జయరాం,ప్రొఫెసర్, సర్జరీ విభాగం.వీరు ముగ్గురు మూడు సంవత్సరాల కాలం యూనివర్సిటీకి సెనేట్ మెంబర్ గా ఉంటారు. యూనివర్సిటీకి వైద్య విద్యలో స్టాండర్డ్స్ పెంచేందుకు సిలబస్,టీచింగ్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ లాంటి మొ దలగు విషయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసిన రెక మండే షన్స్ ను సెనేట్ మెంబర్ లు స్టడీ చేసి యూని వర్సిటీ కి తీర్మానాల రూపంలో అప్రూవల్ కొరకు సిద్ధం చేస్తా రు.అందిస్తారు.కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ము గ్గురు వైద్యులను యూనివర్సిటీ సెనేట్ సబ్యులుగా ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎంపికైన ము గ్గురు ప్రొఫెసర్ లకు అడిషనల్ డీఎంఈ,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక...

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

Image
10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత  ఉత్తమ ఫలితాలు సాధించిన  విద్యార్తులకు స న్మానం ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికారి VS9TV న్యూస్,కల్లూరు : పదవ తరగతి ఫలితాల్లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అని క ల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివా సులు విద్యార్థులను కొనియాడారు.ఈ మేరకు శుక్ర వారం 32వ వార్డ్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల (ఉర్దూ)లో విద్యార్థులకు అభినందన స భ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధా నోపాధ్యా యులు సి.వీరేశప్ప,విద్యార్థులను కల్లూరు మండలం,ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ,ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ మొదటి సారి 10వతరగతి మొదటి బ్యాచ్ లో ఉర్దూ పాఠశాలలో అద్బుతంగా 14/15, పాస్ కావడం 93% ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.ప్రధమ,ద్వీతీయ,తృతీయ ర్యాంక్ లు సాధించిన విద్యార్తులను సన్మానించి,వారు ఇంటర్మీడి యట్ చదువు కొరకు తన వంతుగా.ప్రధమ,ద్వితీ య ర్యాంక్ విద్యార్థులకు రూ.2000,తృతీయ ర్యాంక్ విద్యార్ధికి రూ.1000 నగదు అందచేసినట్లు పేర్కొ న్నారు.ఉన్నత చ...

పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్,క ల్లూరులో ఘనంగా మేడే వేడుకలు...

Image
పందిపాడు ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టే ట్,కల్లూరులో ఘనంగా మేడే వేడుకలు VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,పందిపాడు ఆటో యూనియన్,హమాలి యూనియన్,ము జఫర్ నగర్ హమాలి యూనియన్,ఆటో యూనియన్,భవన ని ర్మాణ కార్మిక సంఘం,సుందరయ్య నగర్ ఆటో యూ నియన్ జెండాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీ సీడ్స్ హమాలి యూనియన్,హరిహర రైస్ మిల్ యూని యన్,ఎస్టేట్ ఒంటెద్దు బండ్లు,సిల్వర్ ఫ్యాక్టరీ కార్మికు ల యూనియన్,ఎస్టేట్ హమాలి యూనియన్,కల్లూ రు ప్రాంతాలలో కల్లూరు సెంటర్ హమాలీ యూని యన్,కల్లూరు మట్టి పని అడ్డ,సిపిఎం పార్టీ జెండాల ను 140 మే డే పురస్కరించుకొని సి.హెచ్.సాయిబా బా,కె.సుధాకరప్ప,ఎం.సి.ఆనంద్,కె.సురేష్,బి.వెంకట రమణ,గోవింద్,హనుమం తు,శేఖర్ లు ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కోశాధికారి సి.హెచ్.సాయిబాబా,ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రిందట వేలాది మం ది కార్మికులు 8 గంటల పనిదినాల కోసం అమెరికా దే శంలోని చికాగో నగరంలో వీరోచితంగా పోరాడి పో లీ సులు జరిపిన కాల్పులలో రక్తతర్పణం అర్పించిన కా ర్మికుల రక్తంలో తడిసిన జెండానే ఎర్రజెండా కార్మికు లకు రక్షణ జండా ఎనిమిది గంటల పనిది...

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి...జి.సం తోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు...

Image
మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి జి.సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసు కోవా లని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.మెడికల్ మాఫీయా వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూ లు నగరంలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి ఏఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ.శ్రీరాములు అధ్యక్షత వ హించగా రాష్ట్ర అధ్యక్షులు జి.సంతోష్ కుమార్ హాజ రై మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాల్లో మెడి కల్ మాఫియా విస్తరిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలి గిస్తోందని పేర్కొన్నారు.ప్రజారోగ్యం అనే అత్యంత కీ లక రంగాన్ని కొంతమంది లాభాపేక్షతో దోపిడీకి గురిచే యడం దురదృష్టకరమని అన్నారు.ప్రైవేట్ హాస్పిట ల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపో తూ ప్రభుత్వ నిబంధన లు పక్కనబెట్టి పనిచేస్తున్నాయని విమర్శించారు.పే ద,మధ్యతరగతి కుటుంబాల బలహీనతను ఆసరా గా చేసుకుని అవసరం లేని పరీక్షలు,చికిత్సలు పేరు తో భారీ బిల్లులు వేస్తూ వారి ఆర్థిక స్థితిని దెబ్బతీ స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా కొంత మ...

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి...పదివేలు తీసు కుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై.రమేష్...

Image
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,గుండాల : పోడు రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో గురు వారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రైతు నుండి పదివేలు లంచం తీసుకుంటు గుండాల మండ లం,నడిమిగూ డెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి ప  ట్టుబడ్డారు.మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫి ర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డిఎస్పీ వై.రమేష్. ప్రజలను చైతన్య వంతులను చేశారు.ఫిర్యాదు రాగా నే స్పందించడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిం ది.గుండాల మండలం,సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసు కుంటు బీట్ అధికారి ఏసీబీకి చిక్కారు.

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరు కు స్వాధీనం...నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ ఫోన్లు సీజ్...

Image
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరుకు స్వాధీనం నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ఫోన్లు సీజ్ VS9TV న్యూస్,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రూ రల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహ న తనిఖీలు చేపట్టిం ది.ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టు బడింది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మా ర్కెట్‌లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.అరెస్ట్ అయిన నిందితు లను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్,చందు,సింహాద్రి, అ రవింద్,విగ్నేష్‌గా గుర్తించారు.వీరి నుంచి ఒక కా రు,మూడు బైకులు,ఐదు సెల్‌ఫోన్లను కూడా స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.గంజాయి రవాణాపై ఉక్కు పా దం మోపుతామని,ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.

మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల విద్యార్థు ల విజయదుందుభి...10లో ప్రతిభ చాటిన విద్యార్థు లకు అభినందనలు...దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం అధ్యక్షులు...

Image
మట్టిలో మాణిక్యాలు...ప్రభుత్వ పాఠశాల వి ద్యార్థుల విజయదుందుభి 10లో ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన లు దాసరి మోహన్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం అధ్యక్షులు VS9TV న్యూస్,కల్లూరు : నేటి సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి తమ పిల్లలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఆర్థికంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న తల్లి,తండ్రులు అనేకం.అ లాంటి వారికి కనువిప్పు కలిగించేలా ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న విద్యా ర్థులు తమ సత్తా చాటుకు ని అత్యధిక మార్కులు సాధించి,మట్టిలో మాణిక్యా లుగా ఖ్యాతి గాంచిన మేఘన,సుమయ,బి.ఈశ్వర్ ల ను ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దే వాలయం కమిటీ బృందం ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసరి మెహన్ ఒక ప్రకటనలో అభినందనలు తెలి యచేశారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగ తి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నేపథ్యంలో కర్నూలు నగరం,32వ వార్డు,ముజఫర్ నగర్,జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న విద్యా ర్థులు మేఘన,సుమయ,బి. ఈశ్వర్ లు తమ ప్రతిభ చాటుకున్నారు.ప్రధమ స్థానంలో మేఘన (540/60 0),ద్వితీయ స్థానంలో సుమయ (509/600),తృతీ య స్థానంల...

పెండ్లి పేరుతో భారీ మోసం...? సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు...

Image
పెండ్లి పేరుతో భారీ మోసం...?  సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు VS9TV న్యూస్,హైదరాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపా యల నగదు,బంగారం,ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో బిగ్‌బాస్ ఫేం,సినీనటి అషురెడ్డి (అలియాస్ వెంకట అశ్విని రెడ్డి)పై నమోదుైన భారీ మోసం కేసులో పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు.ఎన్ఆర్ఐ ధ ర్మేందర్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్ఐ ఆర్ నమోదు కాగా,కేసును సీసీఎస్ పోలీసులు ప్రాధా న్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.బాధి తుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీలకు సం బంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు.ఈ నేపథ్యంలో అషురెడ్డితో పాటు ఆమె త ల్లిదండ్రులు వెంకటకృష్ణ,యశోద రెడ్డి,సోదరి దివ్వరె డ్డికి కూడా నోటీసులు జారీచే సి విచారణకు పిలిచేం దుకు సిద్ధమవుతున్నారు.ఇక ధర్మేందర్ విడుదల చే సిన ఆడియోలో కీలక ఆరోపణలు చేశారు.మొదట అషురెడ్డిపై కేసు పె ట్టాలనే ఉద్దేశం తనకు లేదని,కానీ ఆమె తనపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డి మాండ్ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.ప రి స్థితులు తీవ్రమవడంతోనే కుటుంబం కేసు పెట్టాల్సివ చ్చిందని తెలిపా...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు...హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి...జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమ లు చేయాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్),డివైఎఫ్ ఐ డిమాండ్...

Image
ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించా లి జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మో హన్ రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో బుధవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో యుజెఎఫ్ వ్యవస్థపాక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ అధ్యక్షతన కొవ్వొతులతో నివా ళులు అర్పించారు.కార్యక్రమానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కు మార్,యు.రాజశేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు హజరయ్యారు.ఈ సంద ర్బంగా నీలం సత్యనారాయణ,డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,పి.యూసుఫ్ ఖాన్,గిలి గిత్త విజ య్ కుమార్,యు.రాజశేఖర్,వి.విజయ్ కుమార్,వార ణాసి ప్రసాద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని అన్నారు.ఇప్ప టికే వార్తలు రాసిన జర్నలిస్ట్ లపై అక్ర...

ప్రజల భద్రతే లక్ష్యం...విజిబుల్ పోలీసింగ్...విస్తృత తనిఖీలు...అనుమానితులపై ప్రత్యేక దృష్టి... జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ...

Image
ప్రజల భద్రతే లక్ష్యం. విజిబుల్ పోలీసింగ్ విస్తృత తనిఖీలు  అనుమానితులపై ప్రత్యేక దృష్టి జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పో లీసింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళ వా రం రాత్రి 11-00నుంచి తెల్లవారు జామువరకు క ర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి.మారుతి శంకర్ ఆధ్వ ర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని కొం డారెడ్డి బురుజు వద్ద క్యూఆర్‌టీలు,బ్లూ కోల్ట్స్ సిబ్బం దికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.రాత్రి 11-00గంటల తర్వాత దుకాణాలు మూసివేయడం పర్య వేక్షించడంతో పాటు,ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా నిరంతరం పహారా నిర్వహించా రు.అనుమానాస్పద వ్యక్తులను తనిఖీలు చేశారు.రా జ్ విహార్ సెంటర్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టా రు.మయూరి లాడ్జ్‌లో తనిఖీలు నిర్వహించి,అను మానాస్పద అసాంఘిక కార్యక లాపాలపై నిఘా ఉం చారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని,వి జిబుల్ పోలీసింగ్ లో భాగంగా కాలినడకన పర్యటి స్తూ,పోలీసు వాహనాలతో సైరన...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్...

Image
ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగ న్మో హన్ రెడ్డి దారుణ హత్యను యునైటెడ్ జర్నలిస్ట్ ఫో రం (యుజెఎఫ్)తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు మంగళవారం ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షం చాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవ స్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సభ్యులు యూసుఫ్ ఖాన్ రాజశేఖర్,జి.విజయ్ కుమార్,నాగేం ద్ర,కిషోర్, వై.వి.రెడ్డి,వి.విజయ్ కుమార్,మెట్రోమధు,ప్ర సాద్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.అ దేవిదంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహాకారం అందించాలని కోరారు. సుప్రీం కోర్టు,హైకోర్టులు జర్నలిస్ట్ లపై దాడులను ఖం డిస్తూ ఆదేశాలు జారీ చేసిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భ విష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ప్రభుత్వం జర్నలిస్ట్ రక్షణ చట్టం అమ లు చేయాలనీ వా...

రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్...ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు...

Image
రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు VS9TV న్యూస్, కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల లో రాత్రి వేళల్లో కర్నూలు పోలీసులు విస్తృతంగా వి జిబుల్ పోలీసింగ్,తనిఖీలు చేపడుతున్నారు.సోమ వారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రాత్రి గస్తీ,తనిఖీలు,అను మానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చె కింగ్‌లు,“స్టాప్ అండ్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అనుమానాస్పద వ్యక్తులను,వా హనాలను పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు.రోడ్డు భద్రత,ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. వాహనదారులకు భద్రతా సూచనలు తెలియజేశా రు.ప్రజలు అనుమానాస్పద ఘటనలను వెంటనే పో లీసులకు తెలియజేయాలని,ట్రాఫిక్ నిబంధనలు త ప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొ నసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...

Image
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు VS9TV న్యూస్,బాపట్ల : బాపట్ల,మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారు లు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ రూ.60000లలో రూ.25000 లంచం,రూ.35000 చలానా రూపంలో తీసుకుంటూ పట్టుపడ్డారు.చిన్నగంజాం మండలం,కొత్తపేటకు చెం దిన బాధితుడు దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పే రు మార్పు ఫీజు రూ.60000 అడిగారని,బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించగా,ఏసీబీ అధికారులు సూర్య లంక రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద నగదు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో బహిరంగంగా పట్టుకున్నారు. ఈ సంఘటనతో బాపట్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.విషయం తెలిసిన వెంటనే బాపట్ల మున్సిప ల్ కార్యాలయంలో ఏ సిబ్బంది తమ సీట్లలో లేకుండా పరారయ్యారు.

వైన్ షాపులు,బార్లలో ముమ్మర తనిఖీలు... చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ...

Image
వైన్ షాపులు,బార్లలో ముమ్మర తనిఖీలు చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ప్రొహిబిషన్,ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు,బార్లలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిష న్ అండ్ ఎక్సైజ్ పి.శ్రీదేవి,జిల్లా ప్రొహి బిషన్,ఎక్సైజ్ అధికారి ఎం.సుధీర్ బాబులు శనివారం వేరువేరుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు కర్నూలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ చంద్రహాస్ పేర్కొన్నారు.వారి వివరాలు ప్రకారం...వైన్ షాపులు బారులను తనిఖీ చేసి మ ద్యం యొక్క నాణ్యతను పరిశీలించి,మద్యం బాటిల్ల  యొక్క స్కానింగ్ ను నిశితంగా పరిశీలించడం జరి గిందన్నారు. ప్రతి ఒక్క బాటిల్ సురక్ష ఆప్ ద్వారా స్కాన్ చేయా లని,సమయపాలన పాటించాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,సిబ్బంది పాల్గొన్నారు.

పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం...రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పను లకు భూమిపూజ...ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి...

Image
పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,పరిధిలోని పందిపాడు,ఇందిరమ్మ కా లనీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే,టీడీపీ నంద్యాల జి ల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు.శు క్రవారం 35వ వార్డులోని గోడల ఆంజనేయస్వామి దే వాలయం సమీపాన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ వ ద్ద పందిపాడు లే అవుట్ లో డబ్ల్యూ బిఎం రోడ్డు ని ర్మాణ పనులకు ఆమె భూమిపూజ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధే ధ్యేయం : సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడా రు.నియోజకవర్గంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని,గత ప్రభు త్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలను ఇప్పు డు,అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు.ప్రజల అ...

అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి స్వాదీనం...

Image
అటెండర్ ఇంట్లో 760 గ్రాములు గోల్డ్, 8కేజీలు వెండి VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో A CB జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డా యి.760 గ్రాముల బంగారం,దాదాపు ఎనిమిది కిలోల వెండి, రూ.22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,ఒక భవనం,స్థ లాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.గతంలో రూ.16 వేలు లంచం తీ సుకుంటూ బహిరంగంగా పట్టుబడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.

తాడేపల్లిలో ఇంధన సెగ...పెట్రోల్ బంకుల వద్ద బారు లు తీరిన వాహనదారులు...

Image
తాడేపల్లిలో ఇంధన సెగ  పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు VS9TV న్యూస్,తాడేపల్లి : తాడేపల్లి పరిధిలో పెట్రోల్,డీజిల్ కొరత సామాన్య ప్ర జలను ఇబ్బందుల్లోకి నెట్టింది.గత కొంతకాలంగా ఇం ధన సరఫరాలో అంతరాయం కలగడంతో,స్థానిక పె ట్రోల్ బంకుల వద్ద వాహనదారు లు భారీగా క్యూ క ట్టారు.పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమి స్తుండటంతో,స్టాక్ ఉన్న పరిమిత బంకుల వద్దకు వా హనదారులు పోటెత్తారు.ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆ టోలు కిలోమీటర్ల మేర రహదారిపైనే వేచి ఉండటం తో రాకపో కలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక వాహ నదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు,అత్యవసర పనుల మీద వెళ్లే వారు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్ర భుత్వం,చమురు సంస్థలు వెంటనే స్పందించి ఈ కొర తను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పను లకు శ్రీకారం...భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి...

Image
కల్లూరు 41వ వార్డులో రూ.60లక్షల సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం భూమిపూజలో ఎమ్మెల్యే గౌరుచరితా రెడ్డి VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీ ఎబినేజర్ చర్చి లైన్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద రూ.60లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహిం చారు.కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే,టీడీపీ నంద్యా ల జిల్లా అధ్యక్షురాలు గౌరుచరితా రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షు రాలు కమ్మరి పార్వతమ్మ,టీడీపీ యువ నాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబు లేష్ కూడాహాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భం గా అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.అనంతరం స్థాని క ప్రజలు ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి కాల నీలో నీటి నిల్వ సమస్యలు నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి కె.జనార్ధన్ ఆచారి, 41వ వార్డు ఇన్‌చార్జి నాగేశ్వరరావు,37 వ వార్డు ఇన్‌ చార్జి సుతారు రాఘవేంద్ర,టీడ...

న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి...జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని...

Image
న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని VS9TV న్యూస్,కడప : మన ప్రజాస్వామ్య దేశంలోని కార్యనిర్వాహక వ్యవ స్థలు చట్టబద్ధంగా నడవకుండా ఉన్న సమయంలో ఆ వ్యవస్థలను చట్టబద్ధంగా నడిచే విధంగా చేసే న్యా యవ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయ మూర్తి యామిని అన్నారు.భారత న్యాయవాదుల సంఘం ( ఐఏఎల్ ) కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమి టీ అధ్యక్షులు వి.రాజగోపాల్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ,ప్రధాన కార్యదర్శి నాగ అర్చన,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ.బాలసుబ్బయ్య,నగర ఆర్గనైజర్ కార్య దర్శి రాజశేఖర్,ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్,బాలయ్య,తదితరులు గురు వారం గౌరవార్థం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి న సందర్భంగా ఆమె మాట్లాడారు.న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా న్యాయవాదులపై ఉంటుందని ముఖ్యంగా న్యాయవాద సంఘాల నాయకులపై మరింతగా బా ధ్యత ఉంటుందని ఆమె తెలిపారు.

మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్...కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
మత్తు వ్యసనాల నిర్మూలనకు కర్నూలులో భారీ వాకథాన్ కర్నూలును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిది ద్దడమే లక్ష్యం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగం గా కర్నూలు నగరంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,అవగాహన కల్పించేందుకు ఈ గల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ నిర్వ హించారు.ఈ ర్యాలీ రాజ్ విహార్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద గురువారం జెండా ఊపి వాక థాన్‌ను ప్రారంభించారు.ఈగల్ టీం ఎస్ఐ సుజన్ కు మార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీ సులు,విద్యార్థులు,యువత,స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భం గా...“Say No to Drugs”, “Drug Free Society” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చై తన్యం కల్పించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉం డాలని,ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలు అందించారు.అలాగే ప్రజ లు ఈగల్ టీం టో ల్ ఫ్రీ నంబర్ 1972 ద్...

అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా...ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్...

Image
అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అ రెస్ట్? ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ VS9TV న్యూస్,అనంతపురం : అనంతపురంలో కలకలం రేపుతున్న హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది.అమాయకుల ను,ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి,లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూ త్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.నిందితులతో నరేందర్ రెడ్డి నిరంతరం టచ్‌ లో ఉన్నట్లు కాల్ డేటా,వాయిస్ రికార్డుల ద్వారా పో లీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.దీంతో ఆయన ను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్న ట్లు సమాచారం.ఈ కేసులో 'కింగ్' గా పిలవబడే రంగ మ్మ నాయుడు (చిన్ని నాయుడ మ్మ),రాజేశ్ తో పా టు జయలక్ష్మి,మల్లేశ్వరి,అనంత కుమారి అనే ము గ్గురు మహిళలను పోలీసులు ఇప...

యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా...గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్... సిఐ రాజేష్...

Image
యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్ సీఐ రాజేష్ VS9TV న్యూస్,పల్నాడు : పల్నాడు జిల్లా,దాచేపల్లిలో 'యాసిన్' పొదుపు గ్రూపు పొదుపు సంగానికి చెందిన ఏడు లక్షలు నిధులను గ్రూప్ లీడర్ నూర్జహాన్ తన వ్యక్తిగత అవసరాలకు గోల్ మాల్ చేసింది.సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీ ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.గురువారం నిందితు రాలిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రి మాండ్ విధించారు.అనంతరం ఆమెను గురజాల జై లుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు...

Image
బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు VS9TV న్యూస్,శ్రీ సత్యసాయి : అక్రమాస్తుల కేసులో ACBకి చిక్కిన సహాయ బీ సీ సంక్షేమ అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భా రిగా ఆస్తులను అధికారులు గుర్తించారు.వివరాలు ఇలా ఉన్నాయి...శ్రీ సత్యసాయి జిల్లా,కదిరి డివిజన్, కదిరికి చెందిన సహాయ బీసీ సంక్షేమ అధికారి పురం బాలాజీపై ఫిబ్రవరి,5న ACB వల పన్ని పట్టు కున్న (trap case) ఘటన అనంతరం,ఆయన తన చట్ట బద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూ డగట్టారన్న ఆరోపణలపై అనంతపురం ACB అధికా రులు మరొక కేసును నమోదు చేసి,దర్యాప్తు చేపట్టా రు.నిందితుడైన పురం బాలాజీ,1987వ సంవత్సరం లో హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-I I)గా నియమి తులై,కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశా రు.తర్వాత రాయచోటిలో పని చేస్తున్న సమయంలో 2011లో ఆయన హాస్టల్ సంక్షేమ అధికారి (Gra de-I) పదవికి పదోన్నతి పొందారు.అక్కడ కొంతకాలం కొనసాగిన తర్వాత,మట్లిలలో పనిచేశారు.ఆ త ర్వా త 2016వ సంవత్సరంలో ఆయన సహాయ బి.సి. సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతి అ ర్బన్ డివిజన్‌కు బదిలీ అయ్యారు.2023,జూన్,1 నుండి కదిరి డివిజన్‌లో పని...

కేరళలో వెల్లివిరిసిన మానవత్వం...అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Image
కేరళలో వెల్లివిరిసిన మానవత్వం అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆ ర్టీసీ బస్సు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఎస్.ఎ ల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్క డ ఒక యువతి బస్సు దిగగా,ఆ ప్రాంతం చీకటిగా,ఎ వరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కు మార్,కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళ న చెందారు.భద్రత కోసం నిలిచిపోయిన బస్సు యు వతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్,ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకు న్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం,ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పు కున్నారు.మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.అమ్మవడిగా మారిన బస్సు యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్క డికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది.బస్సులో ప్ర యాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విష...